ప్రధాన మంత్రి కార్యాలయం
2030 కామన్వెల్త్ క్రీడల శతాబ్ది బిడ్‌ను భారత్ గెలిచిన సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి అభినందనలు
प्रविष्टि तिथि:
26 NOV 2025 7:58PM by PIB Hyderabad
2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిధ్యానికి సంబంధించిన బిడ్‌ను భారత్ గెలుచుకోవడం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
భారత సమష్టి నిబద్ధత, క్రీడా స్ఫూర్తిని ఈ విజయం ప్రతిబింబిస్తుందన్నారు. ఇది ప్రపంచ క్రీడా పటంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేసిందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
‘ఎక్స్’ వేదికగా శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
“2030లో జరిగే శతాబ్ది కామన్వెల్త్ క్రీడల ఆతిథ్య బిడ్‌ను భారత్ గెలుచుకున్నందుకు సంతోషంగా ఉంది!
భారత ప్రజలకు, యావత్ క్రీడా రంగానికీ అభినందనలు. మన సమష్టి నిబద్ధత, క్రీడా స్ఫూర్తి... ప్రపంచ క్రీడా పటంలో భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేశాయి.
వసుధైక కుటుంబ భావనతో ఈ చరిత్రాత్మక క్రీడలను ఎంతో ఉత్సాహంతో నిర్వహించేందుకు ఆసక్తిగా ఉన్నాం.
ప్రపంచాన్ని స్వాగతించడానికి మేం ఎదురుచూస్తున్నాం!
https://www.commonwealthsport.com/news/4408937/commonwealth-sport-confirms-amdavad-india-as-host-of-the-2030-centenary-games”
(रिलीज़ आईडी: 2195066)
आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
Tamil
,
Malayalam
,
Kannada
,
Odia
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati