ప్రధాన మంత్రి కార్యాలయం

భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను కొనియాడిన ప్రధాన మంత్రి

Posted On: 05 MAR 2024 9:47AM by PIB Hyderabad

థాయీలాండ్ లోని లక్షల కొద్దీ భక్త జనం 2024 ఫిబ్రవరి 23 వ తేదీ మొదలుకొని మార్చి నెల 3 వ తేదీ మధ్య కాలం లో బ్యాంకాక్ లో భగవాన్ బుద్ధుని మరియు ఆయన శిష్యులు అరహంత్ సారిపుత్త్ కు మరియు అరహంత్ మహా మోగ్గలానా కు చెందిన పవిత్రమైనటువంటి అవశేషాల కు నమస్సులు అర్పించిన నేపథ్యం లో, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ భగవాన్ బుద్ధుని ఆదర్శాల ను ఈ రోజు న కొనియాడారు.

 

రాబోయే రోజుల లో ఈ అవశేషాల ను భద్రపరచనున్న చియాంగ్ మాయీ లో, ఉబోన్ రత్‌చథానీ మరియు క్రాబీ లలో సైతం వందనాల ను ఆచరించవలసింది గా భక్త గణాని కి ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశాన్ని నమోదు చేస్తూ ఆ సందేశం లో -

‘‘భగవాన్ బుద్ధుని యొక్క ఆదర్శాలు భారతదేశాని కి మరయు థాయీలాండ్ కు మధ్య ఆధ్యాత్మిక సేతువు వలె ఉంటూ, ఒక ప్రగాఢమైన బంధాన్ని పెంచి పోషిస్తున్నాయి. భక్త జనులు ఆధ్యాత్మికత్వం పరం గా ఘనమైనటువంటి అనుభూతి కి లోనవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మరి రాబోయే కాలం లో అవశేషాల ను భద్రపరచనున్న చియాంగ్ మాయీ కి, ఉబోన్ రత్‌చథానీ కి మరియు క్రాబీ కి కూడా యాత్ర గా వెళ్లి నమస్సులను అర్పించవలసిందంటూ భక్తావళి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

 

 

 



(Release ID: 2011695) Visitor Counter : 96