ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దేశాభివృద్ధిలో సముద్ర ఆర్థిక వ్యవస్థ ప్రధాన పాత్ర పోషించడంపై వచ్చిన కథనాన్ని పంచుకున్న ప్రధాని

Posted On: 19 SEP 2025 1:59PM by PIB Hyderabad

దేశాభివృద్ధికి సముద్ర ఆర్థిక వ్యవస్థ కేంద్ర బిందువుగా మారిన విధానాన్ని.. అది శ్రేయస్సుస్థిరత్వంజాతీయ శక్తిని ఏక కాలంలో ఎలా మిళితం చేస్తుందనే దానిపై కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు పంచుకున్నారు. ‘‘సముద్ర వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికిస్థానిక ప్రజలను సాధికారులుగా చేయడానికికొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం ఇస్తూ.. ప్రపంచ సముద్ర పాలనలో భారత నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి సాగరమాలాడీప్ ఓషన్ మిషన్హరిత సాగర్ మార్గదర్శకాలు వంటి కార్యక్రమాలను డాజితేంద్ర సింగ్ గారు తమ కథనంలో ప్రస్తావించారు’’ అని ప్రధాని శ్రీ మోదీ తెలిపారు.

కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ‘‘ఎక్స్’’ లో చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇలా అన్నారు.

‘‘భారతదేశ వృద్ధికి సముద్ర ఆర్థిక వ్యవస్థ కేంద్రంగా ఉందనిఇది శ్రేయస్సుస్థిరత్వం,  జాతీయ శక్తిని మిళితం చేస్తుందని MoS @DrJitendraSingh తన కథనంలో పేర్కొన్నారుఇది సమాజాలను శక్తిమంతం చేస్తూఆవిష్కరణలను ముందుకు నడిపిస్తూప్రపంచ సముద్ర పాలనలో దేశ నాయకత్వాన్ని బలోపేతం చేస్తూ సముద్ర వనరులను ఉపయోగించుకోవడానికి సాగర్ మాలడీప్ ఓషన్ మిషన్హరిత్ సాగర్ వంటి మార్గదర్శక కార్యక్రమాలకు ఆయన ప్రాముఖ్యతనిచ్చారు.’’

 

***


(Release ID: 2168780)