ప్రధాన మంత్రి కార్యాలయం
17 భారత్-ఆసియాన్ వర్చువల్ సదస్సులో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
Posted On:
12 NOV 2020 5:33PM by PIB Hyderabad
నమస్తే,
గౌరవ ప్రధాన మంత్రి ఉవెన్ సువన్ ఫుక్ మహాశయా,
మహాశయులారా,
ప్రతి ఏడాదిలాగా మనం సంప్రదాయంగా మన కుటుంబమంతా ఒకరికొకరం చేతులు పట్టుకొని తీయించుకునే ఫోటోకి ఈ సారి అవకాశం లేకపోయింది. అయినా సరే ఈ వర్చువల్ సమావేశంలో కలుసుకోవటం సంతోషంగా ఉంది. ముందుగా ఈ ఆసియాన్ సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న వియత్నాం కు, ఆసియాన్ లో భారత సమన్వయకర్త థాయిలాండ్ కు నా ప్రత్యేక అభినందనలు. కోవిడ్ కారణంగా ఎదురైన సమస్యలు ఉన్నప్పటికీ, మీ బాధ్యతను మీరి చక్కగా నిర్వర్తించారు.
మహాశయులారా,
భారత్-ఆసియాన్ దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం సుసంపన్నమైన మన ఉమ్మడి చారిత్రక, భౌగోళిక, సాంస్కృతిక వారసత్వ సంపద మీద ఆధారపడింది. మనం ఆరంభం నుంచీ తూర్పు వైపు దృష్టిసారిద్దామన్నభావననే ఆసియాన్ కు కేంద్రబిందువుగా పాటిస్తూ వస్తున్నాం.
భారతదేశపు భారత-పసిఫిక్ మహాసముద్రాల కార్యక్రమానికి, ఆసియాన్ పాటించే ఇండో-పసిఫిక్ దృక్పథానికి చాలా దగ్గరి బంధం ఉంది. ఈ ప్రాంతంలో అందరి భద్రత, ఎదుగుదలకోసం ఆసియాన్ దేశాలన్నీ కలసికట్టుగా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్న వాదనను మనం బలంగా నమ్ముతున్నాం.
భారత్-ఆసియాన్ మధ్య భౌతిక, ఆర్థిక, సామాజిక, డిజిటల్ , సముద్రతీర బంధాలను బలోపేతం చేసే పనులన్నిటినీ వేగవంతం చేయటమే మాకు అత్యంత ప్రాధాన్యం. ఈ రంగాలన్నిటిలోనూ గడిచిన కొన్నేళ్లలో మనం మరింత దగ్గరయ్యాం. ఈరోజు మన సంభాషణ వర్చువల్ పద్ధతిలో జరుగుతున్నప్పటికీ మన మధ్య విభేదాలను తొలగించుకోవటానికి ఎంతో ప్రయోజనకరం.
ఈ రోజు సమాలోచనలకు హాజరైన మీ అందరికీ మరోమారు ధన్యవాదాలు!
***
(Release ID: 1672425)
Visitor Counter : 199
Read this release in:
Hindi
,
Marathi
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam
,
Manipuri
,
English
,
Urdu
,
Bengali
,
Assamese