ప్రధాన మంత్రి కార్యాలయం
ఎన్ఇపి అమలు అంశం పై ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్ష సమాగమ్’ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
‘‘విద్య ను సంకుచిత ఆలోచన విధానం పరిధి లో నుంచి బయటకు తీసుకు వచ్చి, 21వ శతాబ్ది తాలూకు ఆధునిక భావాల తోదానిని జత పరచాలి అనేది ‘జాతీయ విద్య విధానం’ యొక్క మూలాధారం గా ఉంది’’
‘‘బ్రిటిషువారు ఏర్పరచిన విద్య వ్యవస్థ భారతదేశ సభ్యత లో ఎన్నడూ ఒక భాగం గాలేదు’’
‘‘మన యువతీ యువకులు నైపుణ్యం కలవారు గాను, ఆత్మవిశ్వాసం కలవారు గాను, ఆచరణాత్మక దృక్పథం కలవారు గాను ఉండాలి; ఇందుకోసం విద్య విధానం రంగాన్ని సిద్ధంచేస్తుంది’’
‘‘మహిళల కు తలుపుల ను మూసివేసినటువంటి రంగాలు ప్రస్తుతం వారి యొక్క ప్రతిభ నుచాటి చెబుతున్నాయి’’
‘‘ ‘జాతీయ విద్య విధానం’ మనకు అంతులేని అవకాశాల నువినియోగించుకొనేందుకు ఒక సాధనాన్ని అందించింది’’
Posted On:
07 JUL 2022 4:11PM by PIB Hyderabad
‘జాతీయ విద్య విధానం’ యొక్క అమలు పై ఈ రోజు న వారాణసీ లో ఏర్పాటైన ‘అఖిల భారతీయ శిక్ష సమాగమ్’ కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో పాలుపంచుకొన్న వారి లో ఉత్తర్ ప్రదేశ్ గవర్నర్ శ్రీమతి ఆనందీబెన్ పటేల్, ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రులు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్, శ్రీమతి అన్నపూర్ణ దేవి, డాక్టర్ శ్రీ సుభాష్ సర్ కార్, డాక్టర్ రాజ్ కుమార్ రంజన్ సింహ్, రాష్ట్ర మంత్రులు, విద్య రంగ ప్రముఖులు మరియు ఇతర సంబంధిత వర్గాల వారు ఉన్నారు.
సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ‘అమృత కాలం’ తాలూకు ప్రతిజ్ఞల ను నెరవేర్చడం లో ఒక ప్రధానమైన పాత్ర ను మన విద్య వ్యవస్థ మరియు యువతరం పోషిస్తాయి అన్నారు. మహామన మదన్ మోహన్ మాలవీయ గారి కి ప్రధాన మంత్రి వందనాన్ని అర్పించి, సమాగమ్ సత్ఫలితాలు సాధించాలంటూ తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు. అంతక్రితం ప్రధాన మంత్రి ఎల్ టి కాలేజీ లో అక్షయ పాత్ర మధ్యాహ్న భోజన వంట ఇంటి ని ప్రారంభించారు. తాను మాట్లాడిన విద్యార్థుల యొక్క ప్రతిభ తాలూకు ఉన్నత స్థాయి అనేది ఆ యొక్క ప్రతిభ ను సద్వినియోగ పరచుకోవడానికి కావలసిన ప్రయాస కు ఒక సూచిక గా ఉందని ఆయన అన్నారు.
‘‘ ‘జాతీయ విద్య విధానం’ యొక్క మూలాధారం విద్య ను సంకుచితమైన ఆలోచన ల సరళి నుంచి బయటికి తీసుకు రావడమూ, మరి దాని ని 21 శతాబ్ది తాలూకు ఆధునిక భావాల తో జతపరచడమూను’’ అని ప్రధాన మంత్రి అన్నారు. దేశం లో వివేకాని కి, ప్రతిభ కు ఎన్నడూ కొదువ లేదు, ఏమైనప్పటికీ బ్రిటిషు వారు ఏర్పరచిన విద్య విధానం భారతదేశ సభ్యత లో ఎన్నడూ ఒక భాగం కాలేకపోయింది అని ప్రధాన మంత్రి అన్నారు. విద్య పరం గా భారతదేశ సభ్యత యొక్క బహుళ పార్శ్వికత్వాన్ని గురించి ఆయన నొక్కి చెప్తూ, మరి ఆ యొక్క కోణం ఆధునిక భారతదేశం విద్య వ్యవస్థ తాలూకు ముద్ర కావాలి అని పేర్కొన్నారు. ‘‘మనం పట్టభద్రులైన యువతీ యువకుల ను తయారు చేయడం ఒక్కటే కాకుండా, దేశం ముందంజ వేయడానికి అవసరమైన మానవ వనరుల ను మన విద్య వ్యవస్థ అందించేటట్లు గా చూడవలసి ఉంది. ఈ సంకల్పాన్ని మన గురువులు మరియు విద్య సంస్థ లు ముందుకు తీసుకు పోవాలి’’ అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించాలి అంటే గనక ఒక కొత్త వ్యవస్థ మరియు ఆధునిక ప్రక్రియ లు కీలకం అవుతాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ఇదివరకు ఆలోచన కు అయినా అందనిది ప్రస్తుతం వాస్తవం గా నిలచింది అని ఆయన అన్నారు. ‘‘మనం కరోనా వంటి పెద్ద మహమ్మారి బారి నుంచి ఎంతో వేగం గా బయట పడడం ఒక్కటే కాకుండా, ఈ రోజు న ప్రపంచం లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్నటువంటి పెద్ద ఆర్థిక వ్యవస్థ లో ఒకటి గా కూడా భారతదేశం ఉంది. ప్రస్తుతం మనం ప్రపంచం లో మూడో పెద్ద స్టార్ట్-అప్ ఇకోసిస్టమ్ గా ఉన్నాం’’ అని ప్రధాన మంత్రి వివరించారు.
అంతరిక్ష రంగ సంబంధిత సాంకేతిక విజ్ఞానం వంటి రంగాల లో ప్రతి పని ని ఇదివరకు ప్రభుత్వం ఒక్కటే చేస్తూ రాగా ప్రస్తుతం ప్రైవేటు పాత్రధారుల ద్వారా యువత కు ఒక కొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించడం జరుగుతున్నది అని ప్రధాన మంత్రి అన్నారు. మహిళల కు ఇంతవరకు అనుమతి లేనటువంటి రంగాలు ప్రస్తుతం వారి యొక్క ప్రతిభ ను చాటి చెప్తున్నాయి అని ఆయన అన్నారు.
కొత్త విధానం లో, బాలల ను వారి ప్రతిభా వ్యుత్పత్తులకు మరియు వారి ఎంపికల కు అనుగుణం గా ప్రవీణులు గా తీర్చిదిద్దడం పైనే యావత్తు దృష్టి ని కేంద్రీకరించడమైంది అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటించారు. ‘‘మన యువత నైపుణ్యవంతులుగా, ఆత్మవిశ్వాసం తో కూడుకొన్న వారుగా, ఆచరణీయత కలవారుగా, ఇంకా ఆలోచించి ఎత్తు వేసే వారు గా కూడా ఉండాలి అని ఆయన అన్నారు. మరి దీని కోసం విద్య విధానం తగ్గ రంగాన్ని సిద్ధం చేస్తున్నది’’ అని ఆయన అన్నారు. ఒక సరికొత్త ఆలోచన ప్రక్రియ ద్వారా భవిష్యత్తు కోసం కృషి చేయవలసిన అవసరం ఉంది అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రస్తుతం బాలలు చాలా అధునాతనమైనటువంటి ప్రతిభ స్థాయి ని చాటుతున్నారు. మరి వారి కి అండ గా మనం నిలచి, వారి ప్రతిభ ను వినియోగించుకోవలసిన అవసరం ఉంది అని ఆయన అన్నారు.
‘జాతీయ విద్య విధానం’ (ఎన్ఇపి) రూపకల్పన లో జరిగిన కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఏమైనా, విధానం రూపకల్పన అనంతరం జోరు ను తగ్గించ కూడదు అని ఆయన నొక్కిచెప్పారు. విధానాన్ని అమలు చేయాలి అనే అంశం పైన నిరంతరం చర్చ మరియు శ్రమ లు చోటు చేసుకొన్నాయి అని ఆయన అన్నారు. ఈ విధానం అమలు ను గురించి చర్చించడానికి ఏర్పాటైన కార్యక్రమాల లోను, చర్చ సభల లోను ప్రధాన మంత్రి స్వయం గా పాలుపంచుకొన్నారు. ఇది దేశ యువత దేశ వృద్ధి లో ఒక క్రీయాశీల భాగస్వామి గా మారే స్థితి కి దారి తీసింది.
దేశం లో విద్య రంగ సంబంధిత మౌలిక సదుపాయాల కల్పన లో భారీ స్థాయి లో మార్పులు చేర్పులు చేయడం జరిగింది అని ప్రధాన మంత్రి వివరించారు. దేశం లో అనేక కొత్త కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి లు మరియు ఐఐఎమ్ లు ప్రారంభం అవుతున్నాయి. 2014వ సంవత్సరం తరువాతి కాలం లో, వైద్య కళాశాల ల సంఖ్య లో 55 శాతం వృద్ధి నమోదైంది అని ఆయన తెలిపారు. విశ్వవిద్యాలయాల కోసం పెట్టిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనేది విశ్వవిద్యాలయాల ప్రవేశాల కు సౌలభ్యాన్ని మరియు సమానత్వాన్ని కొని తెస్తుంది అని ఆయన అన్నారు. ‘‘జాతీయ విద్య విధానం ప్రస్తుతం మాతృభాష లో విద్యార్జన కు బాట ను పరుస్తోంది. ఈ క్రమం లో, సంస్కృతం వంటి ప్రాచీన భారతీయ భాషల ను కూడా ముందుకు తీసుకు పోవడం జరుగుతోంది’’ అని ఆయన అన్నారు.
ప్రపంచ విద్య కు ఒక ప్రధాన కేంద్రం గా భారతదేశం రూపొందగలుగుతుందన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వెలిబుచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం భారతదేశం లో ఉన్నత విద్య ను తీర్చిదిద్దవలసిందంటూ మార్గదర్శకాల ను ఇవ్వడం జరిగింది అని ఆయన అన్నారు. సంస్థ ల అంతర్జాతీయ వ్యవహారాల కోసమని 180 విశ్వవిద్యాలయాల లో ప్రత్యేక కార్యాలయాల ను ఏర్పాటు చేయడమైంది అని ఆయన తెలిపారు. విద్య రంగం లో చోటు చేసుకొంటున్నటువంటి అంతర్జాతీయ ధోరణుల ను గురించి అవగాహన ను ఏర్పరచుకోవలసింది గా నిపుణుల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
ఆచరాణత్మక అనుభవం మరియు క్షేత్ర సంబంధిత కృషి ల యొక్క ప్రాధాన్యాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కిచెప్తూ, ‘ప్రయోగశాల నుంచి క్షేత్రానికి’ అనే వైఖరి ని అలవరచుకోవాలని కోరారు. విద్యవేత్తలు వారి యొక్క అనుభవాన్ని తగిన పరీక్షల గీటురాయిపైన గీచి చూసుకోవాలని ఆయన అన్నారు. రుజువుల పై ఆధారపడి ఉండే పరిశోధనల ను సాగించాలి అని ఆయన అన్నారు. భారతదేశాని కి జనాభా పరం గా ఉన్న అనుకూలత అనే అంశం పై పరిశోధన చేయాలని, ఈ అంశాన్ని అత్యుత్తమమైన స్థాయి లో ఉపయోగించుకొనేందుకు మార్గాల ను వెదకాలని, అలాగే ప్రపంచం లో వృద్ధులు ఎక్కువగా ఉన్నటువంటి సమాజాల కు పరిష్కార మార్గాల ను అన్వేషించాలని ప్రధాన మంత్రి కోరారు. ఇదే మాదిరి గా ఆటు పోటుల కు తట్టుకొని నిలబడేటటువంటి మౌలిక సదుపాయాల కల్పన అనేది పరిశోధన కు అర్హమైన మరొక రంగం అని కూడా ఆయన అన్నారు. మనకు ఇదివరకు అందుబాటులో లేనటువంటి ఎన్నో అవకాశాల ను అందుకొనేటందుకు ఒక సాధనాన్ని ‘జాతీయ విద్య విధానం’ ఇచ్చింది. దీనిని మనం సంపూర్ణం గా వాడుకోవలసిన అవసరం ఉంది’’ అని చెప్తూ, ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
అఖిల భారతీయ శిక్ష సమాగమ్
‘శిక్ష సమాగమ్’ ను జులై 7వ తేదీ మొదలుకొని 9వ తేదీ వరకు విద్య మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నది. ఈ కార్యక్రమం ‘జాతీయ విద్య విధానం’ (ఎన్ఇపి) 2020 ని ప్రభావవంతమైన విధం గా అమలు లోకి తీసుకు రావడం కోసం ఒక మార్గసూచీ ని సిద్ధం చేయడం కోసం ప్రముఖ విద్యవేత్త లు, విధాన రూపకర్త లు మరియు విద్య రంగ ప్రముఖుల కు చర్చోపచర్చలు జరిపి వారి అనుభవాల ను పరస్పరం వెల్లడి చేసుకొనేందుకు, సమాలోచనలు జరిపేందుకు ఒక వేదిక ను అందిస్తుంది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తం గా కేంద్రీయ, రాష్ట్ర స్థాయి, డీమ్డ్ మరియు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల కు చెందిన మరియు జాతీయ ప్రాముఖ్యం కలిగినటువంటి సంస్థలైన ఐఐటి, ఐఐఎమ్, ఎన్ఐటి, ఐఐఎస్ఇఆర్ లకు చెందిన 300 కు పైచిలుకు విద్య సంబంధమైన సిబ్బంది కి, పాలన సంబంధమైనసిబ్బంది కి, సంస్థల లోని సిబ్బంది కి వారి సామర్థ్యానికి మెరుగులను దిద్దడం కోసం నిర్వహించడం జరుగుతున్నది. సంబంధిత వివిధ వర్గాల వారు వారి వారి సంస్థల లో ఎన్ఇపి అమలు తాలూకు పురోగతి ఎలా ఉన్నదీ తెలియజేయడం తో పాటు గమనించదగినటువంటి అమలు సంబంధిత వ్యూహాల ను, ఉత్తమమైన అభ్యాసాల ను మరియు సాఫల్య గాథల ను కూడా ఈ సందర్భం లో వెల్లడి చేయనున్నారు.
మూడు రోజుల పాటు కొనసాగే ‘శిక్ష సమాగమ్’ లో, ఎన్ఇపి 2020 లో భాగం గా ఉన్నత విద్య కోసం గుర్తించినటువంటి తొమ్మిది ఇతివృత్తాల పై బృంద చర్చలు జరుగుతాయి. ఆ ఇతివృత్తాల లో బహుళ విధ విభాగాల విద్య మరియు సమగ్ర విద్య; నైపుణ్యాల అభివృద్ధి, ఇంకా ఉద్యోగార్హత; పరిశోధన, నూతన ఆవిష్కరణ మరియు నవ పారిశ్రామికత్వం; నాణ్యమైన విద్య బోధన కోసం ఉపాధ్యాయుల లో సామర్థ్య నిర్మాణం; క్వాలిటీ, ర్యాంకింగ్ ఎండ్ అక్రిడిటేశన్; డిజిటల్ ఎంపవర్ మెంట్ ఎండ్ ఆన్ లైన్ ఎడ్యుకేశన్; సమానమైన అవకాశాల తో కూడినటువంటి మరియు అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి విద్య; ఇండియన్ నాలిజ్ సిస్టమ్, ఇంకా ఉన్నత విద్య యొక్క అంతర్జాతీయీకరణ ఉన్నాయి.
***
DS/AK
(Release ID: 1839965)
Visitor Counter : 242
Read this release in:
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam