ప్రధాన మంత్రి కార్యాలయం
                
                
                
                
                
                    
                    
                         ప్రధానమంత్రితో హ్యుందాయ్ మోటార్ గ్రూప్ అధిపతి ఇయిసున్ చుంగ్ సమావేశం
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                24 OCT 2024 8:53PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                హ్యుందాయ్ మోటార్ సంస్థల అధిపతి ఇయిసున్ చుంగ్ నేడు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు. న్యూఢిల్లీ లో జరిగిన వీరి సమావేశంలో మాట్లాడిన ప్రధాని,  భారత దేశ ఆర్థిక వ్యవస్థకు మహారాష్ట్ర పట్టుగొమ్మ వంటిదనీ, హ్యుందాయ్  వంటి దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో ముందుకొస్తే, స్థానికులకు అది లబ్ధి చేకూరుస్తుందన్నారు.
‘ఎక్స్ ‘వేదికపై హ్యుందాయ్ భారత శాఖ పోస్టుకు స్పందించిన ప్రధాని ఈ సందేశాన్నిపంచుకున్నారు :
“ఇయిసున్ చుంగ్ గారిని కలవడం నాకు సంతోషాన్నిచ్చింది. పెట్టుబడులకు భారత్ ను మించిన గమ్యస్థానం లేదు. పూణే శాఖ ఏర్పాటు పట్ల హ్యుందాయ్ సంస్థ కనపరుస్తున్న ఆసక్తి ముచ్చటగొల్పుతోంది. భారత ఆర్థిక వ్యవస్థకు మహారాష్ట్ర పట్టుగొమ్మ వంటిది. రాష్ట్రంలో భారీ పెట్టుబడుల కోసం  హ్యుందాయ్ వంటి దిగ్గజ సంస్థలు ముందుకొస్తే స్థానికులకు లబ్ధి చేకూరుతుంది.”
 
***
                
                
                
                
                
                (Release ID: 2067987)
                Visitor Counter : 59
                
                
                
                    
                
                
                    
                
                Read this release in: 
                
                        
                        
                            Odia 
                    
                        ,
                    
                        
                        
                            English 
                    
                        ,
                    
                        
                        
                            Urdu 
                    
                        ,
                    
                        
                        
                            हिन्दी 
                    
                        ,
                    
                        
                        
                            Marathi 
                    
                        ,
                    
                        
                        
                            Assamese 
                    
                        ,
                    
                        
                        
                            Bengali 
                    
                        ,
                    
                        
                        
                            Manipuri 
                    
                        ,
                    
                        
                        
                            Punjabi 
                    
                        ,
                    
                        
                        
                            Gujarati 
                    
                        ,
                    
                        
                        
                            Tamil 
                    
                        ,
                    
                        
                        
                            Kannada 
                    
                        ,
                    
                        
                        
                            Malayalam