ఆర్థిక మంత్రిత్వ శాఖ
సంస్కరణల అనుసంధాన రుణ అనుమతులు రాష్ట్రాలలో వివిధ పౌర కేంద్రీకృత సంస్కరణలకు దారి తీస్తాయి
9 రాష్ట్రాలు 'వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్' సంస్కరణను విజయవంతంగా పూర్తి చేశాయి
ఆయా రాష్ట్రాలకు రూ.23,523 కోట్ల సంస్కరణ అనుసంధానత రుణ అనుమతుల
Posted On:
09 DEC 2020 10:55AM by PIB Hyderabad
ఆర్థిక వనరుల సమీకరణకు కోవిడ్-19 మహమ్మారి వల్ల ఎదురవుతున్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం వివిధ రకాల చర్యల ద్వారా రాష్ట్రాల ఆర్ధిక వెసులుబాటును బలోపేతం చేసేలా పలు చర్యలు చేపడుతోంది. 2020-21 సంవత్సరంలో స్థూల రాష్ట్ర దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ) లో దాదాపు రెండు శాతం మేర అదనపు రుణాలు తీసుకునేందుకు సంబంధించిన అనుమతి కూడా ఇందులో భాగం. ఇది మహమ్మారిపై పోరాడటానికి, ప్రజలకు సేవలను అందించే ప్రమాణాలను నిర్వహించడానికి అదనపు ఆర్థిక వనరులను సమీకరించటానికి రాష్ట్రాలకు వీలు కల్పించింది. దీర్ఘకాలిక రుణ స్థిరత్వాన్ని నిర్ధారించడానికి మరియు భవిష్యత్తులో ఎదురయ్యే ఏదైనా ప్రతికూల ప్రభావాన్ని నివారించడానికి రాష్ట్రాల అదనపు రుణ సేకరణను.. పౌర సేవలను అందించే కీలకమైన రంగాల్లో చేపట్టిన సంస్కరణలతో ముడి పట్టెడం జరిగింది. ఇలా సంస్కరణల కోసం గుర్తించిన రంగాలలో ప్రజా పంపిణీ వ్యవస్థ ఒకటి. జీఎస్‌డీపీలో 2% మేర అదనపు రుణ పరిమితికి గాను 0.25 శాతాన్ని “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థ” అమలుతో ముడిపెట్టడం జరిగింది. జాతీయ ఆహార భద్రతా చట్టం (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ) మరియు ఇతర సంక్షేమ పథకాల కింద లబ్ధిదారులకు, ముఖ్యంగా వలస కార్మికులు మరియు వారి కుటుంబాలకు దేశ వ్యాప్తంగా ఏదైనా సరసమైన ధరల దుకాణాల (ఎఫ్‌పీఎస్) ద్వారా రేషన్ లభించేలా చూడటం దీని లక్ష్యం. వాస్తవంగా లబ్ది అవసరమైన మెరుగైన లబ్ధిదారులను లక్ష్యంగా చేసుకోవడం, బోగస్ / డూప్లికేట్ / అనర్హమైన రేషన్ కార్డులను తొలగించడం మరియు సంక్షేమాన్ని పెంచడం మరియు లీకేజీని తగ్గించడం ఉద్దేశించిన సంస్కరణ దీని
ఇతర లక్ష్యాలు. ఇందుకు గాను అన్ని రేషన్కార్డుల ఆధార్ సీడింగ్, లబ్ధిదారుల బయోమెట్రిక్ ప్రామాణీకరణ మరియు రాష్ట్రంలోని అన్ని ఫెయిర్ ప్రైస్ షాపుల (ఎఫ్‌పీఎస్) ఆటోమేషన్ జరిగే విధంగా చూడడం ఇందులో ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 09 రాష్ట్రాలు పీడీఎస్‌లో సంస్కరణలను విజయవంతంగా పూర్తి చేశారు. వన్ నేషన్ వన్ రేషన్ వ్యవస్థను అమలు చేశారు. ఆంధ్రప్రదేశ్, గోవా, హర్యానా, కర్ణాటక, కేరళ, తెలంగాణ, త్రిపుర మరియు ఉత్తర ప్రదేశ్‌లో ఇందులో ఉన్నాయి. సంస్కరణలు పూర్తయిన తరువాత, వారికి రూ .23,523 కోట్ల అదనపు రుణాలు అనుమతి ఇవ్వబడింది.
వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ వ్యవస్థను అమలు వల్ల రాష్ట్రాల వారీగా అదనపు రుణాలు అనుమతించబడతాయి:
రాష్ట్రం పేరు
|
మొత్తం అనుమతి
((కోటి రూపాయిలు))
|
ఆంధ్రప్రదేశ్
|
2,525.00
|
గోవా
|
223.00
|
గుజరాత్
|
4,352.00
|
హర్యానా
|
2146.00
|
కర్ణాటక
|
4,509.00
|
కేరళ
|
2,261.00
|
తెలంగాణ
|
2,508.00
|
త్రిపుర
|
148.00
|
ఉత్తర ప్రదేశ్
|
4,851.00
|
మొత్తం
|
23,523.00
|
ఈ సంస్కరణకు నిర్దేశించిన షరతులను ఆయా రాష్ట్రాలు నెరవేర్చినట్లు ధృవీకరించడానికి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖలోని ఆహార మరియు ప్రజా పంపిణీ విభాగాన్ని నోడల్ విభాగంగా ఏర్పాటు చేశారు. దీనికి తోడు, అదనపు రుణాలు పొందటానికి అర్హత సాధించడానికి రాష్ట్రాలు డిసెంబర్ 31, 2020 లోపు సంస్కరణలను పూర్తి చేయాలి. నిర్ణీత తేదీకి ముందే ఇంకా చాలా రాష్ట్రాలు ఈ సంస్కరణను పూర్తి చేస్తాయని భావిస్తున్నారు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డుతో పాటు అదనపు రుణాలు పొందటానికి ముందస్తు షరతుగా పేర్కొన్న ఇతర సంస్కరణలలో వ్యాపార సంస్కరణలు చేయడం, పట్టణ స్థానిక సంస్థ / యుటిలిటీ సంస్కరణలు మరియు విద్యుత్ రంగ సంస్కరణలు ఉన్నాయి.
****
(Release ID: 1679330)
Visitor Counter : 316