ప్రధాన మంత్రి కార్యాలయం

బాందీపుర్ మరియు ముదుమలై పులులఅభయారణ్యాల కు చెందిన ముఖ్యాంశాల ను శేర్ చేసిన ప్రధాన మంత్రి


పులుల ను సంరక్షించడం కోసం కష్టపడి పని చేస్తున్న వారందరినీ ప్రధాన మంత్రి అభినందించారు

Posted On: 09 APR 2023 10:31PM by PIB Hyderabad

బాందీపుర్ మరియు ముదుమలై పులుల అభయారణ్యాల ను సందర్శించినప్పటి విశేషాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వెల్లడించారు. పులుల సంరక్షణ కై కఠోర శ్రమ చేస్తున్న అటవీ అధికారులు, గార్డు లు, టైగర్ రిజర్వ్ ఫ్రంట్ లైన్ స్టాఫ్ తో పాటు ఈ పని లో నిమగ్నం అయిన వారందరి ని కూడాను అభినందించారు.

 

ప్రధాన మంత్రి అనేక ట్వీట్ ల లో ఈ కింది విధం గా పేర్కొన్నారు..

 

‘‘ఈ రోజు, ఒక విశిష్టమైనటువంటి రోజు. నేను వైవిధ్యభరితం అయినటువంటి మొక్క జాతులు మరియు పశు జాతుల మధ్య గడిపాను. మరి పులుల సంతతి కి సంబంధించిన మంచి వార్త కూడా ఉంది.. నేటి ముఖ్యాంశాలు ఇదుగో ఇవీ..’’

 

 ‘‘బాందీపుర్ మరియు ముదుమలై టైగర్ రిజర్వు ల లో నా అవిస్మరణీయ యాత్ర ముగింపు సందర్భం లో, పులుల సంరక్షణ కోసం కఠోర శ్రమ చేస్తున్నటువంటి అటవీ అధికారులు, గార్డు లు, పులుల సంరక్షణ లో నిమగ్నం అయిన సిబ్బంది మరియు ఈ కార్యం లో జత పడ్డ ఇతరులు అందరి ని నేను అభినందిస్తున్నాను.  వారి లోని ఉద్వేగాన్ని, వారి యొక్క ప్రయాసల ను గురించి చెప్పాలి అంటే ఎన్ని మాటలు అయినా సరిపోవు.’’

 

***

DS/TS



(Release ID: 1915306) Visitor Counter : 206