ప్రధాన మంత్రి కార్యాలయం

భవిష్యద్దార్శనికుడు,నేత్ర వైద్య నిపుణుడు మరియు శంకర నేత్రాలయ స్థాపకుడైన డాక్టర్ శ్రీ ఎస్.ఎస్.బద్రీనాథ్ కన్నుమూత పట్ల తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 NOV 2023 1:23PM by PIB Hyderabad

భవిష్యద్దార్శనికుడు, నేత్ర వైద్య నిపుణుడు మరియు శంకర నేత్రాలయ వ్యవస్థాపకుడైన డాక్టర్ శ్రీ ఎస్.ఎస్. బద్రీనాథ్ కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర దుఃఖాన్ని వ్యక్తం చేశారు.


ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో -

 

‘‘దూరాలోచనపరుడు, నేత్ర వైద్య చికిత్స లో నిపుణుడు మరియు శంకర నేత్రాలయ యొక్క స్థాపకుడైన డాక్టర్ శ్రీ ఎస్.ఎస్ బద్రీనాథ్ జీ మరణం తో ఎంతో దుఃఖం కలిగింది. కంటి సంరక్షణ రంగాని కి ఆయన అందించిన తోడ్పాటు లు మరియు సమాజాని కి ఎడతెగక చేసిన సేవ లు చెరగని ముద్ర ను వదలేటటువంటివే. ఆయన యొక్క కృషి తరాల తరబడి ప్రేరణ ను అందిస్తూనే ఉంటుంది. ఆయన కుటుంబాని కి మరియు ఆయన యొక్క ప్రియజనుల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని పేర్కొన్నారు.




***


DS/TS



(Release ID: 1978484) Visitor Counter : 84