సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
పోస్ట్ మాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి డోర్ స్టెప్ సౌకర్యం ప్రారంభం
పింఛనుదారులకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి భారీ ఉపశమనం.
Posted On:
12 NOV 2020 4:08PM by PIB Hyderabad
ఇళ్ల నుంచి పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించేలా చూడడానికి కేంద్ర పెన్షన్లు, పెన్షన్ దారుల సంక్షేమ శాఖ రూపొందించిన పథకాన్ని తపాలా శాఖకి చెందిన ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ మరియు మీటీలు అమలులోకి తీసుకుని వచ్చాయి. ' పోస్ట్ మాన్ ద్వారా డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పణ కోసం సర్వీస్' కార్యక్రమానికి కేంద్ర పెన్షన్లు, పెన్షన్ దారుల సంక్షేమ శాఖ రూపకల్పన చేసింది. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను అందించడానికి వీలు కల్పిస్తూ 2014 నవంబర్ 14వ తేదీన ప్రధానమంత్రి జీవన్ ప్రమాణ్ పోర్టల్ సౌకర్యాన్ని ప్రారంభించారు. పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్ ను సులువుగా పారదర్శకంగా సమర్పించాడానికి ఆవకాశం కల్పించాలన్న లక్ష్యంతో ఈ కారక్రమాన్ని ప్రారంభించడం జరిగింది.
దీని తరువాత కూడా పెన్షన్లు పెన్షన్ దారుల సంక్షేమ శాఖ డాక్టర్ జితేంద్ర సింగ్ నాయకత్వంలో సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను ఉపయోగిస్తూ పింఛనుదారుల సౌలభ్యం కోసం కార్యక్రమాలను రూపొందిస్తూ వస్తున్నది.
ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికెట్ ను అందించే కార్యక్రమాన్ని దేశవ్యాపితంగా అమలు చేయాలన్న లక్ష్యంతో పోస్ట్ మాన్లు, గ్రామీణ ప్రాంతాలలో డాక్ సేవకులతో విస్తృత యంత్రాంగాన్ని కలిగి ఉన్న ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది. తన సాఫ్ట్ వేర్ లో మార్పులు చేసిన బ్యాంక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకు అనుసంధానం చేసి పింఛనుదారులు ఇళ్ల నుంచి వారి లైఫ్ సర్టిఫికెట్ లను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది. ఇళ్ల నుంచే బ్యాంకు ఖాతా నుంచి నగదును తీసుకోవడం లాంటి సౌకర్యాలకు తోడుగా ఈ సౌకర్యాన్ని బ్యాంక్ ప్రారంభించింది. పింఛనుదారులకు తన సేవలను అందుబాటులో తీసుకుని రాడానికి దేశవ్యాపితంగా పనిచేస్తున్న1,89,00 మంది పోస్ట్ మెన్లు, గ్రామీణ డాక్ సేవకులకు స్మార్ట్ ఫోన్లను, బయో మెట్రిక్ పరికరాలను అందించనున్నది. బ్యాంకులకు వెళ్లకుండా లైన్లలో నిల్చోకుండా బ్యాంక్ సేవలను పొందడానికి వీలు కలుగుతుంది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన సమాచారాన్ని ippbonline.com. ద్వారా పొందవచ్చును. ఈ సేవలను పొందడానికి పింఛనుదారులు రుసుమును చెల్లించవలసి ఉంటుంది. పెన్షన్ ఖాతా ఏ బ్యాంకులో ఉన్నప్పటికీ పింఛనుదారులు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ సేవలను పొందవచ్చును. దీనికి సంబంధించిన సమాచారాన్ని పెన్షన్లు, పెన్షనర్ల సంక్షేమ శాఖ యూ ట్యూబ్ , పేస్ బుక్ లలో చూడవచ్చును. కొవిడ్ నేపథ్యంలో లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించడానికి అంబుబాటులోకి వచ్చిన ఈ సౌకర్యం పింఛనుదారులకు ఊరట కలిగిస్తుంది.
****
(Release ID: 1672349)
Visitor Counter : 211
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam