ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం రక్షణ రంగ సంబంధ ఉత్పత్తులలో ఇదివరకు ఎన్నడూ లేనంత అధిక వృద్ధి ని 2023-24 లో నమోదు చేయడాన్ని ప్రశంసించిన ప్రధాన మంత్రి

Posted On: 05 JUL 2024 12:34PM by PIB Hyderabad

భారతదేశం 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పాదన లో అత్యధిక వృద్ధి ని నమోదు చేయడాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రక్షణ రంగ ఉత్పాదన విలువ 1,26,887 కోట్ల రూపాయలకు చేరుకొంది. ఇది అంతకుముందు ఆర్థిక సంవత్సరం లో నమోదైన ఉత్పత్తి విలువ తో పోలిస్తే 16.8 శాతం అధికం.

 

రక్షణ శాఖ కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింగ్ ఎక్స్ లో పెట్టిన ఒక పోస్ట్ ను ప్రధాన మంత్రి షేర్ చేస్తూ -

‘‘చాలా ఉత్సాహకరమైన కబురు.  ఈ ఘనతకు తోడ్పాటును అందించిన అందరికి అభినందనలు. మన సామర్థ్యాలను మరింతగా పెంచుకోవడానికి, భారతదేశాన్ని ప్రపంచం లో రక్షణ రంగ ఉత్పాదనలకు అగ్రగామి కేంద్రం గా మలచడానికి అనువైన వాతావరణాన్ని ఏర్పరచడం కోసం మేం పూర్తి స్థాయి నిబద్ధత తో ఉన్నాం. ఇది మన భద్రత యంత్రాంగాన్ని పటిష్టం చేయడం తో పాటు మనను స్వయంసమృద్ధంగా మారుస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/TS



(Release ID: 2031006) Visitor Counter : 5