ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

జనాభా మరియు అభివృద్ధి (పి.పి.డి) లో భాగస్వాముల అంతర్ మంత్రిత్వశాఖల సదస్సును ఉద్దేశించి దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించిన - డాక్టర్ హర్ష వర్ధన్


Posted On: 08 DEC 2020 7:15PM by PIB Hyderabad

జనాభా మరియు అభివృద్ధి (పి.పి.డి) లో భాగస్వాముల అంతర్ మంత్రిత్వశాఖల సదస్సును ఉద్దేశించి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ హర్ష వర్ధన్, ఈ రోజు ఇక్కడ దృశ్యమాధ్యమం ద్వారా ప్రసంగించారు.  

ఆయన ప్రసంగంలోని అంశాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ప్రియమైన శ్రేష్ఠులు, ప్రముఖులు, విశిష్ట వక్తలు, నిపుణులు, సోదర, సోదరీమణులారా!

నైరోబి సదస్సులో చేసిన భారతదేశం యొక్క కట్టుబాట్లను పునరుద్ధరించడానికి ఈ రోజు మీ అందరి మధ్య ఇక్కడ ఉండటం నాకు చాలా ఆనందంగా ఉంది.

జనాభా మరియు అభివృద్ధిలో దక్షిణ-దక్షిణ సహకారంపై చాలా ముఖ్యమైన ఈ సమావేశాన్ని నిర్వహించినందుకు నిర్వాహకులకు నా హృదయపూర్వక ప్రశంసలను తెలియజేయడం ద్వారా ఈ ప్రసంగాన్ని ప్రారంభించాలనుకుంటున్నాను.  ఈ రోజు ఇక్కడ ఉన్న గౌరవనీయ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడాన్ని, నేనొక గౌరవంగా, ఆనందంగా భావిస్తున్నాను.

దక్షిణ-దక్షిణ సహకారం ద్వారా జ్ఞానం, నైపుణ్యాలు మరియు సాంకేతిక నైపుణ్యాన్ని మార్పిడి చేయడం-సభ్య దేశాలలో అభివృద్ధి సవాళ్లను పరిష్కరించడంలో ప్రభావవంతంగా ఉంటుందని నిరూపించబడింది….  పునరుత్పత్తి ఆరోగ్యం, జనాభా మరియు అభివృద్ధి యొక్క ముఖ్య రంగాలలో సహకారాన్ని ప్రోత్సహించడంలో జనాభా మరియు అభివృద్ధిలో భాగస్వాముల కృషిని భారతదేశం ప్రశంసించింది.  మనం అన్ని విధాలుగా ఈ కారణానికి కట్టుబడి ఉన్నాము.

పి.పి.డి. యొక్క విలువైన సభ్యునిగా, నైరోబి శిఖరాగ్ర సమావేశంలో చేసిన కట్టుబాట్లను పునరుద్ఘాటించడంలో, ప్రసూతి మరణాలను పూర్తిగా అంతం చేయడానికి, కుటుంబ నియంత్రణకు అపరిష్కృతమైన అవసరాలను తీర్చడానికి, లింగ ఆధారిత హింసను తగ్గించడానికి, మహిళలు మరియు బాలికలను హింసించే పద్ధతులను అంతం చేయడానికి, భారతదేశం కృషి చేస్తోంది.  2030 కల్లా ఈ లక్ష్యాలను సాధించాలని భారతదేశం గడవు విధించుకుంది.

భారతదేశం, తన ప్రధాన కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ద్వారా అందరికీ ఆరోగ్య సంరక్షణ సౌకర్యం కల్పించడానికి కట్టుబడి ఉంది.  జాతీయ ఆరోగ్య పరిరక్షణ పథకం కింద, మేము సంవత్సరానికి, కుటుంబానికి, 7000 అమెరికా డాలర్ల మేర డాలర్ల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాన్ని అందిస్తున్నాము. 500 మిలియన్ల మంది భారతీయులకు ఈ సౌకర్యం సమర్థవంతంగా అందుబాటులో ఉంది.  ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకంగా పేరుగాంచిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమం కింద, భారతదేశంలోని ప్రతి పౌరునికి ప్రయోజనం చేకూర్చాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని తెలియజేయడానికి నేను గర్వపడుతున్నాను.

గర్భనిరోధక మందుల పరిధిని పెంచడం ద్వారా మరియు కుటుంబ నియంత్రణ సేవల అందుబాటు మరియు నాణ్యతను మెరుగుపరచడం ద్వారా గర్భనిరోధక అవసరాన్ని గణనీయంగా తగ్గించడానికి మేము నిరంతర ప్రయత్నాలు చేస్తున్నాము.  సామూహిక అవగాహన ప్రచారాలు, బలమైన న్యాయవాద సలహా, సంప్రదింపుల ద్వారా, పిల్లల సంఖ్య మరియు వారి మధ్య వయస్సు అంతరాన్ని నిర్ణయించడానికి సమాచారం మరియు బాధ్యతాయుతమైన ఎంపికలు చేయడానికి మేము దంపతులకు సహాయం చేస్తున్నాము.

2030 నాటికి ప్రసూతి మరణాల రేటును 70 కన్నా దిగువ స్థాయికి తగ్గించే సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని సాధించడం కోసంమేము "సుమన్", అంటే, "సురక్షిత మాతృత్వ భరోసా", అనే కార్యక్రమాన్ని అమలు చేశాము.

లింగ ఆధారిత హింసను పరిష్కరించడానికి మరియు మహిళలు, బాలికలపై అన్ని రకాల అత్యాచారాలను తొలగించడానికి మేము కఠినమైన చట్టాలను అమలు చేస్తూవ్యూహాత్మక జోక్యాలను బలపరుస్తున్నాము.

ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వపరంగా  వ్యయాన్ని పెంచడానికి భారతదేశం కట్టుబడి ఉంది.  పునరుత్పత్తి ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు, మా ప్రభుత్వం 2020 నాటికి 3 బిలియన్ల అమెరికా డాలర్ల మేర పెట్టుబడి పెట్టింది. వయస్సు, లింగం, వలస లక్షణాల ప్రకారం జాతీయ స్థాయి నిర్దిష్ట విధానాలను రూపొందించడం ద్వారా ఆర్థిక వృద్ధిని సాధించడానికి, అదేవిధంగా స్థిరమైన అభివృద్ధిని సాధించడానికి మేము మా జనాభా వైవిధ్యానికి అనుగుణంగా వ్యూహ రచన కొనసాగిస్తున్నాము.

మా వృద్ధాప్య జనాభా ఆరోగ్యం, శ్రేయస్సుతో పాటు యువకుల విద్య, ఆరోగ్యం, నైపుణ్యాల అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము.  సుస్థిర అభివృద్ధిని సాధించడానికి 2030 నాటికి నాణ్యమైన, సమయానుకూలంగా, అందుబాటులో ఉన్న సమాచారాన్ని అందించడానికి, డిజిటల్ ఆరోగ్య ఆవిష్కరణలలో పెట్టుబడులు పెట్టడంతో పాటు, సమాచార వ్యవస్థల మెరుగుదలకు కూడా భారతదేశం కట్టుబడి ఉంది.

మీ అందరికీ తెలిసినట్లుగా, కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ఒక సవాలుగా కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే దిశగా ఆరోగ్య సంరక్షణను అందించడం గురించి అత్యవసర నిర్ణయాలు తీసుకునేలా చేసింది.   కోవిడ్ మొదటిది కాదని మరియు మానవజాతి దృక్ఫథాన్నీ, దృఢ నిశ్చయాన్నీ పరీక్షించడానికి ఖచ్చితంగా ఇది చివరిది కూడా కాదని మనం గుర్తుంచుకోవాలి.  ఒక అత్యవసర సమయంలో, మరొక అత్యవసర పరిస్థితికి స్పందించే  ఆరోగ్య వ్యవస్థను ఎవరూ రూపొందించలేరు.  కాగా, ఇటువంటి అత్యవసర పరిస్థితులు కేంద్రీకృత ప్రతిస్పందనను రేకెత్తిస్తాయి.  ఇవి వాస్తవానికి దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ యొక్క సామర్థ్యానికి పరీక్షగా నిలుస్తాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఈ వ్యాధిని మహమ్మారిగా ప్రకటించక ముందే భారతదేశం యొక్క కోవిడ్ ప్రతిస్పందన ప్రారంభమైంది.  2020 జనవరి, 30వ తేదీన మొదటి కేసును గుర్తించడానికి ముందే మేము చాలా సన్నద్ధమయ్యాము.

తాజా అధికారిక గణాంకాల ప్రకారం, భారతదేశంలో క్రియాశీల కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.  ప్రస్తుతం మొత్తం కేసులలో ఇది 4 శాతంగా ఉంది.  కాగా, రికవరీ రేటు పెరుగుతోంది.  ప్రస్తుతం ఇది 94 శాతం కంటే ఎక్కువగా ఉంది.  మిలియన్ జనాభాకు అతి తక్కువ కేసులున్న ప్రపంచ దేశాలలో, భారతదేశం ఒకటిగా కొనసాగుతోంది.

పరీక్షలు చేయడం, గుర్తించడం, చికిత్స చేయడం అనే వ్యూహాన్ని భారతదేశం సమర్థవంతంగా అనుసరిస్తోంది.  మా పరీక్షల సామర్థ్యం రోజుకు దాదాపు 1.5 మిలియన్లకు చేరుకుంది. ఇప్పటివరకు 149 మిలియన్లకు పైగా పరీక్షలు జరిగాయి.

సమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను నిర్ధారించడానికి తగినంత ఆరోగ్య సంరక్షణ ఆర్ధిక సహకారం చాలా ముఖ్యమైనది.  సార్వజనీన ఆరోగ్య సంరక్షణ సాధించాలనే ఆకాంక్షతో, భారతదేశ జాతీయ ఆరోగ్య విధానం-2017 ప్రజారోగ్య వ్యయాన్ని జి.డి.పి. లో 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.  కరోనా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటాన్ని బలోపేతం చేయడానికి, ఆరోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు మా ప్రధానమంత్రి రెండు బిలియన్ అమెరికా డాలర్ల మేర నిధులను కేటాయించినట్లు ప్రకటించారు.

భారతీయ ఆరోగ్య వ్యవస్థ ద్వారా మహమ్మారిని పరిష్కరించేలా మా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. అదేవిధంగాపునరుత్పత్తి, ప్రసూతి, నవజాత, శిశు, కౌమార ఆరోగ్య సేవలతో పాటు పౌష్టికాహారం వంటి సేవలు అవసరమైన కోవిడ్ కాని వైద్య సేవలకు ఏకకాలంలో అడ్డుపడకుండా చూసుకోవడం జరిగింది.  మహిళలు, నవజాత శిశువులు, చిన్నారులకు, వారి కోవిడ్ స్థితితో సంబంధం లేకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి అవసరమైన సేవలను తిరస్కరించరాదని మేము ఆదేశించాము.

స్వల్ప, దీర్ఘకాల రివర్సిబుల్ గర్భనిరోధక మందుల వాడకం క్షీణించడం అదనపు అపరిష్కృత అవసరాన్ని సూచిస్తుంది, అదేవిధంగా దేశంలో అనాలోచిత గర్భాలను పెంచుతుంది.  అదేవిధంగా, అవసరమైన గర్భధారణ సేవలు మరియు నవ జాత శిశువుల సంరక్షణ సేవలు ఏ కారణం చేతనైనా తగ్గినట్లైతే, ప్రసూతి మరణాలు, నవజాత శిశు మరణాలు పెరిగే ప్రమాదం ఉంటుంది.

అటువంటి సమయాల్లో సురక్షితంగాని గర్భస్రావం జరిగే సందర్భాలు పెరగడం వల్ల సంభవించే ఆందోళనను గుర్తించడంప్రసవానంతర మరియు గర్భస్రావం అనంతర గర్భనిరోధకతతో పాటు సురక్షితమైన గర్భస్రావం సేవలను అందించడానికి భారతదేశం ప్రత్యేక దృష్టి పెట్టింది.

కుటుంబ నియంత్రణతో పాటు, సమాజ ఆధారిత జోక్యం కూడా ఈ సేవల్లో ఒక భాగం.  ఆధునిక చిన్న, దీర్ఘకాలిక రివర్సిబుల్ గర్భనిరోధక సేవలు, సరైన సమాచారం, తగిన కౌన్సిలింగ్ అందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది.  భారతదేశ జనాభాలో గణనీయమైన శాతంగా ఉన్న కౌమారదశ మరియు యువత ప్రాధాన్యతా లక్ష్యంగా కూడా దృష్టి పెట్టడం జరిగింది.

టెలి మెడిసిన్ సేవలను ప్రోత్సహించడం, శిక్షణ కోసం డిజిటల్ వేదికలు, ఆర్థిక మెరుగుదల, సరఫరా వ్యవస్థలను క్రమబద్ధీకరించడంతో పాటు, ప్రత్యామ్నాయ సేవా డెలివరీ విధానాలను ప్రోత్సహించడానికి కూడా మేము కృషి చేస్తున్నాము.  భారతదేశంలో, కుటుంబ నియంత్రణకు ఉపయోగించే వస్తువులను, మందులను నిత్యావసర ఔషధాల జాబితాలో చేర్చాము.

భాగస్వాములతో క్రమం తప్పకుండా ఆన్-లైన్ దృశ్య సమావేశాల ద్వారా అత్యున్నత స్థాయిలో చట్ట పరమైన సలహా, సంప్రదింపులు మరియు పర్యవేక్షణ నిర్ధారించబడుతోంది.  కోవిడ్ సమయంలో అవసరమైన సేవలను అందించడంలో ఉత్తమమైన పద్ధతులను పంచుకోవడానికి రాష్ట్రాలకు ఒక వేదిక ఇవ్వబడింది.  ఇది భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో సేవల సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడ్డంతో పాటు, పరస్పరం నేర్చుకునే అవకాశాలను కల్పిస్తుంది.

వలస మరియు క్వారంటైన్ శిబిరాల వద్ద సామాజిక ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భనిరోధక మందులను అందించడానికి భాగస్వామి ఏజెన్సీల సాంకేతిక మద్దతు, ప్రొవైడర్ల ఆన్‌లైన్ సామర్థ్యం పెంపు, టెలిమెడిసిన్ సేవలను అమలు చేయడం, ప్రైవేట్ రంగం మరియు సామాజిక విక్రయదారులతో పాటు గర్భనిరోధక తయారీదారులతో ఒప్పందం, అవసరమైన సేవలను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు మరింతగా సహాయపడ్డాయి.

మహమ్మారి మన జీవితంలోని అన్ని అంశాలపై అనూహ్యమైన ప్రభావానికి దారితీసింది, అయితే అదే సమయంలో మంచి భవిష్యత్తు వైపు ఎలా ముందుకు సాగాలి అనేదానిపై కొంత ఆలస్యమైనా, పునరాలోచించడానికి ఇది ఒక మంచి అవకాశాన్ని ఇచ్చింది.  విపరీతమైన సవాలును ఎదుర్కోవడంలో ప్రభుత్వాలు, వ్యక్తులు బలమైన, వేగవంతమైన చర్య తీసుకోగలరనిఈ సంక్షోభం నిరూపించింది.

గర్భనిరోధక మరియు సురక్షితమైన గర్భస్రావం సేవలను అందుబాటులోకి తీసుకువచ్చి, సరసమైన మరియు అందరికీ ఆమోదయోగ్యంగా చేయడంలో ఆరోగ్య సంరక్షణ సేవలతో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉన్న అన్ని ఆరోగ్య సంస్థలు, విద్యావేత్తలు, ఇతర భాగస్వాముల నుండి సమగ్ర, సమన్వయ ప్రయత్నాలకు ఇదే సరైన సమయం.  అందరికీ ఆరోగ్యంఅనే ఉమ్మడి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇటువంటి సంభాషణలను అత్యున్నత స్థాయిలో పెంపొందించదానికీ, పి.పి.డి. ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

జనాభా మరియు అభివృద్ధిలో భాగస్వాములకు నిరంతర మద్దతును కొనసాగిస్తూ, ఈ సదస్సులో చురుకుగా పాల్గొన్నందుకు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.  ఈ గౌరవప్రదమైన సమావేశానుద్దేశించి ప్రసంగించడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదములు.

*****



(Release ID: 1679277) Visitor Counter : 276