ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ వరల్డ్ డెయరి సమిట్ 2022  ను సెప్టెంబర్ 12వ తేదీ న ప్రారంభించనున్న ప్రధాన మంత్రి 

Posted On: 10 SEP 2022 9:41PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇంటర్ నేశనల్ డెయరి ఫెడరేశన్ వరల్డ్ డెయరి సమిట్ (ఐడిఎఫ్ డబ్లుడిఎస్) 2022 ను 2022 సెప్టెంబర్ 12వ తేదీ న ఉదయం సుమారు పదిన్నర గంటల వేళ లో గ్రేటర్ నొయెడా లోని ఇండియా ఎక్స్ పో సెంటర్ ఎండ్ మార్ట్ లో ప్రారంభించనున్నారు.

నాలుగు రోజుల పాటు అంటే సెప్టెంబర్ 12వ తేదీ మొదలుకొని సెప్టెంబర్ 15వ తేదీ వరకు జరుగనున్న ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో ‘పోషణ మరియు బ్రతుకుతెరువు ల కోసం పాడి పరిశ్రమ’ అనే ఇతివృత్తం పై సమాలోచనలు చేయడం కోసం ప్రపంచ దేశాల లోని మరియు భారతదేశం లోని పాడి పరిశ్రమ తో సంబంధం కలిగివున్న పారిశ్రామికవేత్త లు, నిపుణులు, రైతు లు మరియు విధాన రూపకర్త లు సహా అన్ని పక్షాల వారు గుమికూడనున్నారు. ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో 50 దేశాల కు చెందిన సుమారు 1500 మంది పాలుపంచుకొంటారన్న సూచన లు ఉన్నాయి. కడపటి శిఖర సమ్మేళనాన్ని ఇంచుమించు అర్థ శతాబ్ది కిందట, 1974వ సంవత్సరం లో, నిర్వహించడమైంది.

భారతదేశం లో పాడి పరిశ్రమ కు ఒక రకమైనటువంటి విశిష్టత ఉంది. అది ఏమిటి అంటే, ఈ పరిశ్రమ ఒక సహకార నమూనా పై ఆధారపడింది. ఈ పరిశ్రమ చిన్న పాడి రైతుల కు, సన్నకారు, పాడి రైతుల కు, ప్రత్యేకించి మహిళల కు సాధికారిత ను కల్పిస్తున్నది. ప్రధాన మంత్రి దృష్టి కోణం నుండి ప్రేరణ ను పొంది, ప్రభుత్వం పాడి రంగానికి ప్రోత్సాహాన్ని ఇవ్వడం కోసం అనేక విధాలైన చర్యల ను తీసుకొంది. తత్ఫలితం గా గడచిన ఎనిమిది సంవత్సరాల లో పాల ఉత్పత్తి లో 44 శాతాని కి కన్నా ఎక్కువ వృద్ధి గా నమోదు అయింది. ప్రపంచ పాల పరిశ్రమ లో ఇంచుమించు 23 శాతాని కి సమానం అయినటువంటి వాటా ను కలిగివున్న భారతదేశ పాడి పరిశ్రమ యొక్క సాఫల్య గాథ ను ఐడిఎఫ్ డబ్లుడిఎస్ 2022 లో కళ్ళకు కట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం లో దాదాపు 210 మిలియన్ టన్నుల పాలు భారతదేశం లో ఉత్పత్తి అవుతున్నాయి. అంతేకాక దీని తో 8 కోట్ల పై చిలుకు పాడి రైతుల కు సాధికారిత ప్రాప్తిస్తున్నది. ప్రపంచం లోని అత్యుత్తమమైనటువంటి పద్ధతుల ను గురించి భారతదేశం పాడి రైతులు తెలుసుకోవడం లో ఈ శిఖర సమ్మేళనం సహాయకారి కాగలదు.

 

***

 


(Release ID: 1858676) Visitor Counter : 174