ప్రధాన మంత్రి కార్యాలయం
ఉజ్వల సబ్సిడీ పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం కుటుంబ బడ్జెట్లను చాలా సులభతరం చేస్తుంది: ప్రధానమంత్రి
పెట్రోల్, డీజిల్ ధరలలో గణనీయమైన తగ్గుదల వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతుంది, మన పౌరులకు ఉపశమనం కలిగిస్తుంది: ప్రధానమంత్రి
Posted On:
21 MAY 2022 8:16PM by PIB Hyderabad
ఉజ్వల సబ్సిడీతో పాటు, పెట్రోల్, డీజిల్ ధరల తగ్గుదల పై ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూల ప్రభావం చూపుతాయని, మన పౌరులకు 'ఈజ్ ఆఫ్ లివింగ్' తో పాటు ఉపశమనం కలిగిస్తాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
ఈ నిర్ణయాలకు సంబంధించి ఆర్థిక మంత్రి చేసిన ట్వీట్ లపై ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం ద్వారా స్పందిస్తూ, "మాకు ఎల్లప్పుడూ ప్రజలే మొదటి ప్రాధాన్యత! ఈ రోజు తీసుకున్న నిర్ణయాలు, ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ ధరల్లో గణనీయమైన తగ్గుదలకి సంబంధించిన నిర్ణయాలు వివిధ రంగాలపై సానుకూలంగా ప్రభావం చూపుతాయి, మన పౌరులకు మరింత ‘ఈజ్ ఆఫ్ లివింగ్’ ను అందించడంతో పాటు, ఉపశమనం కలిగిస్తాయి. ఉజ్జ్వల యోజన కోట్లాది మంది భారతీయులకు, ముఖ్యంగా మహిళలకు సహాయం చేసింది. ఉజ్వల సబ్సిడీ పై ఈ రోజు తీసుకున్న నిర్ణయం కుటుంబ బడ్జెట్లను చాలా సులభతరం చేస్తుంది." అని ట్వీట్ చేశారు.
(Release ID: 1827367)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam