ప్రధాన మంత్రి కార్యాలయం

డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ యొక్క ఆత్మకథను విడుదల చేసి, ఆయన గౌరవార్థం ప్రవారా గ్రామీణ విద్యా సంస్థకు పేరు మార్చనున్న - ప్రధానమంత్రి

Posted On: 12 OCT 2020 7:35PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అక్టోబర్, 13వ తేదీ ఉదయం 11 గంటలకు, డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ యొక్క ఆత్మకథను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విడుదల చేసి, ఆయన గౌరవార్థం ప్రవారా గ్రామీణ విద్యా సంస్థ పేరును "లోక్ నేత డాక్టర్ బాలా సాహెబ్ విఖే పాటిల్ ప్రవారా గ్రామీణ విద్యా సంస్థగా,  పేరు మార్చనున్నారు.

డాక్టర్ బాలా సాహేబ్ విఖే పాటిల్ లోక్ సభ సభ్యునిగా పలు పర్యాయాలు సేవలందించారు.  అతని ఆత్మకథ పేరు ‘దేహ్ వెచ్వా కరాణి’ అంటే ‘ఒకరి జీవితాన్ని గొప్ప ప్రయోజనం కోసం అంకితం చేయడం’, అని అర్ధం.  వ్యవసాయం మరియు సహకార సంస్థలతో సహా వివిధ రంగాలకు తనదైన శైలిలో సేవలందించడం ద్వారా తమ జీవితాన్ని సమాజ ప్రయోజనాల కోసం అంకితం చేసిన అయన ఆత్మకథ కు ఆ పేరు పెట్టడం సమంజసంగా ఉంది. 

అహ్మద్ నగర్ జిల్లా, లోనీ లో 1964 సంవత్సరంలో ప్రవారా గ్రామీణ విద్యా సంస్థను స్థాపించారు.  గ్రామీణ ప్రజలకు ప్రపంచ స్థాయి విద్యను అందించడం మరియు ఆడ పిల్లలకు సాధికారత కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఏ సంస్థ ప్రస్తుతం విద్యార్థుల విద్యా, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, శారీరక, మానసిక అభివృధే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తోంది. 

 

*****



(Release ID: 1663848) Visitor Counter : 96