ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి జనధన్ యోజన 11 సంవత్సరాల మార్గదర్శక ప్రయాణాన్ని గుర్తు చేసిన ప్రధాని మోదీ
Posted On:
28 AUG 2025 1:20PM by PIB Hyderabad
ప్రధానమంత్రి జనధన్ యోజనను ప్రారంభించి నేటికి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేశారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సేవలను విస్తృతంగా పెంచే కార్యక్రమంగా ఈ పథకం నిలిచిందన్నారు. పీఎం జన్‌ధన్ యోజన.. గౌరవాన్ని పెంచడమే కాకుండా ఆర్థిక సార్వజనీనతను సాధించడం ద్వారా తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకునే శక్తిని ప్రజలకు అందించిందని ఆయన పేర్కొన్నారు.
ఈ మేరకు మైగవ్ఇండియా చేసిన పోస్టులకు స్పందిస్తూ.. ‘‘ఎక్స్’’లో ఇలా పేర్కొన్నారు.
‘ఆర్థిక సార్వజనీనత నుంచి సాధికారత దిశగా.. ప్రధాన్ మంత్రి జనధన్ యోజన దేశవ్యాప్తంగా ప్రజల జీవితాలను ఎలా మార్చివేసిందే తెలిపేందుకు ఇదొక నిదర్శనం.
#11YearsOfJanDhan
‘చివరి వ్యక్తి వరకు ఆర్థిక సేవలు అందితే దేశం మొత్తం ముందుకు సాగుతుంది. ప్రధాన మంత్రి జనధన్ యోజన సాధించింది ఇదే. ఈ పథకం ప్రజల గౌరవాన్ని పెంచింది. తమ భవిష్యత్తును తాము నిర్మించుకునే శక్తిని ఇచ్చింది.
#11YearsOfJanDhan
(Release ID: 2161501)
Visitor Counter : 13
Read this release in:
Assamese
,
English
,
Khasi
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam