ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దక్షిణ ఆసియాలో టీకాలు వేసే కార్యక్రమంపై ప్రపంచ బ్యాంక్ ఇంటర్ మినిస్టీరియల్ మీటింగ్‌లో డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రసంగించారు

"మూడు స్వదేశీ సంస్థలతో పాటు మొత్తం 8 మంది భారతదేశంలో వ్యాక్సిన్ తయారీలో ఉన్నారు"

"కఠినమైన పర్యవేక్షణతో పాటు శాస్త్రీయ మరియు నియంత్రణ నిబంధనలపై రాజీ లేదని మేము నిర్ధారిస్తున్నాము. ట్రయల్స్ నుండి టీకాల సమర్థత వరకు పటిష్టమైన వ్యవస్థ విస్తరించి ఉంది"

"కో-విన్ డిజిటల్ ప్లాట్‌ఫాం పౌరులు టీకా కోసం స్వీయ నమోదు చేసుకోవడానికి, వారి స్థితిని పర్యవేక్షించడానికి మరియు క్యూఆర్ కోడ్ ఆధారిత ఎలక్ట్రానిక్ టీకా సర్టిఫికెట్‌ను అందించడానికి ఉపయోగపడుతుంది"

Posted On: 10 DEC 2020 6:54PM by PIB Hyderabad

కొవిడ్-19 నివారణ కోసం దక్షిణాసియాలో టీకాలు వేయడంపై ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో జరిగిన అంతర్ మంత్రివర్గ సమావేశంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు.


కొవిడ్-19 మహమ్మారిపై భారతదేశం చేపట్టిన చురుకైన, ముందస్తు ఏర్పాట్లు, ప్రభుత్వ మరియు సమాజ విధానం యొక్క వివరణాత్మక సారాంశంపై డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ  “సమర్థవంతమైన ప్రణాళిక మరియు వ్యూహాత్మక నిర్వహణ కారణంగా భారతదేశంలో మిలియన్ జనాభాకు 7,078 కేసుల వద్ద నియంత్రణ చేయబడింది. అదే ప్రపంచ సగటు చూసుకుంటే ఆ సంఖ్య 8,883 గా ఉంది. అలాగే మరణాల రేటు ప్రపంచ సగటు 2.29 శాతం ఉండగా అది భారతదేశంలో  1.45 శాతంగా ఉంది" అని వివరించారు.


కొవిడ్ టీకా పంపిణీ నైపుణ్యం, భారతదేశం యొక్క ఉత్పత్తి మరియు నిల్వ సామర్థ్యం గురించి అనుభవజ్ఞులైన మరియు విస్తారమైన నిపుణుల నెట్‌వర్క్ గురించి ఆయన ప్రేక్షకులకు వివరించారు. సదస్సులో ఆయన మాట్లాడుతూ “భారతదేశంలోని ప్రపంచ స్థాయి పరిశోధనా సంస్థలు కొవిడ్-19 కు వ్యతిరేకంగా జరిగిన ప్రచారానికి నాయకత్వం వహించాయి. అలాగే ప్రస్తుతం వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి, పంపిణీ చేయడానికి మరియు నిర్వహించడానికి అవసరమైన సామర్థ్యం పెంపొందించడానికి కృషి చేస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 260 సంస్థలు వ్యాక్సిన్ అభివృద్ధి యొక్క వివిధ దశలలో ఉన్నాయి. వీటిలో మూడు దేశీయ సంస్థలు సహా 8 సంస్థలు భారతదేశంలో ఉన్నాయి. టీకా పరిశోధన కోసం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలతో కలిసి పనిచేస్తున్న యూకేకు చెందిన ఆక్స్‌ఫర్డ్‌  విశ్వవిద్యాలయం మరియు యుఎస్ఎలోని థామస్ జెఫెర్సన్ విశ్వవిద్యాలయం వంటి అంతర్జాతీయ భాగస్వామ్య సంస్థలకు మేము చురుకైన మద్దతు అందిస్తున్నాము" అని చెప్పారు.


ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ యొక్క బలమైన రాజకీయ నిబద్ధతను అందరికీ గుర్తు చేస్తున్నాను. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో నిమగ్నమైన ఔషధ సంస్థల తయారీ సౌకర్యాలను సందర్శించడం, శాస్త్రవేత్తలను ప్రోత్సహించడం మరియు ఈ ప్రక్రియను ఉత్ప్రేరకపరచడం ద్వారా వ్యాక్సిన్ ఉత్పత్తిని వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు “రాబోయే కొన్ని వారాల్లో టీకా లభిస్తుందని భావిస్తున్నాము. సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీ ఆమోదించిన వెంటనే భారతదేశంలో టీకా ప్రక్రియ మొదలవుతుంది. కఠినమైన పర్యవేక్షణతో పాటు శాస్త్రీయ నియంత్రణ నిబంధనలపై రాజీ లేదని, ట్రయల్స్ యొక్క భద్రత నుండి టీకాల సమర్థత వరకు మేము భరోసా ఇస్తున్నాము. ” అని తెలిపారు.


భారతదేశం యొక్క మిషన్ ఇంద్రధనస్సు టీకాల ప్రక్రియను ప్రస్తుత డిజిటల్ మాధ్యమాలు ఎలా ప్రభావితం చేస్తున్నాయో కూడా డాక్టర్ హర్ష్ వర్ధన్ వివరించారు. భారతదేశం అధునాతన కోవిన్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను నిర్మిస్తోంది. ఇది పౌరులకు టీకాలు వేయడానికి స్వీయ-నమోదు చేసుకోవడానికి, వారి స్థితిని పర్యవేక్షించడానికి మరియు ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యూఆర్ కోడ్ ఆధారిత ఎలక్ట్రానిక్‌ సర్టిఫికెట్‌ను అందించడానికి ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అవసరమైన వ్యాక్సిన్ల సంఖ్యను ప్రభుత్వం విశ్లేషించింది. అలాగే  ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలు మరియు శ్రామిక శక్తిని పెంచే దిశగా కృషి చేస్తున్నారని ఆయన అన్నారు.



 


ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్ 19 కు వ్యతిరేకంగా జరిగిన  పోరాటంలో ముందంజలో ఉన్న కరోనా యోధుల ధైర్యం మరియు త్యాగాన్ని స్మరించుకోవడం ద్వారా మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

***


(Release ID: 1679873) Visitor Counter : 299