ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆసియన్ పారా గేమ్స్ 2022లో పారా ఆర్చర్లు హర్విందర్ సింగ్, సాహిల్ మెన్స్ డబుల్స్ రికర్వ్ ఈవెంట్ లో కాంస్య పతకం సాధించడం పట్ల ప్రధానమంత్రి హర్షం

प्रविष्टि तिथि: 25 OCT 2023 4:40PM by PIB Hyderabad

చైనాలోని హాంగ్  ఝూలో జరుగుతున్న ఆసియన్ పారా గేమ్స్ 2022లో మెన్స్  డబుల్స్ రికర్వ్  ఈవెంట్  లో కాంస్య పతకం గెలుచుకున్న పారా ఆర్చర్లు హర్విందర్  సింగ్, సాహిల్  లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఆయన ఈ మేరకు ఎక్స్  లో ఒక పోస్ట్  చేస్తూ

‘‘ఆసియన్ పారా గేమ్స్ 2022లో మెన్స్  డబుల్స్ రికర్వ్-ఓపెన్  ఈవెంట్  లో కాంస్య పతకం గెలుచుకున్న మన పారా ఆర్చర్లు హర్విందర్  సింగ్, సాహిల్ లకు అభినందనలు. వారి అసాధారణ ప్రదర్శన, బాణం వేయడంలో వారు చూపిన నిశిత  గురి భారతదేశం గర్వపడేలా చేశాయి. చక్కని అర్హతతో వారు సాధించిన ఈ విజయాన్ని అమిత ఉత్సాహంతో భారతదేశం వేడుక చేసుకుంటోంది’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 1971894) आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada