కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
కార్మికులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ప్రధానమైన విధాన చొరవలు తీసుకున్న ఇఎస్ ఐసి
Posted On:
08 DEC 2020 8:04PM by PIB Hyderabad
కార్మికులకు వైద్య సేవలు, ఇతర లబ్ధిని మెరుగ్గా అందించేందుకు అనేక కీలక నిర్ణయాలను రాష్ట్ర కార్మిక బీమా కార్పొరేషన్ (ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్్స కార్పొరేషన్ -ఇఎస్ ఐసి) సోమవారం కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వర్ అధ్యక్షతన జరిగిన 183వ సమావేశంలో తీసుకుంది.
బీమా కలిగిన ఉద్యోగులకు కార్మికులకు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఇఎస్ ఐ పథకం కింద వైద్య సేవలను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఆసుపత్రులు, డిస్పెన్సరీల ద్వారా జరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 1520 ఇఎస్ ఐ డిస్పెన్సరీలు, 159 ఆసుపత్రులు ఉండగా,అందులో 45 డిస్పెన్సరీలు, 49 ఆసుపత్రులను ఇఎస్ ఐసి ప్రత్యక్షంగా నిర్వహిస్తుండగా, మిగిలిన వాటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఇఎస్ ఐ ఆసుపత్రులలో పరికరాలు, వైద్యులు సరిగ్గా అందుబాటులో లేకపోవడం గురించి అనేక ఫిర్యాదులు అందాయి.
అటు కార్మికులు, ఉద్యోగుల యాజమాన్యాల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు, లబ్ధిదారులకు మెరుగైన వైద్య సేవలను అందించేందుకు ఇఎస్ ఐ కార్పొరేషన్ 7.1.2020న జరిగిన సమావేశంలో కొత్తగా కట్టిన ఆసుపత్రులన్నింటినీ ప్రత్యక్షంగా నడపాలని నిర్ణయించింది. వీటితో పాటుగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తామే ఆ ఆసుపత్రులను నడుపుతామని పట్టుబడితే తప్ప భవిష్యత్తులో ఆమోదించే వాటిని కూడా తామే నడపాలని నిర్ణయించింది.
ఇటీవలి సంవత్సరాలలో ఇఎస్ ఐ పరిధిలోకి వచ్చిన వారి సంఖ్య పెరగడం, పలు ప్రాంతాలలో ఇఎస్ ఐకి స్వంత వైద్య మౌలిక సదుపాయాలు 10 కిమీల పరిధిలో లేని క్రమంలో ఇఎస్ ఐ డిస్పెన్సరీ లేక ఆసుపత్రి నుంచి ఎటువంటి ప్రక్రియ అవసరం లేకుండా ఇఎ ఐసి జాబితాలో ఉన్న ఆసుపత్రుల నుంచి ప్రత్యక్షంగా ఓపిడి సేవలను పొందవచ్చు లేదా ఆయుష్మాన్ భారత్ నుంచి కూడాసేవలను పొందవచ్చని ప్రస్తుతం ఇ స్ఇఎస్ ఐ కార్పొరేషన్ నిర్ణయం తీసుకుంది. అటువంటి సందర్భాలలో ఇన్‌పేషెంట్‌గా చికిత్స అవసరం అయినప్పుడు, జాబితాలో ఉన్న ఆసుపత్రులు కాలపరిమితి కలిగిన అనుమతిని ఇఎస్ ఐ ఆమోదాన్ని ఆన్‌లైన్ వ్యవస్థ ద్వారా తీసుకుంటుంది.
కార్డియాలజీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఆంకాలజీ వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను ఢిల్లీ/ఎన‌్‌సిఆర్ లలో ఎంపిక చేసిన ఇఎస్ ఐసి ఆసుపత్రులలో బలోపేతం చేయనున్నారు. దశలవారీగా దీనిని దేశవ్యాప్తంగా ఉన్న ఇఎస్ ఐసి ఆసుపత్రులకు విస్తరిస్తారు.
ఆసుపత్రుల మేనేజర్లతో హాస్పిటల్ మేనేజ్‌మెంట్ లేక హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లేక హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ మెయింటెనెన్స్ , హౌజ్ కీపింగ్, రోగులకు సహాయం, రోగుల భద్రత, ఇతర అనుబంధ కార్యకలాపాల కోసం ప్రత్యేక అధ్యయనం చేసిన వారి ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న ఇఎస్ ఐసి ఆసుపత్రులను నిర్వహించనుంది.
ఇఎస్ ఐసికి చెందిన ఆసుపత్రులు, డస్పెన్సరీల ప్రాజెక్టులను వాటి కల్పన ప్రణాళిక నుంచి దానిని ప్రారంభించే వరకు పర్యవేక్షించేందుకు, వాటిని ప్రారంభించేందుకు ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ సేవలను ఇఎస్ ఐసి వినియోగించుకోనుంది.
కోవిడ్ -19 సంక్షోభ సమయంలో ఉపాధి కోల్పోయిన బీమా కలిగిన కార్మికులకు అటల్ బీమిట్ వ్యక్తి కళ్యాణ్ యోజన కింద సగటు రోజువారీ ఆదాయంలో 50% లబ్ధిని 90 రోజుల వరకు కొనసాగించాలన్న సడలించిన షరతులను కొనసాగించాలని ఇఎస్ ఐ కార్పొరేషన్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రేరిత లాక్ డౌన్ కాలంగా ఇది జూన్ 30, 2021 వరకు సడలింపు వర్తిస్తుంది. అర్హత కలిగిన ఉద్యోగులు కార్మికులు తమ క్లెయిములను ఇఎస్ ఐ సి పోర్టల్ (www.esic.in )లో తమ మొబైల్ నెంబర్, ఆధార్, బ్యాంకు వివరాలను ఇవ్వడం ద్వారా ఫైల్ చేసుకోవచ్చు.
***
(Release ID: 1679230)
Visitor Counter : 290