ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

‘మాతృభూమి’శతాబ్ది సంవత్సరం సందర్భం లో ఏడాది పొడవునా సాగే కార్యక్రమాల ను  మార్చి నెల 18వ తేదీ న  ప్రారంభించనున్న ప్రధానమంత్రి 

प्रविष्टि तिथि: 17 MAR 2022 11:07AM by PIB Hyderabad

మలయాళ భాషా దిన పత్రిక ‘మాతృభూమి’ శతాబ్ది సంవత్సరం సందర్భం లో ఏడాది పొడవునా నిర్వహించే కార్యక్రమాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022 వ సంవత్సరం మార్చి నెల 18 వ తేదీ నాడు ఉదయం పూట 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు.

'మాతృభూమి’ ప్రచురణ కార్యకలాపాలు 1923వ సంవత్సరం లో మార్చి నెల 18 వ తేదీ నాడు ప్రారంభం అయ్యాయి. సామాజిక సంస్కరణ లు మరియు అభివృద్ధి కార్యక్రమాల ను ముందుకు తీసుకుపోవడం లో ఈ పత్రిక అగ్రగామి గా ఉంటూ వస్తున్నది. దీనితో పాటు దేశ హితం ముడిపడిన అంశాల ను కూడాను ఎప్పటికప్పుడు ప్రముఖం గా ప్రస్తావిస్తున్నది. మాతృభూమి’ కి 15 ఎడిషన్ లు ఉన్నాయి. అంతేకాకుండా, 11 నియమిత కాలిక పత్రిక లు కూడా ఉన్నాయి. దీని తోడు మాతృభూమి బుక్స్’ విభాగం సమకాలీన ఆసక్తి తో కూడినటువంటి అనేక అంశాల పైన పుస్తకాల ను ప్రచురిస్తున్నది.

 

 

***


(रिलीज़ आईडी: 1806909) आगंतुक पटल : 273
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam