మంత్రిమండలి

ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన (ఎబిఆర్ వై) కిఆమోదం తెలిపిన మంత్రిమండలి


Posted On: 09 DEC 2020 3:42PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 లో భాగంగా కోవిడ్ నుంచి కోలుకొనే కాలంలో సాంప్రదాయక రంగంలో ఉపాధి కల్పన కు ప్రోత్సాహం ఇవ్వడానికి, కొత్త ఉద్యోగ అవకాశాల ను ప్రోత్సహించడానికి ‘‘ఆత్మనిర్భర్ భారత్ రోజ్‌గార్ యోజన’’ (ఎబిఆర్ వై) అమలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్ల రూపాయలను ఖర్చు చేసేందుకు, పథకం పూర్తి అవధి అయిన 2020-2023 వరకు 22,810 కోట్ల రూపాయలు వ్యయపరచేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

ఈ పథకం ముఖ్యాంశాలు ఈ క్రింద తెలిపిన విధంగా ఉన్నాయి:

  1. భారత ప్రభుత్వం 2020 అక్టోబర్ 1వ తేదీ నాడు గానీ లేదా ఆ తర్వాత గానీ, 2021 జూన్ 30 వరకు పనిలోకి తీసుకున్న కొత్త ఉద్యోగులందరికి 2 సంవత్సరాల కాలానికి గాను సబ్సిడీ ని అందిస్తుంది.

 

  1. వేయి మంది వరకు ఉద్యోగులు పనిచేసే సంస్థలలో భారత ప్రభుత్వం 2 సంవత్సరాల కాలానికి కొత్త ఉద్యోగుల విషయంలో ఇటు 12% ఉద్యోగుల చందా ను, అటు 12% యాజమాన్య సంస్థల చందా ను.. అంటే వేతన భత్యాలలో 24 శాతాన్ని ఇపిఎఫ్ కు చెల్లిస్తుంది.

 

  1. వేయి మందికి పైగా ఉద్యోగులు పనిచేస్తున్న వ్యాపార సంస్థల కొత్త ఉద్యోగుల విషయంలో కేవలం ఉద్యోగి తాలూకు ఇపిఎఫ్ ఛందా ను, అంటే వేతనంలో 12 శాతాన్ని భారత ప్రభుత్వం రెండేళ్ల పాటు చెల్లిస్తుంది.

 

  1. 15,000 రూపాయల కంటే తక్కువ నెలవారి వేతనాన్ని పొందుతున్న ఉద్యోగి ఎవరైతే ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఇపిఎఫ్ఒ) లో 2020 అక్టోబర్ 1వ తేదీకి ముందు నమోదు అయి వుంటేనో, లేదా ఆ వ్యక్తి కి ఈ కాలావధి కన్నా ముందు యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) ఏదీ లేకపోతేనో, లేదా 2020 అక్టోబర్ 1వ తేదీకి ముందు ఇపిఎఫ్ సభ్యత్వ ఖాతా సంఖ్య లేకపోతేనో, ఆ వ్యక్తి కి ఈ ప్రయోజనం తాలూకు అర్హత లభిస్తుంది.

 

  1. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (యుఎఎన్) ను కలిగి వున్న ఇపిఎఫ్ సభ్యులు ఎవరైనా నెల కు 15,000 రూపాయల కంటే తక్కువ వేతనాన్ని పొందుతూ కోవిడ్ మహమ్మారి కారణం గా 2020 మార్చి 1 నుంచి 2020 సెప్టెంబర్ 30 మధ్య కాలం లో తన ఉద్యోగాన్ని వదిలేసివుంటే, అలాగే ఆ వ్యక్తి కి 2020 సెప్టెంబర్ 30 వరకు ఇపిఎఫ్ సదుపాయం గల సంస్థ లో ఉద్యోగం దొరకకపోయినట్లయితే, అటువంటి వారు కూడా ఈ ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు అవుతారు.

 

  1. సభ్యుల ఆధార్ సంఖ్య తో జతపడ్డ సభ్యుల అకౌంట్‌లో ఇపిఎఫ్ఒ ఎలక్ట్రానిక్ పద్దతి లో ఈ ఛందా సొమ్ము ను చెల్లిస్తుంది.

 

  1. ఈ పథకాన్ని అమలు చేయడానికి ఒక సాఫ్ట్ వేర్ ను ఇపిఎఫ్ఒ రూపొందిస్తోంది. అంతేకాకుండా పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన ప్రక్రియ ను తానే అభివృద్ధి పరుస్తుంది.
  2. ఎ.బి.ఆర్.వై.లో భాగం గా అందించే ప్రయోజనాలు ఇపిఎఫ్ ఒ ద్వారా అమలయ్యే మరేదైనా పథకం ప్రయోజనాలు ఏ విధంగా కూడాను అతివ్యాప్తం కాకుండా (ఓవర్ ల్యాపింగ్) ఉండేందుకు ఒక విధివిధానాన్ని ఇపిఎఫ్ ఒ రూపొందించవలసి ఉంటుంది.

 

 

****



(Release ID: 1679430) Visitor Counter : 439