PIB Headquarters
పిఐబి డెయిలీ కోవిడ్ బులిటన్
Posted On:
12 NOV 2020 6:03PM by PIB Hyderabad

* వరుసగా ఈరోజు 5 వ రోజు కూడా 50 వేలకంటే తక్కువ కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
* యాక్టివ్ కేస్‌లోడ్ 4.9 లక్షల కంటే తక్కువ
* గత 24 గంటలలో కొవిడ్ పాజిటివ్ కొత్త కేసులు 47,905 నమోదు కాగా, 52,718 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు.
*జాతీయ స్థాయి రికవరీ రేటు 92.89 శాతానికి పెరిగింది.
*కోవిడ్ 19 మహమ్మారికి సంబంధించి అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన ప్రతిస్పందనలో ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక పాత్ర పోషిస్తుండడంపట్ల ప్రపంచబ్యాంకును అభినందించిన ప్రధానమంత్రి.
*కోవిడ్ -19కు వ్యతిరేకంగా పోరులో భారత ఆర్ధిక వ్యవస్థకు మద్దతుగా ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 3.0ను ప్రకటన.
#Unite2FightCorona
#IndiaFightsCorona


ఈరోజు వరుసగా 5వ రోజు కూడా ఇండియాలో రోజువారి కోవిడ్ కేసులు 50 వేల కంటే తక్కువగా ఉన్నాయి. యాక్టివ్ కేస్ లోడ్ 4.9 లక్షలుగా ఉంది. మొత్తం కేసులలో వాటా 5.63 శాతానికి పడిపోయింది.
వరుసగా ఈరోజు 5 వ రోజు కూడా గత 24 గంటలలో కోవిడ్ కొత్త కేసులు 50,000 మార్కు దాటలేదు. గత 24 గంటలలో 47,905
కోవిడ్ కొత్త కేసులు నమోదయ్యాయి. రోజువారీ కోలుకున్న కేసుల సంఖ్య ఈరోజుకు 40 వరోజుకూడా కొత్త కోవిడ్ కేసుల కంటే ఎ క్కువగా ఉంటున్నాయి. గత 23 గంటలలో కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 52,718 కి చేరింది. ఇది యాక్టివ్ కేస్ లోడ్‌ను తగ్గించేందుకు తోడ్పడింది. ప్రస్తుతం ఇది 4.89 లక్షలకు పరిమితమైంది. ఇది దేశ మొత్తం పాజిటివ్ కేసులలో కేవలం 5.63 శాతం. దేశ యాక్టివ్ కేస్‌లోడ్ 4.89 294. అంటే 5 లక్షల కంటే తక్కువగా ఉంది. రికవరీ రేటు కూడా బాగా పెరిగింది. కోలుకుంటున్న వారి సంఖ్య కొత్త కేసులను మించి ఉంటోంది. ప్రస్తుతం ఇది 92.89 శాతం గా ఉంది.ఈరోజు నాటికి మొత్తం కోలుకున్న వారు80,66,501.కోలుకున్న వారు, యాక్టివ్ కేసుల కు మధ్య అంతరం క్రమంగా పెరిగుతూ 75,77,207కు చేరుకుంది. 78 శాతం కొత్తగా కోలుకున్న కేసులు పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలోనే ఉన్నాయి. మహారాష్ట్రలో ఒక్క రోజులో గరిష్ఠస్థాయిలో 9,164 కేసులు తాజాగా కోలుకున్నాయి.7264 మంది కోలుకుని ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. రోజువారీ గరిష్ఠ కేసుల నమోదులో ఢిల్లీ మరోసారి నమోదైంది. ఇప్పటి వరకు ఢిల్లీలొ గరిష్ఠంగా నమోదైన కొత్త కేసుల సంఖ్య 8,593. ఢిల్లీ తర్వాత కేరళలో 7,007 కేసులు నమోదు కాగా, మహారాష్ట్రలో 4,907 కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 550 కోవిడ్ మరణాలు సంభవించగా కేస్ ఫాటలిటీ రేటు ఈరోజు 1.48 శాతం వద్ద ఉంది. ఈ కొత్త మరణాలలో పది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవి 80 శాతం వరకు ఉన్నాయి. ఇందులో మహారాష్ట్ర 125 కేసులతో 22.7 శాతం వాటా కలిగి ఉంది. ఢిల్లీ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలలో వరుసగా 85,49 కొత్తగా కోవిడ్ మరణాలు సంభవించాయి.
మరిన్ని వివరాలకు:
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యు .హెచ్.ఒ) డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రొస్ అధ్నామ్ ఘెబ్రియేసుస్ లమధ్య ఫోన్‌సంభాషణ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ, నిన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఓ) డైరక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రొస్ అధ్నామ్ ఘెబ్రియేసుస్ లమధ్య ఫోన్‌సంభాషణ జరిగింది. కోవిడ్ -19 మహమ్మారి పై పోరాటం విషయంలో అంతర్జాతీయంగా సమన్వయంతో కూడిన కృషికి వీలు కల్పించడంలో కీలక పాత్ర వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యు.హెచ్.ఒ)ను ఆయన అభినందించారు. కోవిడ్ పై పోరాటంలో ఏ మాత్రం ఏమరుపాటు పనికిరాదని అంటూ ప్రధానమంత్రి, అభివృద్ధి చెందిన దేశాలలో ఆరోగ్య వ్యవస్థలకు మద్దతు నివ్వడంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాధాన్యతను ఆయన కొనియాడారు.భారత ఆరోగ్య రంగ అధికారులు. ప్రపంచ ఆరోగ్య సంస్థకు మధ్య సన్నిహిత, నిరంతర సహకారం గురించి డైరక్టర్ జనరల్ ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ఇండియా దేశీయంగా చేపట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రశంసించారు. క్షయ వ్యాధిపై ఇండియా సాగిస్తున్న ప్రచారాన్నీఅభినందించారు.అంతర్జాతీయంగా ఆరోగ్య విషయాలలో ఇండియాకు కీలక పాత్ర ఉందన్నారు.
సంప్రదాయ వైద్య విధానాల విషయంలో ప్రధానమంత్రికి, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్ జనరల్ కు మధ్య సానుకూల చర్చజరిగింది. ఆధునిక వైద్య విధానాలసంప్రదాయ వైద్య విధానాలను ఆధునిక వైద్య విధానాలతో సమగ్ర ప్రొటోకాల్స్‌తో సమన్వయం చేయాల్సిన అవసరాన్ని వారు చర్చించారు. అలాగే కాలపరీక్షకు నిలిచిన సంప్రదాయ వైద్య ఉత్పత్తులు విధానాల విషయంలో జాగ్రత్తగా వాటి శాస్త్రీయ ధృవీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు.
మరిన్ని వివరాలకు:
17 వ ఏసియాన్ -ఇండియా శిఖరాగ్ర సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి
మరిన్ని వివరాలకు:
కటక్‌లో ఇన్‌కం టాక్స్ అప్పిలేట్ ట్రిబ్యూనల్ అధునాతన ఆఫీసు, నివాస సముదాయ భవనాల ప్రారంభోత్సవం
సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం ఆంగ్లంలో....
మరిన్ని వివరాలకు....
కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా భారత ఆర్ధిక వ్యవస్థకు మద్దతు నిచ్చేందుకు వీలుగా కేంద్ర ఆర్ధిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ 3.0 కింద ప్రజెంటేషన్ వివరాలు
మరిన్ని వివరాలకు...
రేపు రెండు ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేయనున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రేపు 5ఇవ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా 2020 నవంబర్ 13న రెండు ప్రముఖ ఆయుర్వేద సంస్థలను జాతికి అంకితం చేయనున్నారు. ఇవి జామ్‌నగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్, రిసెర్చ్ ఇన్ ఆయుర్వేద (ఐటిఆర్ఎ,)
రెండోది జైపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఈ రెండు సంస్థలూ దేశంలో ఆయుర్వేద వైద్యానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు. ఇందులో ఐటిఆర్ ఎఎ సంస్థ ను పార్లమెంటు చట్టం ద్వారా జాతీయ ప్రాధాన్యతగల సంస్థగా గుర్తించారు. రెండవదానిని యుజిసి డీమ్డ్ విశ్వవిద్యాలయంగా గుర్తించింది. 2016 సంవత్సరం నుంచి ఆయుష్ మంత్రిత్వశాక ప్రతిసంవత్సరం ధన్వంతరి జయింతి (ధన్ తెరాస్)ను ఆయుర్వేద దినోత్సవంగా పాటిస్తోంది. ఈ సంవత్సరం ఇది నవంబర్ 13న వచ్చింది. ప్రస్తుతం ఉ న్న కోవిడ్ -19 పరిస్థితులలో 5వ ఆయుర్వేద దినోత్సవాన్ని జాతీయ , అంతర్జాతీయ స్థాయిలో వర్చువల్ పద్ధతిలో నిర్వహించనున్నారు.
మరిన్ని వివరాలకు..
ఐఎన్ఎస్ ఐరావత్‌ద్వారా డిజిబౌతికి ఆహార సహాయం అందించిన మిషన్ సాగర్ -2
ప్రస్తుత మానవతా సహాయ మిషన్ సాగర్ -2 కొనసాగింపులో భాగంగా , భారత నౌకాదళ నౌక ఐరావత్ , డిజిబౌతిలోని డిజిబౌతి పోర్టు కు 2020 నవంబర్ 10 న చేరుకుంది. భారత ప్రభుత్వం తన మిత్ర దేశాలు ప్రకృతి విపత్తులు ,కొవిడ్ మహమ్మారి నుంచి బయటపడేందుకు సహాయాన్ని అందిస్తోంది. అందులో భాగంగా ఐఎన్ఎస్ ఐరావత్ డిజిబౌతి ప్రజలకు ఆహారసహాయాన్ని తీసుకువెళుతున్నది. సాగర్ -2 మిషన్ ప్రధానమంత్రి దార్శనికత అయిన సాగర్ (సెక్యూరిటీ, గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ది రీజియన్ -ఎస్ ఎ జి ఎ ఆర్)కు అనుగుణంగా దీనిని చేపట్టారు. ఇది హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇండియా ఒక నమ్మకమైన భాగస్వామిగా ఉండడాన్ని పునరుద్ఘాటిస్తుంది. ఈ మిషన్, ఇండియా తన పొరుగున ఉన్న సముద్ర వాణిజ్యదేశాలతో సంబంధాలకు ఇస్తున్న ప్రాధాన్యతను తెలియజెబుతుంది. అలాగే ఈ దేశాలతో ప్రస్తుత బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాన్ని సూచిస్తుంది. భారత నౌకాదళం ఈ మిషన్‌ను రక్షణ, విదేశీ వ్యవహారాలు, ఇతర భారత ప్రభుత్వ ఏజెన్సీల సహకారంతో మరింత ముందుకు తీసుకుపోతున్నది.
మరిన్ని వివరాలకు :
పోస్ట్‌మాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణకు ఇంటివద్దకే సేవలు కార్యక్రమం ప్రారంభం.
పోస్ట్‌మాన్‌ద్వారా ఇంటివద్దకే డిజిటల్ లైఫ్‌సర్టిఫికేట్ సేవలను అందించేందుకు ఉద్దేశించిన పెన్షనర్లు, పెన్ణర్ల సంక్షేమ శాఖకు చెందిన కార్యక్రమాన్ని పోస్టల్ శాఖకుచెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్(ఐపిపిబి),మీటీ విజయవంతంగా ప్రారంభించింది. పెన్షనర్లు తమ లైఫ్‌సర్టిఫికేట్‌ను తమకు అనువైన పద్ధతిలొ, పారదర్శక విధానంలో జీవన్ ప్రమాణ్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో సమర్పించే సదుపాయాన్ని 2014 నవంబర్‌లో ప్రధానమంత్రి ప్రారంభించారు. ఇంటివద్దకే డిఎల్‌సి సమర్పణ సేవలను ఐపిపిబి ద్వారా అందుకునేందుకు పెన్షనర్లు ఐపిపిబి ఆన్ లైన్.కామ్‌ద్వారా పూర్తి వివరాలను పొందవచ్చు. దీనికి చార్జి వసూలుచేస్తారు. దేశవ్యాప్తంగాగల కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు వారికి వివిధ బ్యాంకులలో ఉన్న దానితో సంబంధం లేకుండా ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది.
మరిన్ని వివరాలకు :
పిఐబి క్షేత్ర స్థాయి కార్యాలయాలనుంచి సమాచారం.
అస్సాం : అస్సాంలో మరో 245 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. 837 మంది నిన్న కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 2,09,633 కు పెరిగింది. కోలుకుని ఆస్పత్రులనుంచి ఇళ్లకు వెళ్లిన పేషెంట్ల మొత్తం సంఖ్య 203305 కు చేరుకుంది. యాక్టివ్‌కేసులు 5371 ఉండగా మరణాల సంఖ్య 954కు చేరాయి.
మహారాష్ట్ర : మహారాష్ట్రలో కొత్తగా 4,907 కోవిడ్ కేసులు బుధవారం నాడు నమోదయ్యాయి. 9.164 మంది పేషెంట్లు కోవిడ్‌నుంచి కోలుకున్నారు. దీనితో కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ్య 88,070కి దిగివచ్చింది. రాష్ట్రంలో ఇప్పటివరకూ 45,560 మరణాలు నమోదయ్యాయి. కేస్ ఫాటలిటీ రేటు ప్రస్తుతం 2.63 శాతంగా ఉంది. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్దన్ మహారాష్ట్రతో సహా ఏడు రాష్ట్రాలకు కోవిడ్ పరీక్షలు పెంచడంపై దృష్టి పెట్టాల్సిందిగా సూచించారు. ప్రత్యేకించి జిల్లాలలో కోవిడ్ పాజిటివ్ కేసులు ఉన్న చోట, ప్రజలు ఎక్కువమంది గుమికూడే మార్కెట్లు,పని ప్రదేశాలలో ఎక్కు వ పరీక్షలు నిర్వహించడంపై దృష్టిపెట్టాల్సిందిగా సూచించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో సామన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వినూత్న చర్యలను మంత్రి అభినందించారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే రాష్్టరంలోని అందరు ప్రైవేటు వైద్యులకు ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద ఇన్సూరెన్సు సదుపాయం కల్పించాల్సిందిగా డిమాండ్ చేశారు.
గుజరాత్ : గుజరాత్‌లో కోవిడ్ నుంచి కోలుకుంటున్న వారి శాతం 91.28 శాతానికి చేరుకుంది. గుజరాత్‌లో 1,125 కొత్త కోవిడ్ కేసులు బుధవారం నాడు నమోదయ్యాయి. అహ్మాదాబాద్ నుంచి గరిష్ఠంగా 207 కొత్త కేసులు నమోదుకాగా సూరత్‌నుంచి 184 కొత్త కేసులు నమోదయ్యాయి. కాగా అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నగరంలోని 27 రద్దీ ప్రదేశాలలో నిషేధాన్ని ఎత్తివేసి, రానున్న దీపావళి సందర్భంగా రాత్రి 12 గంటల వరకు షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది. దీనితోపాటుగా రాణా ఆఫ్ కచ్‌లో టెంట్ సిటీని కచ్‌జిల్లాలో రానున్న పర్యాటక సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా తిరిగి తెరవనున్నారు.
రాజస్థాన్ : రాజస్థాన్‌లో కొత్తగా కోవిడ్ కేసులు పెరిగాయి. బుధవారం నాడు 2080 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. గత 30 రోజులలో ఇది గరిష్ఠం. బుధవారంనాడు గరిష్ఠ స్థాయిలో కోవిడ్ కేసులు జైపూర్ జిల్లాలో 400 నమోదుకాగా,జోధ్‌పూర్‌లో 310 కేసులు నమోదయ్యాయి. బికనూర్‌లో 174 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆయా జిల్లాలలో కోవిడ్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలియజేయాల్సిందిగా ఆరోగ్యశాఖ సంబంధిత జిల్లా కలెక్టర్లను కోరింది. కోవిడ్ కోసం ప్రత్యేకంగా నిర్దేశించిన ఆస్పత్రులలో వెంటిలేటర్లు, మరిన్ని సంఖ్యలో ఆక్సిజన్ సదుపాయం కలిగిన బెడ్లు ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లాల అధికార యంత్రాంగాన్ని కోరింది.
మధ్యప్రదేశ్. చాలా కొద్ది సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు మంగళవారంనాడు నమోదైన చాలా జిల్లాలలో బుధవారం నాడు కోవిడ్ కేసులు బాగా పెరిగాయి. నివారిజిల్లా లో మంగళవారం నాడు ఒక పాజిటివ్ కేసు నమోదుఉ కాగా బుధవారం నాడు ఈ జిల్లాలో 21 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే పతన్నలో మంగళవారం నాడు ఎలాంటి కేసులు నమోదు కానప్పటికీ బుధవారం నాడు 10 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే దమోహ్‌లో మంగళవారం 10 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం అవి 30 కేసులకు చేరాయి. సగటున రాష్్టరం లో 883 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 1.79 లక్షలకుచేరుకుంది. దీనితో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 8,328 కి చేరాయి..
కేరళ :
కేరళలో కోవిడ్ అనంతర అప్రమత్తతా క్లినిక్‌లు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో ఈరోజునుంచి పనిచేయడం ప్రారంభించాయి. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.కె.శైలజ మాట్లాడుతూ, కోవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్లకు వారి ఆరోగ్యాన్ని బట్టి తదుపరి సూచనలు ఇవ్వడం జరుగుతుందని, లేదా ఈ సంజీవని ప్లాట్ ఫారం ద్వారా కనీసం నెలకు ఒకసారి వారి ఆరోగ్యపరిస్థితిని పరిశీలించి తగిన సూచనలుచేయడం జరుగుతుందని అన్నారు. సెకండరీ , టెర్షియరీ, తాలూకా,జిల్లా జనరల్ ఆస్పత్రులు, మెడికల్ కాలేజిల స్థాయిలో కోవిడ్ రెఫరల్ ఆస్పత్రులు పనిచేయడం ప్రారంభించాయని ఆమె అన్నారు. ఇదిలా ఉండగా రానున్న శబరిమల యాత్రా సీజన్‌లో కారుణ్య ఆరోగ్య సురక్షా పదాతి పథకం కింద లబ్ధిదారులైన భక్తులకు ఉచిత చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కార్డును ఇందుకోసం వినియోగించుకోవచ్చని అన్నారు. కోవిడ్ 19 ను దృష్టిలో ఉంచుకుని పేషెంట్ మేనేజ్‌మెంట్‌కు ఆరోగ్యవిభాగం రూపొందించిన కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారు.
తమిళనాడు: నవంబర్ 16న తమిళనాడులో పాఠశాలలు, కళాశాలలను తెరవబోరు. డిసెంబర్2 నుంచి పిజి చివరి సంవత్సరం కోర్సులను ప్రారంభిస్తారు. తల్లిదండ్రుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు గతంలో చేసిన ప్రకటనను రాష్ట్రప్రభుత్వం ఉపసంహరించుకుంది. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రానికి బస్సుల సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఆతిథ్య రంగానికి కరోనా పరిస్థితుల కారణంగా 8,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ రంగం తగిన సహాయాన్ని కోరుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా హోటళ్లలో గదులు 10 శాతం మాత్రమే నిండుతున్నాయి. చెన్నై హోటళ్లు కాస్త మేలు. వీటిలో 35 శాతం గదులు నిండుతున్నాయి. హోటల్ళు 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నాయి. తగిన అనుమతులు తీసుకున్న తర్వాత శివరాత్రి ఈవెంట్‌ను నిర్వహించుకునేందుకు ఎన్‌జిటి ఈశా ఫౌండేషన్‌కు అనుమతి ఇచ్చింది. ఈ ఉత్సవాలను పర్యవేక్షించాల్సిందిగా ప్రభుత్వ విభాగాలను ట్రిబ్యూనల్ ఆదేశించింది.
కర్ణాటక : కర్ణాటక లో ఇటీవలి ఉప ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ మార్గదర్శకాలు ఉల్లంఘనలకు గురికావడంపట్ల రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు. కోవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించిన రాజకీయనాయకులపై క్రిమినల్ కేసులు దాఖలుచేయడంపై తమ వైఖరి వెల్లడించాల్సిందిగా హైకోర్టు , రాష్ట్రప్రభుత్వాన్ని కోరింది. ఏడు నెలల విరామం తర్వాత కె.ఎస్.ఆర్.టి.సి తమిళనాడుకు సర్వీసులు పునరుద్ధరించింది. రాష్ట్రంలో పాఠశాలలు తిరిగి ప్రారంభంపై కేబినెట్ లో చర్చించలేదని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి వివరించారు.
ఆంధ్రప్రదేశ్ : ఆరోగ్య రంగంలో దక్షిణ కోస్తా పరిస్థితి మెరుగు పడుతోంది. కొత్తకేసుల సంఖ్య కొద్ది వందలలోనే ఉంది. నెల్లూరు, ప్రకాశం జిల్లాలలో మొత్తం నిర్ధారిత కోవిడ్ కేసులు 1,22,750 కిపెరిగాయి. రాష్ట్రంలో మరోసారి కోవిడ్ కొత్తకేసులు 2000 కంటే తక్కువ నమోదు అయ్యాయి. బుధవారం నాడు 14 మరణాలు సంభవించాయి. 1732 కొత్తకేసులతో కోవిడ్ కేసుల సంఖ్య 8,47,977 కు చేరింది. మరణాల సంఖ్య 6,828 కి చేరింది. మరణాల రేఊటు 0.81 శాతం కాగా రికవరీ రేటు 96.73 శాతంగా ఉంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 20,915
తెలంగాణ : తెలంగాణాలో గత 24 గంటలలో 1015 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 172 కేసులు జి.హెచ్.ఎం.సి పరిధిలోనివి ఉన్నాయి. మొత్తం కేసులు 2,54,666. యాక్టివ్ కేసులు 17,323, మరణాలు 1393, కోలుకున్న వారి సంఖ్య 2,35,950 .రికవరీ రేటు 92.65 శాతం. కాగా గాంధీ ఆస్పత్రికి చెందిన జూనియర్‌డాక్టర్లు సమ్మెచేపట్టారు. నాన్ కోవిడ్ సేవలను తిరిగి ప్రారంభించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణా లొ కోవిడ్ కు సంబంధించి పరిస్థితులు మెరుగుపడితే డిసెంబర్‌లో కళాశాలలు ప్రారంభం కావచ్చని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ టి.పాపిరెడ్డి తెలిపారు.
FACT CHECK





*****
(Release ID: 1672466)
Visitor Counter : 288