సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
బీఐఎన్ డీ పథకం ద్వారా రూ. 2,539.61 కోట్లతో దూరదర్శన్, ఆకాశవాణి ఆధునీకరణ
హెచ్ డీ ఛానళ్లు, వేవ్స్ ఓటీటీ, సమాచార సంస్కరణలు
మహాకుంభమేళా 2025 నుంచి ఇస్రో ప్రయోగాల వరకు: ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ప్రజా చేరువను బలోపేతం చేసిన దూరదర్శన్, ఆకాశవాణి
ప్రభుత్వేతర ప్రకటనల ద్వారా ఆకాశవాణి, దూరదర్శన్‌కు ₹587.78 కోట్ల ఆదాయం: ప్రభుత్వం వెల్లడి
प्रविष्टि तिथि:
18 DEC 2025 2:06PM by PIB Hyderabad
దూరదర్శన్, ఆకాశవాణి కార్యకలాపాలను మరింత మెరుగుపరచడానికి, పోటీ ప్రపంచంలో వాటి ప్రసారాలను ఎక్కువ సంఖ్యలో ప్రేక్షకులకు అందించేందుకు భారత ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
కార్యక్రమాల నాణ్యత, వైవిధ్యాన్ని మెరుగుపరిచేందుకు 2024లో సరళీకృత విధానాన్ని ప్రవేశపెట్టింది. దీని ద్వారా అనేక కొత్త కార్యక్రమాలను వేగంగా అందించడంతోపాటు.. ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు వీలవుతుంది.
ప్రాంతీయ, రాష్ట్ర కేంద్రాల ద్వారా స్థానిక కళాకారులను భాగస్వామ్యంతో ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని రూపొందించడంతోపాటు నిరంతరం కొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తుంది.
ప్రతిభను ఆకర్షించి, నాణ్యమైన స్థానిక సమాచారానికి మద్దతందించాలనే లక్ష్యంతో.. దూరదర్శన్‌కు చెందిన 66 కార్యక్రమ నిర్మాణ కేంద్రాల ద్వారా స్థానిక కళాకారులు, తాత్కాలిక ఉద్యోగుల పారితోషికాలను ప్రభుత్వం సవరించింది.
మరింతగా ప్రజల్ని చేరుకునేందుకు ప్రధాన జాతీయ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. దీనికి ఉదాహరణ.. మహాకుంభ మేళా 2025 (ప్రయాగ్‌రాజ్), వేవ్స్ 2025 (ముంబై), ఇస్రో ఉపగ్రహ ప్రయోగాలు.
సాంకేతిక ఆధునీకరణలో భాగంగా అనేక డీడీ ఛానళ్లను హెచ్ డీలో ప్రసారం చేయడంతోపాటు వేవ్స్ ఓటీటీ వేదికను ప్రారంభించడం ద్వారా డిజిటల్ వ్యాప్తిని మరింత బలోపేతం చేసిది. డీడీతో పాటు ఇతర ఛానళ్లను వేవ్స్ ఓటీటీ ఆన్ లైన్ న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ వంటి డిజిటల్ వేదికలతో సమన్వయం చేశారు.
ఆకాశవాణి కూడా ‘‘ది ఆకాశవాణి పాడ్ కాస్ట్’’, “ఆకాశవాణి ఒరిజినల్స్” అనే ఆడియో విజువల్ పాడ్ కాస్ట్ సిరీస్‌లను ప్రారంభించింది.
ఆకాశవాణిలో ప్రభుత్వం నిర్మాణాత్మక సంస్కరణలను చేపట్టింది. ఇందులో క్లస్టర్ అధిపతులు, కార్యాలయ అధిపతులకు స్పష్టమైన బాధ్యతలను అప్పజెప్పడం, ఆదాయంపై దృష్టి సారించడం, సమాచార నాణ్యతను మెరుగుపరచడం, మార్కెట్ పరిధిని విస్తరించడం వంటి అంశాలు ఉన్నాయి.
యాప్‌లు, ఓటీటీ, సామాజిక మాధ్యమాలు వంటి ప్రత్యామ్నాయ ప్రసార మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తుంది. వీటికి అనుబంధంగా బహుళ ఛానళ్ల ద్వారా ప్రచారం, సమన్వయ మార్కెటింగ్ ప్రయత్నాలు కూడా చేపడుతున్నాయి.
ప్రసార భారతి ఆధునీకరణ, మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం బ్రాడ్‌కాస్టింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ నెట్‌వర్క్ డెవలప్‌మెంట్ (బీఐఎన్ డీ) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. దీని కోసం రూ. 2,539.61 కోట్లను కేటాయించింది.
ఈ పథకం డిజిటలైజేషన్, పాత వ్యవస్థల స్థానంలో కొత్త వాటి ఏర్పాటు, స్టూడియోలు, ట్రాన్స్‌మిటర్లను అత్యాధునికంగా మార్చడం, ప్రసారాల పరిధిని విస్తరించడం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంపై దృష్టి సారిస్తుంది.
ఆదాయాన్ని మరింత పెంచేందుకు మెరుగైన వినియోగదారు భాగస్వామ్యం, ఆదాయ పెంపు లక్ష్యంగా సమాచార ప్రణాళిక, బహుళ వేదికల ప్రచార, సమగ్ర ప్రకటనల వ్యూహాలు వంటి చర్యలను కూడా అమలు చేస్తున్నారు.
2022–25 మధ్య కాలంలో ఆకాశవాణి, దూరదర్శన్ ద్వారా ప్రభుత్వేతర ప్రకటనల విభాగం నుంచి మొత్తం రూ. 587.78 కోట్ల ఆదాయం లభించిది.
లోక్ సభలో శ్రీ పర్షోత్తంభాయ్ రూపాలా అడిగిన ప్రశ్నకు సమాధానంగా సమాచార, ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ డిసెంబర్ 17న ఈ వివరాలను వెల్లడించారు.
***
(रिलीज़ आईडी: 2206119)
आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
Bengali-TR
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada