చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
ఇ-కోర్టు ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా హైస్పీడ్ వైడ్ ఏరియా నెట్ వర్్క (WAN)తో అనుసంధానం చేయాలని లక్ష్యించిన 2992 కోర్టుల సముదాయాలలో 2927 సముదాయాల అనుసంధానం
Posted On:
11 DEC 2020 12:13PM by PIB Hyderabad
సుదూర ప్రాంతాలలో (సాంకేతికంగా సాధ్యం కాని (టెక్నికల్లీ నాట్ ఫీజిబుల్ -టిఎన్ ఎఫ్) ప్రాంతాలలో ఆర్ ఎఫ్, విశాట్ తదితరాల వంటి ప్రత్యామ్నాయ పద్ధతులు
ఇటీవలే ప్రారంభించిన సబ్ మెరైన్ (సముద్ర గర్భంలో కేబుల్) ద్వారా త్వరలోనే అండమాన్ నికోబార్ దీవులలో 5 టిఎన్ ఎఫ్ ప్రాంతాల అనుసంధానం
న్యూఢిల్లీ, డిసెంబర్ 11, (పిఐబి): భారత దేశ వ్యాప్తంగా ఉన్న కోర్టు సముదాయాలలో 2927 సముదాయాలను ఇ-కోర్టుల ప్రాజెక్టు కింద హైస్పీడ్ వైడ్ ఏరియా నెట్‌వర్్క (WAN)తో అనుసంధానం చేయడం జరిగింది. అనుసంధానం చేయాలని సంకల్పించిన 2992 సముదాయాలలో ఈ ప్రాజెక్టు కింద హైస్పీడ్ వాన్ ద్వారా 97.86% న్ని అనుసంధానం చేసేందుకు దారి తీసింది. న్యాయ శాఖ (డిఒజె), బిఎస్ ఎన్ ఎల్ కలిసి మిగిలిన ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 2992 కోర్టు సముదాయాలను ఆప్టికల్ ఫైబర్ కేబుల్ (ఒఎఫ్‌సి), రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ ఎఫ్), వెరీ స్మాల్ అపెర్చర్ టెర్మినల్ (విఎస్ ఎటి) తదితర పద్ధతుల ద్వారా అనుసంధానం చేయాలని సుప్రీం కోర్టు ఇ-కమిటీతో కలిసి న్యాయ శాఖ ఇ- కోర్ట్స్ ప్రాజెక్టు కింద ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ నెట్‌వర్క్‌ను రూపొందించాలని సంకల్పించింది. ఈ మొత్తం సముదాయాలకు ఎంపిఎల్ెస్, విపిఎన్ నిర్వహించి, సేవలను అందించే బాధ్యతను దేశవ్యాప్తంగా ఉనికిలో ఉన్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అత్యాధునిక టెలికాం మౌలిక సదుపాయాలు, ప్రసార పరికరాలను కలిగిన బిఎస్ ఎన్ ఎల్ కు 2018 మే మాసంలో అప్పగించడం జరిగింది. ఈశాన్య ప్రాంతం, జమ్ము కాశ్మీర్, ఉత్తరాఖండ్, అండమాన్ నికొబార్ దీవులు సహా దేశం నలుమూలల్లో బిఎస్ ఎన్ ఎల్ ఉనికిలో ఉంది.
బేధాన్ని తొలగించేందుకు న్యాయ శాఖ కృషి కారణంగా ఇటువంటి ప్రాంతాలలో ఆర్ ఎఫ్, విశాట్ తదితర ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అనుసంధానాన్ని ఏర్పాటు చేస్తున్నారు. బిఎస్ ఎన్ ఎల్, కోర్టులు సహా వివిధ భాగస్వాములతో నిరంతర చర్చలు, సమావేశాలు, సమన్వయం ద్వారా న్యాయ శాఖ 2019లో 58గా ఉన్న మొత్తం టిఎన్ ఎఫ్ ప్రాంతాలను, 2020లో 14కు తగ్గించింది. తద్వారా ప్రజాధనాన్ని ఆదా చేసేందుకు యత్నించింది, ఎందుకంటే విశాట్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతుల ద్వారా అనుసంధానం చాలా ఖరీదైంది. ఇటీవలే ప్రారంభించిన సబ్ మెరైన్ (సముద్రం గర్భంలో) కేబుల్ ను అండమాన్ నికోబార్ దీవులలోని 5 టిఎన్ ఎఫ్ ప్రాంతాలను అనుసంధానం చేసేందుకు వినియోగించాలని న్యాయ శాఖ నిర్ణయించింది.
కోవిడ్ -19 సంక్షోభ కాలంలో అనుసంధానం ప్రాముఖ్యత ఎక్కువైంది, ఎందుకంటే ప్రస్తుతం కోర్టులు కేసులను ఆన్‌లైన్ ద్వారా విచారణ చేయాలన్న వత్తిడి భారీగా పెరిగింది. ఈ క్రమంలో మారిన పరిస్థితిలో బాండ్‌విడ్త్ అవసరాన్ని సమీక్షించేందుకు బిఎస్ ఎన్ ఎల్, ఎన్ ఐసి, ఇ- కమిటీ తదితరాలతో ఉన్నత స్థాయి కమిటీని న్యాయ శాఖ ఏర్పాటు చేసింది. సుప్రీం కోర్టు ఇ-కమిటీతో కలిసి న్యాయ శాఖ డిజిటల్ పరివర్తన దిశగా భారీగా అంగ వేసింది, న్యాయవ్యవస్థను పరివర్తనకు లోను చేసేందుకు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించడంలో, సాధారణ పౌరులకు న్యాయం అందుబాటులోకి తెచ్చేందుకు అది సాధించిన విజయాలను అన్ని స్థాయిల్లో మన్ననలను అందుకుంటోంది.
భారతీయ న్యాయ వ్యవస్థలో జాతీయ విధానం, సమాచార, కమ్యూనికేషన్ టెక్నాలజీ అమలుకు కార్యాచరణ ప్రణాళిక జాతీయ ఇ-గవర్నెన్స్ ప్రణాళిక, ఇ- కోర్టుల ప్రాజక్టు అన్నది ఇంటిగ్రేటెడ్ మిషన్ మోడ్ ప్రాజెక్టు కింద 2007 నుంచి అమలులో ఉంది.
ఇ- కోర్టుల ప్రాజెక్టు మొదటి దశ (2007-2015)లో 14,249 జిల్లా & అనుషంగిక కోర్టుల కంప్యూటరీకరణను ప్రభుత్వం ఆమోదించింది. మెరుగైన న్యాయ నిర్వహణ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (ఐసిటి)ని దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా, అనుషంగిక కోర్టుల సార్వత్రిక కంప్యూటీకరణ ద్వారా లిటిగెంట్లు, న్యాయవాదులు, న్యాయవ్యవస్థకు నియమిత సేవలను అందించాలన్నది ఇ-కోర్టుల ప్రధాన లక్ష్యం. అన్ని కోర్టులలోనూ సార్వత్రిక కంప్యూటరీకరణను ఐసిటి పెంచడాన్ని కల్పన చేస్తూ, ప్రాజెక్టు రెండవ దశను జులై 2015లో రూ.1670 కోట్ల బడ్జెట్‌ను కేబినెట్ ఆమోదించింది. దీని కింద 16,845 కోర్టులను కంప్యూటరీకరించడం జరిగింది.
***
(Release ID: 1680029)
Visitor Counter : 281