ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సుదీర్ఘ విరామం అనంతరం ఈక్వెస్ర్టియన్ డ్రెసేజ్ టీమ్ ఆసియా క్రీడోత్సవాలు 2022లో బంగారు పతకం సాధించడాన్ని ప్రశంసించిన పీఎం

प्रविष्टि तिथि: 26 SEP 2023 4:24PM by PIB Hyderabad

హాంగ్   జోలో జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాలు 2022లో సుమారు 41 సంవత్సరాల విరామం అనంతరం స్వర్ణ పతకం సాధించిన ఈక్వెస్ట్రియన్ డ్రెసేజ్  టీమ్ లో సభ్యులైన హృద‌య్  చెద్దా, అనుష్ అగర్వాలా, సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్ లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

ఈ మేరకు ఆయన ఎక్స్  లో ఒక పోస్ట్  లో...

‘‘ఎన్నో దశాబ్దాల అనంతరం మన ఈక్వెస్ట్రియన్  డ్రెసేజ్  టీమ్ ఆసియా క్రీడోత్సవాల్లో స్వర్ణ పతకం  సాధించడం గర్వకారణం.

హృద‌య్  చెద్దా, అనుష్ అగర్వాలా, సుదీప్తి హజేలా, దివ్యకృతి సింగ్ అంతర్జాతీయ వేదికపై   అసాధారణమైన నైపుణ్యం, టీమ్  వర్క్  ప్రదర్శించి జాతికి గౌరవం తెచ్చి పెట్టారు.

ఈ చారిత్రక విజయానికి టీమ్ అందరికీ నేను హృద‌యపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను’’ అని పేర్కొన్నారు. 


(रिलीज़ आईडी: 1961150) आगंतुक पटल : 136
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam