ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం
azadi ka amrit mahotsav

హిందుస్తాన్ఉర్వరక్ ఎండ్ రసాయన్ లిమిటెడ్ యొక్క మూడు యూనిట్ లకు న్యూ ఇన్ వెస్ట్ మంట్ పాలిసి-2012వర్తింపు ను పొడిగించేటందుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి 

Posted On: 22 MAR 2022 2:42PM by PIB Hyderabad

హిందుస్తాన్ ఉర్వరక్ ఎండ్ రసాయన్ లిమిటెడ్ (హెచ్ యుఆర్ఎల్) కు గోరఖ్ పుర్, సింద్ రీ మరియు బరౌని ల లో ఉన్నటువంటి మూడు యూనిట్ లకు న్యూ ఇన్ వెస్ట్ మంట్ పాలసి (ఎన్ఐపి) )-2012 యొక్క వర్తింపు ను పొడిగించడానికి గాను ఎరువుల విభాగం తీసుకు వచ్చిన ప్రతిపాదన కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న ఈ రోజు న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సిసిఇఎ) ఆమోదాన్ని తెలిపింది.

హెచ్ యుఆర్ఎల్ ను 2016వ సంవత్సరం లో జూన్ 15వ తేదీ నాడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కోల్ ఇండియా లిమిటెడ్ (సిఐఎల్), ఎన్ టిపిసి లిమిటెడ్ (ఎన్ టిపిసి) మరియు ఇండియన్ ఆయిల్ కార్ పొరేశన్ (ఐఒసిఎల్) లు నెలకొల్పిన జాయింట్ వెంచర్ కంపెనీ గా ఉంది. హెచ్ యుఆర్ఎల్ ప్రతి ఏడాది లో 12.7 లక్షల మెట్రిక్ టన్నుల స్థాపిత సామర్థ్యం కలిగిన గ్యాస్ ఆధారితమైన యూరియా ప్లాంటుల ను నెలకొల్పడం ద్వారా ఎఫ్ సిఐఎల్ కు చెందిన గోరఖ్ పుర్ మరియు సింద్ రీ యూనిట్ లను, జిఎఫ్ సిఎల్ కు చెందిన బరౌనీ యూనిట్ ను పునరుద్ధరిస్తున్నది. ఈ మూడు హెచ్ యుఆర్ఎల్ యూరియా ప్రాజెక్టుల వ్యయం 25.120 కోట్ల రూపాయలు. హెచ్ యుఆర్ఎల్ యొక్క ఈ మూడు యూనిట్ లకు సహజ వాయువు ను జిఎఐఎల్ సరఫరా చేస్తున్నది.

యూరియా రంగం లో స్వయం సమృద్ధి ని సాధించడం కోసం మూసివేత బారిన పడ్డ ఎస్ సిఐఎల్/ హెచ్ఎఫ్ సిఎల్ ల తాలూకు యూరియా యూనిట్ లను పునరుద్ధరించడానికి ప్రభుత్వం తీసుకొన్న కార్యక్రమం లో హెచ్ యుఆర్ఎల్ తాలూకు ఈ అత్యంత ఆధునిక ప్లాంటు లు ఒక భాగంగా ఉన్నాయి. ఈ మూడు యూనిట్ లు పని చేయడం మొదలు పెట్టాయంటే దేశం లో 38.1 ఎల్ఎమ్ టిపిఎ మేర కు స్వదేశీ యూరియా ఉత్పాదన పెరిగిపోవడమే కాకుండా యూరియా ఉత్పాదన లో భారతదేశం ‘ఆత్మనిర్భరత’ ను సంతరించుకోవాలన్న ప్రధాన మంత్రి ఆలోచన కూడా సాకారం కావడం లో కూడాను తోడ్పాటు అందగలదు.

ఈ ప్రాజెక్టు తో రైతుల కు ఎరువు లభ్యత మెరుగుపడడం ఒక్కటే కాకుండా, దేశం లో ప్రజల కు ఆహార భద్రత కు పూచీ పడడానికి తోడు గా రహదారులు, రైలు మార్గాలు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు మొదలైన మౌలిక సదుపాయాల సంబంధి అభివృద్ధి కూడా చోటు చేసుకోవడం వల్ల ఆ ప్రాంతం లో ఆర్థిక వ్యవస్థ కు దన్ను లభిస్తుంది.

హెచ్ యుఆర్ఎల్ యొక్క మూడు యూనిట్ లలో విభిన్నమైనటువంటి అరుదైన విశిష్టతలు ఉన్నాయి, వాటి లో డిసిఎస్ (డిస్ట్రిబ్యూటెడ్ కంట్రోల్ సిస్టమ్), ఇఎస్ డి (ఇమర్జెన్సి శట్ డౌన్ సిస్టమ్) ల తో కూడివుండేటటువంటి ఉత్కృష్ట విస్ఫోట నిరోధం నియంత్రణ విభాగం మరియు పర్యావరణ నిఘా ప్రణాళిక లు జతయ్యాయి. ఈ ప్లాంటుల లోపలి నుంచి వ్యర్థ జలాల ను బయట మరో చోటు కు పారించడం జరుగదు. అత్యంత ప్రేరణదాయకమైనటువంటి, సమర్పణ భావం కలిగినటువంటి, మంచి శిక్షణ ను పొందినటువంటి ఆపరేటర్ లు ఈ వ్యవస్థల ను నడుపుతారు. హెచ్ యుఆర్ఎల్-గోరఖ్ పుర్ యూనిట్ లో భారతదేశం లోని ఒకటో 65 మీటర్ ల పొడవైనటువంటి మరియు 2 మీటర్ ల వెడల్పయినటువంటి ఎయర్ ఆపరేటెడ్ బులెట్ ప్రూఫ్ రబర్ డ్యామ్ ను ఏర్పాటు చేయడమైంది.

ఈ మూడు యూనిట్ లలో ప్రపంచంలోకెల్లా సర్వశ్రేష్ఠమైన సాంకేతిక పరిజ్ఞ‌ానాన్ని జోడించడమైంది. వీటి ఉద్దేశమల్లా భారతదేశం లోని ఏడు రాష్ట్రాలు.. ఉత్తర్ ప్రదేశ్, బిహార్, ఝార్ ఖండ్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్, పశ్చిమ బంగాల్ మరియు ఒడిశా..లలో యూరియా అవసరాల ను తీర్చాలి అనేదే.

 

***

 


(Release ID: 1808202) Visitor Counter : 186