ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

భూకంపంతరువాతి కాలం లో కచ్ఛ్ అభివృద్ధి చెందడం గురించిన ఒక వీడియో ను శేర్ చేసిన ప్రధానమంత్రి

Posted On: 28 AUG 2022 1:26PM by PIB Hyderabad

భూకంపం సంభవించిన తరువాత గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతం లో జరిగిన అభివృద్ధి ని వివరించేటటువంటి ఒక వీడియో ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శేర్ చేశారు. ఈ ప్రాంతం ఇప్పుడు పరిశ్రమ లు, వ్యవసాయం, పర్యటన రంగం మొదలైనవి వికసిస్తున్నటువంటి ఒక సమృద్ధ కేంద్రం గా మారిపోయింది. ఈ వీడియో ను మోదీ స్టోరీ ట్విటర్ హాండిల్ ద్వారా ట్వీట్ చేయడం జరిగింది. ఈ వీడియో లో అక్కడి ప్రజలు అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేపట్టిన అసాధారణ కార్యాల ను గురించి మాట్లాడారు. భూకంపం అనంతర కాలం లో కచ్ఛ్ కు కొత్త రూపురేఖల ను ఇవ్వడం లో ఆ కాలపు గుజరాత్ ముఖ్యమంత్రి యొక్క నాయకత్వాన్ని ప్రజలు ప్రశంసించారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘2001వ సంవత్సరం లో వచ్చిన భూకంపం తరువాత, కొంత మంది కచ్ఛ్ కు జరిగిన నష్టాని కి పెదవి విరిచి కచ్ఛ్ కథ ఇక ముగిసినట్లే అని భావించారు. కచ్ఛ్ ఇక ఎన్నటికీ తల ఎత్తజాలదు అని వారు అనుకొన్నారు; కానీ ఈ సంశయవాదులు కచ్ఛ్ యొక్క భావన ను తక్కువ గా అంచనా వేశారు.

కొద్ది కాలం లోనే, కచ్ఛ్ తిరిగి తలెత్తుకొని నలబడింది, మరి అది అన్నింటి కంటే వేగం గా వృద్ధిచెందుతున్నటువంటి జిల్లాల లో ఒక జిల్లా గా మారిపోయింది.’’ అని పేర్కొన్నారు.

 
****
DS/ST

 


(Release ID: 1855074) Visitor Counter : 144