ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 అప్ డేట్

Posted On: 18 APR 2020 6:19PM by PIB Hyderabad

 

రాష్ట్రాలు , కేంద్ర‌పాలిత ప్రాంతాల‌ సమిష్టి కృషి ద్వారా కోవిడ్ -19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం భారత ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వీటిని క్రమం తప్పకుండా ఉన్న‌త‌ స్థాయిలో సమీక్ష‌,పర్యవేక్షిస్తున్నారు.
దేశ‌వ్యాప్తంగా 23 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లోని 47 జిల్లాల‌లో కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక అమ‌లు మంచిఫ‌లితాల‌ను ఇస్తోంది. గ‌త 28 రోజుల‌లో  క‌రోనా కేసులు న‌మోదు కాని జిల్లాల జాబితాలో  తాజాగా కొడ‌గు (క‌ర్ణాట‌క‌), మ‌హే (పుదుచ్చేరి) చేరాయి. గ‌త 14 రోజుల‌లో 12 రాష్ట్రాల‌లోని 22 కొత్త జిల్లాలలో ఒక్క కొత్త కేసూ న‌మోదు కాలేదు. అవి:
లఖిస‌రాయ్‌, గోపాల్‌గంజ్‌, బీహార్‌లోని భాగ‌ల్‌పూర్‌
ధోల్‌పూర్‌,రాజ‌స్థాన్లోని ఉద‌య్‌పూర్‌
జ‌మ్ము కాశ్మీర్ లోని పుల్వామా
మ‌ణిపూర్‌లోని తౌబాల్‌
క‌ర్ణాట‌క‌లోని చిత్ర‌దుర్గ‌
పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌
హ‌ర్యానాలోని రోహ‌త‌క్‌, చార్‌ఖి దాద్రి
అరుణాచ‌ల్ ప్ర‌దేశ్‌లోని లోహిత్‌
ఒడిషాలోని పూరి, భ‌ద్ర‌క్‌
అస్సాంలోని గోలాఘాట్‌, కామ్‌రూప్ రూర‌ల్‌, న‌ల్‌బ‌రి, ద‌క్షిణ సాల్‌మ‌ర‌
ప‌శ్చిమ‌బెంగాల్‌లోని జ‌ల్‌పాయ్గురి, కాలింపాంగ్‌
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని విశాఖ‌ప‌ట్నం
ప్ర‌స్తుతం కోవిడ్‌-19 మ‌ర‌ణాల రేటు 3.3 శాతంగా ఉంది. ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను విశ్లేషిస్తే మ‌ర‌ణించిన వారిలో

14.4 శాతం మంది  0-45 సంవ‌త్స‌రాల వ‌య‌సు మ‌ధ్యవారు
10.3 శాతం మంది  45-60 సంవ‌త్స‌రాల వ‌య‌సు మ‌ధ్య‌వారు
33.1 శాతం మంది  60-75 సంవ‌త్స‌రాల వ‌య‌సు మ‌ధ్య వారు
42.2 శాతం మంది 75 సంవ‌త్స‌రాలు ,అంత‌కు పైబ‌డిన వ‌య‌సు వారు.

75.3శాతం కేసులు 60 ఏళ్లు పైబడిన వారివ‌ని గ‌ణాంకాలు సూచిస్తున్నాయి. 83శాతం కేసులలో ఇత‌ర‌-అనారోగ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది.. వృద్ధులు , ఇత‌ర‌అనారోగ్యాల‌తో బాధపడుతున్న వ్యక్తులు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారని ఇది గతంలో  ప్ర‌ముఖంగా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చిన అంశాల‌ను ముందుకు  తెస్తున్న‌ది.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌రీక్షాప‌ద్ధ‌తుల‌ను స‌మీక్షించిన అనంత‌రం, ఐసిఎంఆర్ జాతీయ టాస్క్‌ఫోర్స్ అన్ని రాష్ట్రాల‌కూ మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది . ఇందుకు సంబంధించిన పూర్తి వివ‌రాలు కింది లింక్ లో చూడ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/ProtocolRapidAntibodytest.pdf
అద‌నంగా , ఏదైనా రాపిడ్ ప‌రీక్ష నిర్వ‌హించ‌డానికి ముందు, రాష్ట్రాలు కోవిడ్ -19 ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏ వివ‌రాల‌నైనా ఐసిఎంఆర్ వెబ్‌సైట్‌లో నిక్షిప్తం చేయాల్సి ఉంటుంది. (covid19cc.nic.in/ICMR).

కోవిడ్ -19  కు సంబంధించి దేశంలో మొత్తం 14,378 కేసులు నమోదయ్యాయి. 1992 మంది వ్యక్తులు అంటే, మొత్తం కేసులలో 13.82శాతం మంది  వ్యాధినుంచి కోలుకున్న తర్వాత  ఇళ్ల‌కు వెళ్లారు.

కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత స‌మాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గ‌ద‌ర్శ‌కాలు, ఇత‌ర సూచ‌న‌ల‌కోసం క్ర‌మం త‌ప్ప‌కుండా గ‌మ‌నించండి : https://www.mohfw.gov.in/.

కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాల‌పై త‌మ ప్ర‌శ్న‌ల‌ను technicalquery.covid19[at]gov[dot]in  ఈమెయిల్‌కు పంపవ‌చ్చు. ఇత‌ర ప్ర‌శ్న‌ల‌ను ncov2019[at]gov[dot]in .కు పంప‌వచ్చు.

కోవిడ్ -19పై ఏవైనా ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాల కోసం కేంద్ర ఆరోగ్య‌,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ‌శాఖ హెల్ప్‌లైన్ నెంబ‌ర్ :  +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయ‌వ‌చ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గ‌మ‌నించ‌వ‌చ్చు.
https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .



(Release ID: 1615810) Visitor Counter : 253