ప్రధాన మంత్రి కార్యాలయం
వ్యూహాత్మకంగా కీలకమైన 928 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్స్/స్పేర్స్- కాంపోనెంట్లతో కూడిన 4వ దేశీయకరణ అనుకూల జాబితాకు రక్షణశాఖ ఆమోదం
రక్షణ రంగంలో ఇది సానుకూల పరిణామంగా అభివర్ణించిన ప్రధాని
Posted On:
16 MAY 2023 9:39AM by PIB Hyderabad
దేశ సైనికావసరాలకు సంబంధించి వ్యూహాత్మకంగా కీలకమైన 928 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్స్/స్పేర్స్-కాంపోనెంట్లతో కూడిన 4వ దేశీయకరణ అనుకూల జాబితాకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో అత్యాధునిక రక్షణ సామగ్రి, విడిభాగాలు కూడా ఉన్నాయని, ఈ దిగుమతి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల విలువ రూ.715 కోట్లు ఉంటుంది. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిపై స్పందిస్తూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“రక్షణ రంగంలో ఇదొక సానుకూల పరిణామం. స్వయం సమృద్ధ భారతంపై మా సంకల్పాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా దేశీయ పారిశ్రామిక నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
దీనిపై మరిన్ని వివరాలను https://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1923971 చిరునామాలో చూడవచ్చు.
(Release ID: 1924511)
Visitor Counter : 195
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam