ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పోలెండ్ లోని వార్సాలో కొల్హాపుర్ స్మారకానికి ప్రధాన మంత్రి శ్రద్ధాంజలి

నాడు పోస్టు చేయడమైనది: 21 AUG 2024 10:31PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పోలెండ్ లోని వార్సాలో గల కొల్హాపుర్ స్మారకానికి చేరుకొని శ్రద్ధాంజలి ఘటించారు.  ఈ స్మారకం కొల్హాపుర్ కు చెందిన మహనీయ రాజకుటుంబానికి ఒక నివాళిగా ఉందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం సందర్భంలో భయానక స్థితిగతుల కారణంగా ఆశ్రయాన్ని కోల్పోయిన పోలెండుకు చెందిన మహిళలకు, బాలలకు తలదాచుకొనే నీడను ఇవ్వడంలో ఈ రాజకుటుంబం అగ్ర స్థానాన నిలిచింది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాల నుంచి ప్రేరణను పొందిన మహనీయ కొల్హాపుర్ రాజ కుటుంబం మానవీయతనే అన్నింటి కన్నా మిన్నగా ఎంచిందని, పోలెండుకు చెందిన మహిళల, బాలల ప్రాణాలకు ఎటువంటి హాని జరగకుండా చూసిందని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

ప్రధాన మంత్రి ‘ఎక్స్’ లో పొందుపరచిన ఒక సందేశంలో -

 ‘‘వార్సాలో కొల్హాపుర్ స్మారకాన్ని చేరుకొని శ్రద్ధాంజలి ఘటించాను.  ఈ స్మారకం మహనీయ కొల్హాపుర్ రాజ కుటుంబానికి ఒక నివాళిగా ఉంది.  రెండో ప్రపంచ యుద్ధ సందర్భంలో తలెత్తిన భయానక స్థితిగతుల కారణంగా ఆశ్రయాన్ని కోల్పోయిన పోలెండుకు చెందిన మహిళలకు, బాలలకు తలదాచుకొనే నీడను ఇవ్వడంలో ఈ రాజ కుటుంబం అగ్రస్థానాన నిలిచింది.  ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆదర్శాల ద్వారా ప్రేరణను పొందిన కొల్హాపుర్ రాజకుటుంబం మానవీయతను అన్నిటికంటే మిన్నగా భావించి, పోలెండుకు చెందిన మహిళల, బాలల ప్రాణ రక్షణకు అండగా నిలిచింది. ఈ దయాపూరితమైన కార్యం రాబోయే తరాలకు సైతం ప్రేరణను ఇస్తూనే ఉంటుంది.’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 2047575) సందర్శకుల సూచీ సంఖ్య : : 89