PIB Headquarters
కోవిడ్-19 పిఐబి, డైలీ బులిటన్
Posted On:
09 DEC 2020 5:35PM by PIB Hyderabad
- దేశంలో కోవిడ్ యాక్టివ్ కేస్‌లోడ్ 3,78,909
- మొత్తం పాజిటివ్ కేసులలో యాక్టివ్ కేసుల వాటా మరో 3.89 శాతం తగ్గుదల
- గత 24 గంటలలో 32,080 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ, కొత్తగా కోవిడ్ నుంచి కోలుకున్న వారి శాతం 36,635
- ఇండియాలో మొత్తం క్యుములేటివ్ పరీక్షలు సుమారు 15 కోట్లకు చేరుతున్నాయి( 14,98,36,767)
- నేషనల్ పాజిటివిటీ రేటు ప్రస్తుతం 6.50 శాతం వద్ద ఉంది.
- రికవరీ రేటు కూడా 94.66 శాతానికి పెరిగింది.
#Unite2FightCorona
#IndiaFightsCorona
ఇండియాలో యాక్టివ్ కేస్‌లోడ్ 3.78 లక్షలనుంచి తగ్గుముఖం పడుతోంది. మొత్తం కేసులలో యాక్టివ్ కేస్‌లోడ్ 4 శాతం కంటే తక్కువగా ఉంది. రోజువారీ పాజిటివిటి రేటు 3.14 శాతం వద్ద ఉంది. 19 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వారం రోజు పాజిటివిటీ రేటు జాతీయ సగటు కంటే ఎక్కువగా ఉంది. ఇండియాలో మొత్తం కోవిడ్ కేసులలోతగ్గుదల కొనసాగుతోంది. యాక్టివ్ కేస్‌లోడ్ ప్రస్తుతం 3,78,909 వద్ద ఉంది. మొత్తం పాజిటివ్‌కేసులలో యాక్టివ్‌కేసుల వాటా 3.89 శాతానికి పడిపోయింది. రోజువారీ రికవరీలు , రోజువారి కేసుల కంటే పెరుగుతున్నాయి. దీనితో నికర యాక్టివ్ కేస్‌లోడ్ లో తగ్గుదల ఉంఇ. గత 24 గంటలలో 4,957 కేసుల తగ్గుదల రికార్డు అయింది. గత 24 గంటలలో కొత్త కోవిడ్ కేసుల కన్న , కొత్తగా కోలుకున్న కేసులు ఎక్కువగా ఉన్నాయి. గత 24 గంటలలో 32,080 మంది కి పాజిటివ్ గా తేలగా , అదే సమయంలో 36,635 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇండియాలో మొత్తం కోవిడ్ పరీక్షలు సుమారు 15 కోట్ల కు చేరుతున్నాయి ( 14,98,36,767). ప్రతి రోజూ పది లక్షల పరీక్షల కంటే ఎక్కువ పరీక్షలు నిర్వహించాలన్న సంకల్పానికి అనుగుణంగా గత 24 గంటలలో 10,22,712 నమూనాలను పరీక్షించారు. దేశ కోవిడ్ పరీక్షల సామర్ధ్యం రోజుకు 15 లక్షల పరీక్షలకు పెరిగింది.దేశవ్యాప్తంగా 2220 ల్యాబ్‌లు కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. సగటున రోజుకు పది లక్షల కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మొత్తం జాతీయ కోవిడ్ పాజిటివిటి రేటు ఈరోజు 6.50 వద్ద ఉంది. ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 2 కోట్లకు పైగా పరీక్షలు నిర్వహించారు. బీహార్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రాలు కోటికిపైగా పరీక్షలు నిర్వహించిన రాష్ట్రాల జాబితాలో ఉన్నాయి. రికవరీ రేటు కూడా 94.66 శాతానికి పెరిగింది. మొత్తం రికవరీలు ఈరోజు 92 లక్షలు దాటాయి. కొత్తగా కోలుకున్నకేసులలో 76.37 శాతం కేసులు పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవి. మహారాష్ట్ర లో ఒక్కరోజులో గరిష్ఠ స్థాయిలో కోలుకున్నారు. ఈ రాష్ట్రంలో కొత్తగా 6,365 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కేరళలో 4 వేలా 735 మంది కోలుకున్నారు. ఆ తర్వాత స్థానం ఢిల్లీకి దక్కింది. ఢిల్లీలో 3,307 మంది కోలుకున్నారు. కొత్తకేసులలో 75.11 శాతం పదిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినవి. కేరళ అత్యధిక కొత్తకేసులు నమోదు చేస్తూ వస్తోంది. ఈ రాష్ట్రంలో 5032 తాజా కేసులు నమోదయ్యాయి. 4025 కేసులతో మహారాష్ట్ర ఆ తర్వాతి స్థానం లో ఉంది. గత 24 గంటలలో 402 మరణాలు సంభవించాయి. కొత్తగా నమోదైన మరణాలలో 76.37 శాతం మరణాలు పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినవి. మరిన్ని వివరాలకు
డిసెంబర్ 10, 2020 న నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేయనున్న ప్రధానమంత్రి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, న్యూఢిల్లీ సంసద్ మార్గ్‌లో నూతన పార్లమెంటు భవనానికి శంకుస్థాపన చేస్తారు. ఈ నూతన భవనం ఆత్మనిర్భర్ భారత్‌లో ఆత్మ నిర్భర్ భారత్ లో కీలకమైన భాగం. భారతదేశానికిస్వాతంత్య్రం వచ్చాక ప్రజల పార్లమెంటు భవనాన్ని నిర్మించే చారిత్రాత్మక అవకాశంఇది. 2022లో భారత 75వ స్వాతంత్య్రదినోత్సవ సందర్భాన్నిపురష్కరించుకుని నూతన భారతావని ఆకాంక్షలను ఈ నూతన పార్లమెంటు నేరవేర్చగలదు.ఈ నూతన పార్లమెంటు భవనం అత్యాధునిక హంగులు కలిగి ఉంటుంది. అత్యంత కట్టుదిట్టమైనభద్రతా ఏర్పాట్లు కలిగి ఉంటుంది. త్రికోణంలో నిర్మించే ఈ భవనం ప్రస్తుతపార్లమెంటు భవనం పక్కనే ఉంటుంది. ప్రస్తుతం ఉన్న లోక్ సభ సైజుకు మూడురెట్లుపెద్దదిగాను, రాజ్యసభ కూడాప్రస్తుతం ఉన్నదానికంటె పెద్దదిగానూ ఉంటాయి. ఈ నూతన భవనంలో భారతీయసాంస్కృతిక, ప్రాంతీయ కళలు, హస్త కళలు, వస్త్ర, వాస్తు శిల్ప భిన్నత్వ సమ్మిళితత్వాన్నిప్రతిభింబిస్తుంది. ప్రజల సందర్శనానికి అవకాశం కల్పించే విధంగా బ్రహ్మండమైనసెంట్రల్ కాన్‌స్టూషనల్ గ్యాలరీతోపాటు ఆకట్టుకునే ఆకృతి ఈ భవనం సొంతం. మరిన్ని వివరాలకు
వైద్య, ఔషధ రంగంలో ఇండియా, సూరినామ్ ల మధ్య పరస్పర సహకారానికి సంబంధించిన అవగాహనా ఒప్పందానికి కేబినెట్ ఆమోదం.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్, ఇండియా, రిపబ్లిక్ ఆఫ్ సూరినామ్ ఆరోగ్య మంత్రిత్వశాఖల మధ్య ఆరోగ్య, ఔషధాల రంగంలో పరస్పర సహకారానికి నిర్దేశించిన అవగాహనా ఒప్పందాన్ని ఆమోదించింది. ఈ ద్వైపాక్షిక అవగాహనా ఒప్పందం భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు, సూరినామ్ ప్రభుత్వానికి మధ్య ఆరోగ్యరంగం, సాంకేతిక అభివృద్ధి చర్యల విషయంలో సంయుక్త చర్యల ద్వారా పరస్పర సహకారానికి వీలుకల్పిస్తుంది.ఇది ఇండియా , సూరినామ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేస్తుంది. ఇది ఆత్మనిర్భర్‌భారత్‌కు వీలు కల్పిస్తుంది. ప్రజారోగ్యవ్యవస్థలో నైపుణ్యాన్ని అందివ్వడానికి ఉపకరిస్తుంది. అలాగే ఆయా రంగాలలో పరస్పర పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మరిన్ని వివరాలకు
సంస్కరణలతో ముడిపడిన అనుమతుల కారణంగా రాష్ట్రాలలో పౌరుల కేంద్రంగా వివిధ సంస్కరణ లు కోవిడ్ -19 మహమ్మారి కారణంగా రాష్ట్రాలు ఆర్ధిక వనరులు సమకూర్చుకునేందుకు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గట్టి మద్దతు నిస్తోంది. ఇందుకు పలు చర్యలు తీసుకుంటోంది. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో 2 శాతం అదనపు రుణం తీసుకునేందుకు కేంద్రం 2020-21 సంవత్సరానికి సంబంధించి అనుమతి నిచ్చింది.దీనివల్ల రాష్ట్రాలు అదనపు ఆర్ధిక వనరులను సమకూర్చుకుని కోవిడ్‌పై పోరాడడానికి వీలు కలిగింది. అయితే దీర్ఘకాలిక రుణ సుస్థిరతకు వీలుకల్పించడానికి , భవిష్యత్తులో ఎలాంటి వ్యతిరేక ప్రభావం పడకుండా ఉండడానికి అదనపు రుణాలలో కొంత భాగాన్ని ఈ రంగంలో పౌర సేవలకు సంబంధించి సంస్కరణలు అమలుతో అనుసంధానం చేయడం జరిగింది. మరిన్ని వివరాలకు :
ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్‌యోజనకు (ఎబిఆర్‌వై) కేంద్ర కేబినెట్ ఆమోదం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్‌యోజన పథకానికి తన ఆమోదం తెలిపింది. ఇది ఫార్మల్‌రంగంలో ఉపాధిని పెంపొందింపచేస్తుది. అలాగే, కొత్త ఉపాధి అవకాశాలను కోవిడ్‌రికవరీ సమయంలో ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 3.0 కింద కల్పిస్తుంది. ప్రస్తుత ఆర్ధికసంవత్సరానికి 1,584 కోట్లరూపాయలను కేబినెట్ ఆమోదించింది. అలాగే 2020-23 మొత్తం కాలానికి 22,810 కోట్ల రూపాయలను కేబినెట్ ఆమోదించింది. మరిన్ని వివరాలకు
జనాభా, అభివృద్ధి భాగస్వాములు ఏర్పాటుచేసిన అంతర్ మంత్రిత్వ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ జనాభా,అభివృద్ధి భాగస్వాములచే ఏర్పాటైన అంతర్ మంత్రిత్వ సదస్సునుద్దేశించి డిజిటల్ విధానంలో నిన్న ప్రసంగించారు. మరిన్ని వివరాలకు
కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ఐఐఎస్ఎఫ్ 2020 కర్టెన్ ర ఐజర్ సమావేశాన్ని ఉద్దేశించి వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. ఇండియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్ 2020ని ఈ ఏడాది కోవిడ్ -19 కారణంగా వర్చువల్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్టుచెప్పారు. ఇది సైన్స్ టెక్నాలజీ, ఇన్నొవేషన్ రంగాలలో భాగస్వామ్యపక్షాల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన ఈమాటలన్నారు. డిఫెన్స్ రిసెర్చ్ డవలప్‌మెంట్,లద్దాక్‌కు చెందిన డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌హై ఆల్టిట్యూడ్‌రిసెర్చ్ సంస్థ ఏర్పాటుచేసిన కర్టెన్ రెయిజర్ ఫంక్షన్ ఐఐఎస్ఎఫ్ 2020 ని ఉద్దేశించి నిన్న ఆయన ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. మరిన్ని వివరాలకు
సమీకృత వైద్య విభాగం ఏర్పాటుకు కలిసికట్టుగా పనిచేయాలని ఆయుష్ మంత్రిత్వశాఖ ,ఎయిమ్స్ నిర్ణయం ఎయిమ్స్‌లో డిపార్టమెంట్ ఆఫ్ ఇంటిగ్రేటివ్ మెడవిసిన్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు ప్రారంభించాలని ఆయుష్‌మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఆయుష్‌శాఖకార్యదర్శి వైద్య రాజేష్ కొటెచా, న్యూఢిల్లీ ఎయిమ్స్‌లోని సెంటర్‌ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్,రిసెర్చ్ (సిఐఎంఆర్) డైరక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా లు సంయుక్త సందర్శన, సమీక్షసందర్భంగా ఈ నిర్ణయంతీసుకున్నారు. ఆయుష్ మంత్రిత్వశాఖకుచెందిన సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సుద్వారా సిఐఎంఆర్ కు చెప్పుకోదగిన మద్దతు లభించనుంది. ఈ సందర్శన సందర్భంగా సిఐఎంఆర్ అధిపతి, డాక్టర్ గౌతమ్ శర్మ, ఆయుష్‌మంత్రిత్వశాఖకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా అక్కడ జరిగిన కార్యక్రమంలొ పాల్గొన్నారు. మరిన్ని వివరాలకు
ప్రపంచవ్యాప్తంగా యోగాను ప్రోత్సహించడంలో సంయుక్త కృషిని మరింత ముమ్మరం చేయనున్న ఆయుష్ మంత్రిత్వశాఖ, ఐసిసిఆర్. అంతర్జాతీయంగా యోగాను ప్రోత్సహించేందుకు ఆయుష్ మంత్రిత్వశాఖ,ఇండియన్‌కౌన్సిల్ ఫర్ కల్చరల్‌రిలేషన్స్ (ఐసిసిఆర్) నిన్న న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించాయి. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలలో యోగాను ప్రోత్సహించేందుకు ఉమ్మడి కృషిని ముమ్మరం చేయాలని నిర్ణయించాయి. ఈ సమీక్షా సమావేశాన్ని ఐసిసిఆర్ అధ్యక్షుడు డాక్టర్‌వినయ్ సహస్రబుద్ధే, ఆయుష్ మంత్రిత్వశాఖ కార్యదర్శి వైద్యరాజేష్ కొటేచా నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా ఆయుష్‌సర్టిఫికేషన్ ద్వారా ధృవీకృత యోగా కార్యకలాపాలకు సంబంధించి సర్టిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ అంశాన్నికూడా చర్చించారు. యోగాసర్టిఫికేషన్ బోర్డు(వైసిబి),మురార్జీదేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌యోగా (ఎండిఎన్ఐవై) రెండు సంస్థలూ ఆయుష్‌మంత్రిత్వశాఖ పర్యవేక్షణలో యోగా విషయమై వేరు వేరుగా ఐసిసిఆర్‌తో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యోగాను వ్యాప్తిచేసేందుకు ఈ సంస్థలు ఈచర్య తీసుకున్నాయి. మరిన్నివివరాలకు
కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కీలక విధానపరమైన చర్యలు తీసుకున్న ఇఎస్ఐసి కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి (ఇంఛార్జి) శ్రీ సంతోష్‌కుమార్ గంగ్వార్ అధ్యక్షతన ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఇఎస్ఐసి) 183 వ సమావేశం నిన్న జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి, ఇతర ప్రయోజనాలు కల్పించడానికి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇఎస్ఐ కింద ఇన్సూరెన్సు సదుపాయం కల కార్మికులకు వారిపై ఆధారపడిన వారికి రాష్ట్రప్రభుత్వాలచేనిర్వహించే డిస్పెన్సరీలు, ఆస్పత్రుల ద్వారా ప్రాథమికంగా వైద్యసదుపాయాలు అందుతున్నాయి. ప్రస్తుతానికి దేశవ్యాప్తంగా 1520ఇఎస్ై డిస్పెన్సరీలు, 159 ఆస్పత్రులు ఉన్నాయి. ఇందులో 45 డిస్పెన్సరీలు,49 ఆస్పత్రులు నేరుగా ఇఎస్ఐ నిర్వహిస్తోంది. మిగిలిన డిస్పెన్సరీలు,ఆస్పత్రులను ఆయా రాష్ట్రప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్రప్రభుత్వాలు నిర్వహించే పలు ఇఎస్ఐ ఆస్పత్రులలో సేవలలలోపంపై పలుఅభ్యర్ధనలు ఇప్పటికే సంస్థకు విజ్ఞాపనలు అందాయి. మరిన్ని వివరాలకు
పిఐబి క్షేత్రస్థాయి కార్యాలయాలనుంచి అందిన సమాచారం
*అస్సాం: అస్సాంలో 19,955 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ,94 కోవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 0.47 శాతం. కోవిడ్ నుంచి కోలుకుని 102 మంది పేషెంట్లు డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 2,14,019. ఇందులో కోలుకున్న వారు 97.86 శాతం. యాక్టివ్‌కేసులు 1.67 శాతం.
*సిక్కిం : సిక్కింలో 13 కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో సిక్కింలో కోవిడ్ మొత్తం కేసులు 5,215 కు చేరాయి.
*కేరళ : కేరళలో రేపు రెండో దశ స్థానిక సంస్థల పోలింగ్ జరగనుండడంతో , తొలి దశ పోలింగ్ సందర్భంగా కోవిడ్ ప్రొటోకాల్స్‌ను పాటించడంలో తలెత్తిన లోపాలను సవరించాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించారు. కోవిడ్ ప్రొటోకాల్స్ పాటించడంలో ఓటర్లు నిర్లక్ష్యం వహిస్తే అది తప్పకుండా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. ఇది కోవిడ్ కేసుల సంఖ్య పెరగడానికి దారితీయవచ్చని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ భౌతిక దూరం పాటించాలని, గుంపులుగా గుమికూడరాదని సూచించినప్పటికీ చాలా చోట్ల ఈ నిబంధనలను బాహాటంగా నిన్న జరిగిన పోలింగ్ సందర్భంగా ఉల్లంఘించడాన్ని గుర్తించారు.నిన్న స్థానిక సంస్థల పోలింగ్ సందర్భంగా 72.67 శాతం పోలింగ్ నమోదైంది. కాగా ఈనెలలో మూడవ సారి కోవిడ్ మరణాలు మంగళవారం నాడు 30 సంఖ్య దాటాయి. మొత్తం 5,032 తాజా కేసులు, 4,735 రికవరీలు నిన్న నమోదయ్యాయి. తాజా పరీక్షలలో పాజిటివిటీ రేటు 8.31 శాతం
* తమిళనాడు : తమిళనాడులో మంగళవారం నాడు 1236 కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 7.92,788 కి చేరుకుంది. మరో 13 మరణాలు సంభవించడంతో మరణాల సంఖ్య 11,822 కు చేరింది. కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య కొత్త కేసులను మించిపోతున్నాయి. నిన్న 1130 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆస్పత్రులనుంచి డిశ్చార్జి అయ్యారు. దీనితో కోలుకున్న వారి సంఖ్య 7,70,378 కి చేరినట్టు ఆరోగ్యశాఖ బులిటన్ తెలిపింది.
* కర్ణాటక : కర్ణాట ప్రభుత్వం కర్ణాటక అంటువ్యాధుల చట్టం 2020 ని సవరించింది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన వారికి పెనాల్టీని విధించవచ్చు. సవరించిన చట్టం ప్రకారం, స్థానిక సంస్థలు నాన్ ఏసీ పార్టీ హాళ్లకు, డిపార్ట మెంట్ స్టోర్సుకు 5,000 రూపాయలు, ఎసిపార్టీ హాళ్లకు, సంస్థలకు 10 వేల రూపాయలు పెనాల్టీ విధించవచ్చు. మరోవైపు రాష్ట్రప్రభుత్వం కోవిడ్ పరీక్షల రేట్లను తగ్గించింది. ప్రైవేటు ఆస్పత్రులలో కోవిడ్ పరీక్షల రేటును 800 రూపాయలుగా నిర్ణయించారు.
* ఆంధ్రప్రదేశ్ : ఆంధ్రప్రదేశ్‌లో ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం కారణంగా 583 మంది ఆస్పత్రులలో చేరారు. వీరిలో 470 మందిని డిశ్చార్జి చేశారు. 20 మందిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ , గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. ఇప్పటివరకు ఓకరు మరణించారు. ఆహారం లేదా నీరు కలుషితమైనట్టు ఆరోగ్యశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎఐఐఎంఎస్),న్యూఢిల్లీకి చెందిన బృందం చేపట్టిన ప్రాథమిక పరీక్షలలో కొన్ని రక్త నమూనాలలో లెడ్,నికెల్ అవశేషాలు కనిపించాయి.
*తెలంగాణా : కోవిడ్ -19 వాక్సిన్‌కు సంబంధించి పోటీ ఊపందుకోవడంతో , భారత ప్రభుత్వం విదేశీ రాయబారులు బయోటెక్ కంపెనీలను సందర్శించేందుకు ఏర్పాట్లు చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ సుమారు 60కి పైగా వివిధ దేశాల రాయబార కార్యాలయాల అధిపతులను డిసెంబర్ 9న హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్, బయోలాజికల్ ఇ సంస్థలసందర్శనకు ఏర్పాట్లు చేసింది. కాగా గత 24 గంటలలో తెలంగాణాలో 721 కొత్త కేసులు, 753 రికవరీలు, మూడు మరణాలు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కోవిడ్ కేసులు 2,75,261 కాగా యాక్టివ్ కేసులు 7,661, కోవిడ్ మరణాలు 1480. కోవిడ్ నుంచి డిశ్చార్జి అయినవారు 2,66,120. రికవరీ రేటు 96. 67 శాతం గా ఉంది. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 94.6 శాతం గా ఉంది.
• మహారాష్ట్ర : మహారాష్ట్రలోని ప్రపంచ ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన ఔరంగాబాద్‌ను పర్యాటకుల కోసం రేపటినుంచి తిరిగి తెరవనున్నారు. ఇందుకు సంబంధించి తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ సునీల్ చవాన్ సంబంధిత ఏజెన్సీలను కోరారు. గైడ్లకు, షాపుల యజమానులకు, స్థానిక హస్తకళాకారులు, హోటళ్ల నిర్వాహకులకు, పర్యాటక ప్రాంతంలో రవాణాకార్యకలాపాలు నిర్వహించే వారికి కోవిడ్ టెస్టులు నిర్వహించాలని ఆదేశించారు. ముంబాయిలో కొత్త కేసులు వెయ్యి మార్కుకు దిగువనే ఉన్నాయి. ప్రస్తుతం 585 కొత్త కేసులు నమోదయ్యాయి.565 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మంగళవారం నాడు ఏడుగురు మరణించారు.పూణె సర్కిల్ లో 749 కొత్త కేసులు నమోదయ్యాయి. అదే రోజు 20 మరణాలు సంభవించాయి.
*గుజరాత్ : గఉజరాత్‌లో గరిష్ఠంగా 294 కొత్త కేసులు అహ్మదాబాద్ నుంచి నమోదయ్యాయి. సూరత్ లో 214 కొత్త కేసులు నమోదయ్యాయి. రికవరీ రేటు మెరుగుపడి 91.70 శాతానికి చేరింది.
* రాజస్థాన్ : రాజస్థాన్ లో కోవిడ్ రికవరీ రేటు 91.78 శాతానికి చేరింది. మంగళవారం నాడు నాలుగు జిల్లాలలో సుమారు 100 కుపైగా కేసులు నమోదయ్యాయి. మొత్తం 465 మందికి కొత్తగా జైపూర్‌లో ఇన్‌ఫెక్షన్ సోకగా, జోధ్‌పూర్‌లో 187 మందికి, అజ్మీర్‌లో 140 మందికి, ఉదయ్‌పూర్‌లో 134 మందికి కోవిడ్ నిర్ధారణ అయింది. జూపూర్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య తగ్గి 9000కు చేరింది. తొమ్మిది జిల్లాలలో కోవిడ్ కొత్త కేసులు పదిలోపునే ఉన్నాయి.
* మధ్యప్రదేశ్ : మధ్యప్రదేశ్‌లో బుధవారం నాడు గరిష్ఠ కేసులు ఇండో జిల్లాలో నమోదయ్యాయి. ( 509 కొత్త కేసులు) ఆ తర్వాతి స్థానం లో భోపాల్ (317 కొత్త కేసులతో ఉంది) ఆతర్వాతి స్థానంలో గ్వాలియర్ (74 కేసులు) ఉంది.
ఛత్తీస్ ఘడ్ : ఛత్తీస్‌ఘడ్‌లో ని రాయ్‌పూర్‌జిల్లాలో బుధవారం నాడు 179 కొత్త కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానం దుర్గ్ జిల్లాకు దక్కింది (135 కేసులు) , జాంజి గిర్ -చంపా జిల్లాలో 109 కేసులు నమోదయ్యాయి.
*గోవా : గోవాలో రికవరీరేటు రాష్ట్రంలో 95.89 శాతానికి చేరింది.
FACT CHECK
*****
(Release ID: 1679578)
Visitor Counter : 358