ప్రధాన మంత్రి కార్యాలయం
లఖ్ నవూ లో జరిగిన ‘యుపి ఇన్ వెస్టర్స్ సమిట్’ గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని @3.0 కు హాజరైన ప్రధాన మంత్రి
80,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 1406 ప్రాజెక్టుల కు ఆయన శంకుస్థాపన చేశారు
‘‘ప్రపంచం ప్రస్తుతం వెదకుతున్న ఒక విశ్వసనీయ భాగస్వామి తాలూకు అన్ని అంచనాలను అందుకొనే శక్తి ఒక్క మన ప్రజాస్వామ్య భారతదేశానికే ఉంది’’
‘‘గత 8 సంవత్సరాల లో మేం విధాన పరమైన స్థిరత్వానికి, సహకారానికి మరియు వ్యాపార నిర్వహణ లో సౌలభ్యానికి ప్రాధాన్యాన్ని కట్టబెట్టాం’’
‘‘ఉత్తర్ ప్రదేశ్ యొక్క శీఘ్ర అభివృద్ధి కోసం మా డబల్ ఇంజిన్ ప్రభుత్వం మౌలికసదుపాయాలు, పెట్టుబడి మరియు తయారీ.. ఈ అంశాల లో కలసికట్టు గా కృషిచేస్తోంది’’
‘‘రాష్ట్రాని కి చెందిన ఒక ఎంపి గా, నేను పాలన యంత్రాంగం యొక్క దక్షత ను మరియుసామర్ధ్యాన్ని గమనించాను; అంతేకాకుండా, దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం పై పెట్టుకొన్నఅంచనాల ను కూడా నేను గమనించాను’’
‘‘విధానం, నిర్ణయాలు మరియు ఉద్దేశ్యం ల పరంగా చూసినప్పుడు మేం అభివృద్ధి పక్షాన నిలబడ్డాం’’
Posted On:
03 JUN 2022 1:39PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న లఖ్ నవూ లో జరిగిన ‘యుపి ఇన్ వెస్టర్స్ సమిట్’ గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని @3.0 కి హాజరు అయ్యారు. మంత్రి 80,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన 1406 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు లు.. వ్యవసాయం మరియు వ్యవసాయ సంబంధి రంగాలు, ఐటి, ఇంకా ఎలక్ట్రానిక్స్, ఎమ్ఎస్ఎమ్ఇ లు, తయారీ, నవీకరణ యోగ్య శక్తి, ఔషధ నిర్మాణం, పర్యటన, రక్షణ మరియు ఏరోస్పేస్, చేనేత, ఇంకా వస్త్రాల వంటి వివిధ రంగాల కు చెందినవి. దేశ పారిశ్రామిక రంగం లో అగ్రగాములు ఈ కార్యక్రమాని కి హాజరు అయ్యారు. ఈ సందర్భం లో పాలుపంచుకొన్నవారి లో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్, కేంద్ర మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఉత్తర్ ప్రదేశ్ యొక్క సామర్ధ్యం, సమర్పణ భావం, కఠోర శ్రమ మరియు ఆ రాష్ట్ర యువత లోని అవగాహన ల పట్ల ఇన్ వెస్టర్ లు వారి నమ్మకాన్ని చాటినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కాశీ ని సందర్శించవలసింది గా పారిశ్రామికవేత్తల ను ఆయన కోరారు. ‘‘కాశీ యొక్క ప్రతినిధి గా నేను మిమ్మల్ని కోరేది ఏమిటి అంటే అది నా కాశీ ని మీరు సందర్శించాలి అనేదే. కాశీ తన పురాతన సామర్థ్యం తో పాటు గా ఒక కొత్త రంగు రూపు ల తో శోభిల్ల గలుగుతుంది అనేటటువంటి వాస్తవం ఉత్తర్ ప్రదేశ్ యొక్క సామర్ధ్యాల కు ఒక సజీవ సాక్ష్యం గా నిలుస్తోంది’’ అని ఆయన అన్నారు.
ఈ రోజు న మొదలుపెట్టిన ప్రతిపాదన లు ఉత్తర్ ప్రదేశ్ లో సరికొత్త అవకాశాల ను సృష్టిస్తాయి. అంతేకాకుండా, ఉత్తర్ ప్రదేశ్ యొక్క వృద్ధి గాథ పట్ల పెరుగుతూ ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా ఇవి ప్రతిబింబిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ప్రపంచం ఈ రోజు న వెదకుతున్నటువంటి ఒక విశ్వసనీయమైన భాగస్వామి తాలూకు అన్ని అంచనాల కు తుల తూగ గలిగే శక్తి ఒక్క మన ప్రజాస్వామ్య యుక్తమైన భారతదేశానికే ఉంది. ప్రస్తుతం ప్రపంచం భారతదేశం యొక్క శక్తియుక్తుల కేసి చూస్తోంది; అంతేకాక, ప్రపంచం భారతదేశం యొక్క పనితీరు ను ప్రశంసిస్తున్నది’’ అని ఆయన అన్నారు. జి20 ఆర్థిక వ్యవస్థల లో అత్యంత వేగం గా వృద్ధి చెందుతున్న దేశం గా భారతదేశం ఉంది అని ప్రధాన మంత్రి తెలియజేస్తూ, భారతదేశం గ్లోబల్ రిటైల్ ఇండెక్స్ లో రెండో స్థానం లో నిలచింది అని వెల్లడించారు. ప్రపంచం లో అతి పెద్ద శక్తి వినియోగదారు దేశం భారతదేశమే. కిందటి సంవత్సరం లో ప్రపంచం లో 100 కు పైగా దేశాల నుంచి 84 బిలియన్ డాలర్ మేర రికార్డు స్థాయి లో ఎఫ్ డిఐ ఇక్కడకు వచ్చింది. భారతదేశం 417 బిలియన్ డాలర్ కు పైగా విలువ కలిగిన, అంటే 30 లక్షల కోట్ల రూపాయల విలువైన వస్తువుల ను గత ఆర్థిక సంవత్సరం లో ఎగుమతి చేయడం ద్వారా ఒక కొత్త రికార్డు ను సృష్టించింది అని ఆయన వివరించారు.
కేంద్రం లో ఎన్ డిఎ ప్రభుత్వం 8 సంవత్సరాలు పూర్తి చేసుకోవడాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావించి, ‘‘గత కొన్నేళ్ళుగా మనం రిఫార్మ్ (సంస్కరించడం), పర్ ఫార్మ్ (పనితీరు ను కనబరచడం), ట్రాన్స్ ఫార్మ్ (పరివర్తన ను తీసుకురావ డం) అనే మంత్రం తో ముందుకు సాగాం. విధాన పరమైనటువంటి స్థిరత్వం, సహకారాని కి ప్రాధాన్యం, వ్యాపార నిర్వహణ లో సౌలభ్యాని కి పెద్దపీట ను వేస్తున్నాం’’ అని ఆయన అన్నారు. యావత్తు దేశాన్ని ఒకే దేశం గా ఏకం చేస్తున్న సంస్కరణల ను గురించి ఆయన సోదాహరణం గా వివరిస్తూ, మేం మా యొక్క సంస్కరణల తో భారతదేశాన్ని ఒకే దేశం గా బలపరచడం కోసం పాటుపడ్డాం. వన్ నేశన్ - వన్ టాక్స్ జిఎస్ టి, వన్ నేశన్ - వన్ గ్రిడ్, వన్ నేశన్ - వన్ మొబిలిటీ కార్డు, వన్ నేశన్ - వన్ రేషన్ కార్డు.. ఈ ప్రయాస లు అన్నీ మా యొక్క పటిష్టమైనటువంటి విధానాల కు మరియు స్పష్టమైనటువంటి విధానాల కు అద్దం పడుతున్నాయి’’ అని ఆయన అన్నారు.
ఉత్తర్ ప్రదేశ్ లో 2017వ సంవత్సరం అనంతరం వేసిన ముందడుగుల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ‘‘వేగవంతమైనటువంటి వృద్ధి కోసమని మా యొక్క డబల్ ఇంజిన్ ప్రభుత్వం మౌలిక సదుపాయాలు, పెట్టుబడి మరియు తయారీ.. ఈ అంశాల పై కలసికట్టు గా కృషి చేస్తోంది. ఈ సంవత్సరం బడ్జెటు లో ఇదివరకు ఎన్నడు ఎరుగని స్థాయి లో 7.50 లక్షల కోట్ల మూలధన వ్యయం కేటాయింపు అనేది ఈ దిశ లో వేసినటువంటి ఒక అడుగు గా ఉంది’’ అని ఆయన చెప్పారు. చట్టం మరియు వ్యవస్థ పరిరక్షణ స్థితి లో మెరుగుదల వ్యాపార సముదాయం లో విశ్వాసాన్ని తిరిగి తీసుకువచ్చింది, పరిశ్రమ కు ఒక సరి అయినటువంటి వాతావరణాన్ని ఏర్పరచింది. అంతేకాకుండా, రాష్ట్రం లో పాలన సంబంధి వ్యవస్థల ను కూడా మెరుగు పరిచింది అని ఆయన వివరించారు. రాష్ట్రాని కి చెందిన ఒక పార్లమెంటు సభ్యుని గా తాను పాలన యంత్రాంగం యొక్క, రాష్ట్ర ప్రభుత్వం యొక్క శక్తియుక్తుల ను, సామర్థ్యాన్ని, దేశం ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆశిస్తున్న అంశాల ను గమనించ గలిగినట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర పాలన యంత్రాంగం యొక్క మనస్థితి , పని సంస్కృతి మారడాన్ని ఆయన అభినందించారు. దేశం లో అయిదో వంతు లేదా ఆరో వంతు జనాభా ఉత్తర్ ప్రదేశ్ లో నివసిస్తున్న కారణం గా దేశం యొక్క అభివృద్ధి లో ఆ రాష్ట్ర ప్రభావం గణనీయం గా ఉంటుంది అని ఆయన అన్నారు. ఉత్తర్ ప్రదేశ్ యొక్క స్వతస్సిద్ధ బలాల ను గురించి ఆయన వివరిస్తూ, ఈ రాష్ట్రం అభివృద్ధి పథం లో ముందుకు సాగిపోకుండా ఏ శక్తీ అడ్డుకోజాలదు అని అన్నారు. తాజా బడ్జెటు లో గంగ నది ఇరు తీరాల వెంబడి 5 కి.మీ. మేర రసాయనిక పదార్థాల కు తావు ఉండని అటువంటి ప్రాకృతిక వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు సంబంధి ప్రకటన చోటు చేసుకొంది అని ఆయన ప్రస్తావించారు. ఉత్తర్ ప్రదేశ్ లో గంగ నది 1100 కి.మీ. కు పైగా పొడవు న 25- 30 జిల్లాల గుండా పారుతున్నది. ఇది ప్రాకృతిక వ్యవసాయాని కి గొప్ప అవకాశాల ను ప్రసాదిస్తుంది అని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగం లో పెట్టుబడి పెట్టడం కోసం కార్పొరేట్ వరల్డ్ కు ప్రస్తుతం ఒక సువర్ణావకాశం లభించిందని ఆయన అన్నారు. పిఎల్ఐ పథకాలు మరియు 7.5 లక్షల కోట్ల రూపాయల నిధుల ను మూలధన వ్యయాని కి కేటాయించడం అనే చర్య లు కూడా రాష్ట్రాని కి లబ్ధి ని చేకూర్చుతాయి అని ఆయన తెలిపారు. రాష్ట్రం లో డిఫెన్స్ కారిడర్ కొత్త కొత్త అవకాశాల ను అందిస్తుంది అని కూడా ఆయన తెలియ జేశారు. ఆధునిక పవర్ గ్రిడ్, గ్యాస్ సరఫరా కు ఉద్దేశించిన గొట్టపు మార్గం, మల్టీమాడల్ కనెక్టివిటీ, రికార్డు సంఖ్య లో ఎక్స్ ప్రెస్ వేస్, ఆర్థిక మండలాల కు సంధానాన్ని పటిష్ట పరచడం, ఆధునిక రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాల కల్పన, ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడర్, మరి అలాగే వెస్టర్న్ కారిడర్.. ఇవన్నీఉత్తర్ ప్రదేశ్ లో ఏర్పడి ఆ రాష్ట్రం అభివృద్ధి కి ఒక కొత్త జోరు ను అందించేందుకు వాగ్దానం చేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
గత కొన్ని సంవత్సరాల లో దేశం లో ప్రాజెక్టుల ను అనుకున్న కాలాని కి సాకారం చేసే సంస్కృతి చోటు చేసుకొంది అని ప్రధాన మంత్రి చెప్పారు. డిజిటల్ క్రాంతి ని ఈ ధోరణి కి ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొంటూ, ఇటీవలి కొన్నేళ్ళ లో దేశం యొక్క వృద్ధి గాథ ను గురించి పునరుద్ఘాటించారు. 2014వ సంవత్సరం లో మన దేశం లో 65 మిలియన్ బ్రాడ్ బ్యాండ్ చందాదారులు మాత్రమే ఉండే వారు అని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ వినియోగదారుల సంఖ్య 78 కోట్ల కు మించింది. 2014వ సంవత్సరం లో ఒక జిబి డాటా ఖరీదు దాదాపు గా 200 రూపాయలు గా ఉండింది. ప్రస్తుతం దీని ధర 11- 12 రూపాయల కు దిగి వచ్చింది. ప్రపంచం లో డాటా ఇంత చౌక గా ఉన్న దేశాల లో భారతదేశం ఒక దేశం గా ఉంది. 2014వ సంవత్సరం లో దేశం లో ఆప్టికల్ ఫైబర్ తో జతపడ్డ గ్రామ పంచాయతీ లు 100 కు లోపు మాత్రమే ఉండగా, ప్రస్తుతం ఇటువంటి గ్రామ పంచాయతీ ల సంఖ్య సైతం రెండున్నర లక్షల కు మించింది. 2014వ సంవత్సరాని కి పూర్వం మన దేశం లో కేవలం ఒక వంద స్టార్ట్-అప్స్ ఏర్పాటు అయ్యాయి. అయితే ఈ రోజు న దేశం లో నమోదు అయిన స్టార్ట్-అప్స్ సంఖ్య ఇంచుమించు 70 వేల కు చేరువ లో ఉంది. ఇటీవల భారతదేశం సైతం 100 యూనికార్న్ స్ రికార్డు ను నెలకొల్పింది. ‘‘మేం విధానం పరం గా అభివృద్ధి పక్షాన నిలచాం, నిర్ణయాల పరం గా అభివృద్ధి పక్షాన నిలచాం మరియు ఉద్దేశ్యం పరం గా అభివృద్ధి పక్షాన నిలచాం. మేమంతా మీ యొక్క ప్రయాసల లో మీ వెంట ఉంటాం, అడుగు అడుగు న మీ వెన్నంటి నిలబడతాం’’ అని పారిశ్రామికవేత్తల కు, ఇన్ వెస్టర్ లకు ప్రధాన మంత్రి హామీ ని ఇచ్చారు.
యుపి ఇన్ వెస్టర్స్ సమిట్ 2018 ని 2018వ సంవత్సరం లో ఫిబ్రవరి 21వ, 22వ తేదీ లలో నిర్వహించారు. కాగా, ఒకటో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని ని 2018 జూలై 29 న, మరి అదే విధం గా రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని ని 2019వ సంవత్సరం లో జులై 29వ తేదీన జరపడమైంది. ఒకటో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని ని లో భాగంగా 61,500 కోట్ల రూపాయల కు పైగా విలువైన 81 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడం జరిగింది. కాగా, రెండో గ్రౌండ్ బ్రేకింగ్ సెరిమని ని లో 67,000 కోట్ల రూపాయల కు పైగా పెట్టుబడుల తో కూడినటువంటి 290 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడమైంది.
DS
(Release ID: 1830825)
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada