ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సంపూర్ణ ఆరోగ్యానికీ, దీర్ఘకాలిక ప్రగతికీ కీలకమైన సాంప్రదాయక వైద్యాన్ని ప్రోత్సహించడానికి


భారత్ అత్యంత నిబద్ధతతో పనిచేస్తోందని పేర్కొన్న వ్యాసం..

ప్రజలతో ఆ వ్యాసాన్ని పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 24 NOV 2025 2:31PM by PIB Hyderabad

సంపూర్ణ ఆరోగ్యంతో పాటు దీర్ఘకాలిక పురోగతికి కీలకం సాంప్రదాయక వైద్యమేనన్న భావనను ప్రోత్సహించే విషయంలో భారత్ అత్యంత నిబద్ధతతో ముందుకు పోతోందని వివరించిన కేంద్ర మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్ వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని పీఎంఓ ఇండియా పొందుపరుస్తూ -
‘‘సాంప్రదాయక వైద్య వారసత్వాన్ని గొప్పగా చాటిచెప్పడంతో పాటు ఆ వైద్యానికి రాబోయే కాలంలోనూ మరింత ఆదరణ లభించేటట్లు చూడటానికి భారత్ వివిధ కార్యక్రమాలను అమలుచేస్తోందని కేంద్ర సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావు జాదవ్
ఒక వ్యాసంలో  వివరించారు. ఇది తప్పక చదవాల్సిన వ్యాసం.
ఆరోగ్యం బాగుచేయాలి, అంతేకాని హానిని కలగజేయకూడదు.. పురోగతి నిరంతరంగా వెలుగులీనుతుండాలే తప్ప, కొడిగట్టిపోరాదు.. సైన్సు సేవను అందించాలి గానీ, అడ్డుగోడలను నిర్మించవద్దన్నదే భారత్ ఇస్తున్న ముఖ్య సందేశమని ఆయన ప్రధానంగా వివరించారు’’ అని పేర్కొంది.

 

***


(Release ID: 2193860) Visitor Counter : 4