ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఈ పరీక్షల వేళ మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణం సృష్టించాలని సూచిస్తూ ఓ కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 14 JAN 2026 1:53PM by PIB Hyderabad

ఈ ఏడాది పరీక్షల సమయంలో మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణం సృష్టించాలని సూచిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజలతో ఓ కథనాన్ని పంచుకున్నారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో కేంద్ర మంత్రి శ్రీ జయంత్ చౌదరి పోస్టుపై స్పందిస్తూ ప్రధానమంత్రి పంపిన సందేశాన్ని ఆయన కార్యాలయం (పీఎంఓ) కింది విధంగా పేర్కొంది:

“విద్యాభ్యాసం, పరీక్షలలో ఒత్తిడిని జయిద్దాం రండి!

మన సామర్థ్యానికి మార్కులు, అంచనాలు కొలబద్దలు కారాదు... అవి మార్గనిర్దేశకాలు మాత్రమే. కాబట్టి, మిత్రులు-తల్లిదండ్రుల మధ్య సమతుల వాతావరణ సృష్టికి యత్నించాలని సూచిస్తూ కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి శ్రీ జయంత్‌ చౌదరి @jayantrld ఒక వ్యాసం రాశారు. ఈ పరీక్షల సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు తప్పక చదవాల్సిన వ్యాసమిది!” అని ప్రధానమంత్రి సూచించినట్లు ‘పీఎంఓ’ వివరించింది.

 

***


(रिलीज़ आईडी: 2214991) आगंतुक पटल : 4
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam