ప్రధాన మంత్రి కార్యాలయం

హైదరాబాద్ లో భక్తి సాధువు శ్రీ రామానుజాచార్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన  'సమతా మూర్తి' ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధానమంత్రి  ప్రసంగ పాఠం

Posted On: 05 FEB 2022 10:17PM by PIB Hyderabad

 

ఓం అస్మద్ గురుభ్యో నమః!

ఓం శ్రీమతే రామానుజాయ నమః!

 

ఈ కార్యక్రమంలో మనతో పాటు తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ గారు, పూజ్య శ్రీ జీయర్ స్వామి గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరుడు, జి. కిషన్ రెడ్డి గారు, గౌరవనీయులైన శ్రీ డాక్టర్ రామేశ్వర్ రావు గారు, భగవద్ మహిమలతో కూడిన పూజ్య సాధువులందరూ, స్త్రీలు మరియు సజ్జనులారా.

 

ఈరోజు సరస్వతీ దేవిని పూజించే పవిత్రమైన పండుగ వసంత పంచమి. ఈ సందర్భంగా శారదా మాత విశేష కృపకు పాత్రుడైన శ్రీ రామానుజాచార్య విగ్రహాన్ని ప్రతిష్ఠాపన చేస్తున్నారు. నేను కూడా మీ అందరికీ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జగద్గురువు రామానుజాచార్య గారి జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకంగా ఉండాలని నేను సరస్వతి దేవిని ప్రార్థిస్తున్నాను.

 

మిత్రులారా,

'ధ్యాన మూలం గురు మూర్తి'! అని మనకు చెప్పబడింది - అంటే మన గురువు విగ్రహం మన దృష్టికి కేంద్రంగా ఉంటుంది. ఎందుకంటే, గురువు ద్వారానే మనకు జ్ఞానం వ్యక్తమవుతుంది. అర్థం కానిది మనకు తెలుస్తుంది. అవ్యక్తమైన వాటిని బహిర్గతం చేసే ఈ ప్రేరణ, సూక్ష్మమైన వాటిని గ్రహించాలనే ఈ సంకల్పం భారతదేశ సంప్రదాయం. రాబోవు యుగాల పాటు మానవాళికి మార్గనిర్దేశం చేయగల విలువలు, ఆలోచనలకు మనం ఒక ఆకారం ఇచ్చాం. ఈరోజు మరోసారి, భారతదేశం జగద్గురు శ్రీ రామానుజాచార్యుల ఈ భవ్యమైన విశాల విగ్రహం ద్వారా మానవ శక్తిని, స్ఫూర్తిని పొందుపరుస్తోంది. రామానుజాచార్యుల ఈ విగ్రహం ఆయన జ్ఞానం, వైరాగ్యం, ఆదర్శాలకు చిహ్నం. ఈ విగ్రహం రాబోయే తరాలకు స్ఫూర్తినివ్వడమే కాకుండా, భారతదేశపు ప్రాచీన గుర్తింపును కూడా బలోపేతం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను,. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ, దేశప్రజలందరికీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామానుజాచార్య అనుచరులందరికీ నేను చాలా అభినందనలు తెలియజేస్తున్నాను.

మిత్రులారా,

ప్రస్తుతం నేను 108 దివ్య క్షేత్రాల (108 దివ్య దేశాలు) ను సందర్శించి వస్తున్నాను. ఆళ్వార్ సాధువులు భారతదేశమంతటా సందర్శించి దర్శించిన 108 దివ్య క్షేత్రాల దర్శనం, శ్రీరామానుజాచార్య గారి కృప వల్ల ఈరోజు నాకు అదే అదృష్టం లభించింది. మానవాళి సంక్షేమం కోసం 11వ శతాబ్దంలో ఆయన ప్రారంభించిన యాగం, అదే సంకల్పాన్ని 12 రోజుల పాటు వివిధ క్రతువుల్లో ఇక్కడ పునరావృతం చేస్తున్నారు. పూజ్య శ్రీ జీయర్ స్వామీజీ ఆప్యాయతతో ఈరోజు 'విశ్వక్‌సేనేష్టి యాగం' పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనే భాగ్యం నాకు లభించింది. ఇందుకు జీయర్ స్వామీజీకి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'విశ్వక్‌సేనేష్టి యాగం' సంకల్పాలు, లక్ష్యాలను నెరవేర్చే యజ్ఞం అని ఆయన నాకు చెప్పారు. దేశ సంకల్పాల అమృతం నెరవేరడానికి నమస్కరిస్తూ ఈ యాగ సంకల్పాన్ని అంకితం చేస్తున్నాను. నా 130 కోట్ల మంది దేశప్రజల కలల నెరవేర్పు కోసం ఈ యాగ ఫలాలను సమర్పిస్తున్నాను.

 

మిత్రులారా,

ప్రపంచంలోని చాలా నాగరికతలలో, చాలా తత్వాలలో ఒక ఆలోచన ఆమోదించబడింది లేదా తిరస్కరించబడింది. కానీ భారతదేశం లాంటి దేశంలో, మార్మికులు జ్ఞానాన్ని ఖండించడం, అంగీకరించడం మరియు తిరస్కరించడం ద్వారా దాని కంటే పైన ఉన్నట్లు చూశారు.ఆ వివాదాన్ని దైవిక దృష్టితో చూశారు. మనకు ఇక్కడ అద్వైతం కూడా ఉంది, ద్వైతం కూడా ఉంది. ఈ ద్వైత-అద్వైతాలను కలుపుతూ, శ్రీ రామానుజాచార్యుల విశిష్ట-ద్వైతం కూడా మనకు స్ఫూర్తినిస్తుంది. రామానుజాచార్య గారి జ్ఞానం ఒక విలక్షణమైన వైభవాన్ని కలిగి ఉంది. సాధారణ దృక్కోణం నుండి పరస్పర విరుద్ధంగా అనిపించే ఆలోచనలను రామానుజాచార్యులు చాలా సులభంగా ఒకే దారంలో ఉంచారు. తన జ్ఞానంతో, తన వ్యాఖ్యానంతో, సామాన్య మానవుడు కూడా అనుసంధానించబడి ఉన్నాడు. మీరే చూడండి, రామానుజాచార్యుల వ్యాఖ్యానాలు ఒకవైపు జ్ఞానానికి పరాకాష్ట, మరోవైపు ఆయన భక్తిమార్గానికి పితామహుడు కూడా. ఒక వైపు, అతను గొప్ప సన్యాస సంప్రదాయానికి చెందిన సన్యాసి కూడా, మరోవైపు, గీత భాష్యంలో, అతను కర్మ ప్రాముఖ్యతను కూడా చాలా చక్కగా ప్రదర్శించాడు. తన జీవితమంతా కర్మకే అంకితం చేశాడు. రామానుజాచార్యులు సంస్కృత గ్రంథాలను కూడా రచించారు అదే విధంగా భక్తిమార్గంలో తమిళ భాషకు సమాన ప్రాధాన్యత ఇచ్చారు. నేటికీ, రామానుజ సంప్రదాయంలోని దేవాలయాలలో, తిరుప్పావై పారాయణం లేకుండా ఏ ఆచారమూ పూర్తికాదు.

 

మిత్రులారా,

నేటి ప్రపంచంలో, సామాజిక సంస్కరణలు, అభ్యుదయవాదం విషయానికి వస్తే, సంస్కరణలు మూలాలకు దూరంగా జరుగుతాయని నమ్ముతారు. కానీ, రామానుజాచార్యులని చూసినప్పుడు, ప్రగతిశీలతకు, ప్రాచీనతకు మధ్య వైరుధ్యం లేదని మనం గ్రహించాము. సంస్కరణల కోసం మన మూలాలకు దూరంగా వెళ్లాల్సిన అవసరం లేదు. బదులుగా, మన నిజమైన మూలాలతో అనుసంధానం కావడం, మన నిజమైన శక్తిని తెలుసుకోవడం ముఖ్యం! వెయ్యి సంవత్సరాల క్రితం, మూస పద్ధతుల ఒత్తిడి, మూఢనమ్మకాల ఒత్తిడి, ఊహకు అందనంతగా ఉండేదేమో! కానీ రామానుజాచార్య గారు సమాజ పురోగతి కోసం భారతదేశ నిజమైన ఆలోచనను సమాజానికి పరిచయం చేశారు. దళితులను, వెనుకబడిన వర్గాల వారిని చేరదీసి , వారికి గౌరవం కల్పించారు. యాదవగిరిపై నారాయణ మందిరాన్ని నిర్మించి, అందులో దళితులకు దర్శన, పూజాధికారాలు కల్పించారు. जातिः कारणं लोके गुणाः कल्याण हेतवः  అంటే ప్రపంచంలో సంక్షేమం కులం ద్వారా కాదు, సద్గుణాల ద్వారా జరుగుతుందని రామానుజాచార్య గారు చెప్పారు. రామానుజాచార్యుల గురువైన శ్రీ మహాపూర్ణ ఒకప్పుడు వేరే కులానికి చెందిన స్నేహితుని అంత్యక్రియలు చేశారు. ఆ సమయంలో రామానుజాచార్యులు ప్రజలకు భగవంతుడు శ్రీరాముని గుర్తు చేశారు. జటాయువు అంతిమ సంస్కారాలను శ్రీరాముడు తన చేతులతో నిర్వహించగలిగినప్పుడు, వివక్షతతో కూడిన ఆలోచనకు ధర్మం ఎలా ప్రాతిపదిక అవుతుంది? అని ఆయన అన్నారు. ఇది స్వతహాగా గొప్ప సందేశం.

 

మిత్రులారా,

మన సంస్కృతి ప్రత్యేకత ఏమిటంటే, అభివృద్ధి కోసం, ప్రజలు మన సమాజంలో నుండి రావడం. యుగయుగాల నుండి చూస్తే, సమాజంలో కొన్ని దుష్టశక్తులు వ్యాప్తి చెందడం ప్రారంభమైనప్పుడల్లా, మన మధ్యలో నుండి కొంతమంది గొప్ప వ్యక్తులు పుడతారు. అటువంటి సంస్కర్తలకు వారి కాలంలో ఎల్లప్పుడూ ఆమోదం ఉందా లేదా అనేది వేల సంవత్సరాల అనుభవం, వారు ఆమోదించబడినా, ఆమోదించకపోయినా, వారు సవాళ్లను ఎదుర్కొన్నా లేకపోయినా, వారు వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది, కానీ ఆ దృష్టిలో, ఆ అంశంలో చాలా శక్తి ఉందిఅతని నమ్మకం చాలా బలంగా ఉంది, అతను సమాజంలోని చెడుకు వ్యతిరేకంగా పోరాడటానికి తన శక్తిని ఉంచేవాడు. కానీ సమాజం దీనిని అర్థం చేసుకున్నప్పుడు, అప్పుడు ఎవరు వ్యతిరేకించినా, సాధ్యమైనంత వేగంగా ఆమోదం పొందుతుంది. వారికి ఆదరాభిమానాలు లభిస్తాయి. మన సమాజంలో చెడుకు అనుకూలంగా, మూఢనమ్మకాలకు అనుకూలంగా మన సమాజంలో సామాజిక అనుమతి లేదని ఇదే నిదర్శనం. చెడుతో పోరాడే వారు, సమాజాన్ని సంస్కరించే వారు మాత్రమే ఇక్కడ గౌరవాభిమానాలు పొందుతారు.

 

సోదర సోదరీమణులారా,

రామానుజాచార్యుల జీవితంలోని వివిధ అంశాల గురించి మీ అందరికీ తెలుసు.. సమాజానికి, ఆచరణాత్మక జీవితానికి సరైన దిశానిర్దేశం చేయడానికి ఆధ్యాత్మికత సందేశాలను కూడా ఉపయోగించాడు! కులం పేరుతో వివక్షకు గురైన వారికి రామానుజాచార్యులు తిరుకులతార్ అని పేరు పెట్టారు. అంటే, లక్ష్మీ కులంలో జన్మించిన వారని, శ్రీకుల్ లేదా దైవీయ జనులు ! స్నానం చేసి వస్తున్నప్పుడు తన శిష్యుడు 'ధనుర్దాసు' భుజం మీద చెయ్యి వేసి  వచ్చేవాడు. ఇలా చేయడం ద్వారా రామానుజాచార్యులు అంటరానితనం అనే చెడును నిర్మూలించాలని సూచించేవారు. ఈ కారణంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి ఆధునిక సమానత్వ వీరుడు కూడా రామానుజాచార్యులను  ఎంతో ప్రశంసించడానికి ఇదే కారణం. నేర్చుకోవాలంటే రామానుజాచార్య గారి బోధనల నుంచి నేర్చుకోండి అని సమాజానికి చెప్పేవారు. అందుకే ఈ రోజు రామానుజాచార్యుల విశాల మూర్తి సమానత్వం సందేశాన్ని సమతా మూర్తి  రూపంలో ఇస్తున్నారు. ఈ సందేశంతో, 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ మరియు సబ్కా ప్రయాస్' అనే మంత్రంతో ఈ రోజు దేశం తన కొత్త భవిష్యత్తుకు పునాది వేస్తోంది. ఎలాంటి వివక్ష లేకుండా అందరి అభివృద్ధి జరగాలి. సామాజిక న్యాయం, వివక్ష లేకుండా ప్రతి ఒక్కరూ పొందాలి. శతాబ్దాలుగా అణచివేతకు గురైన వారు పూర్తి గౌరవంతో అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, ఇందుకోసం మారుతున్న నేటి భారతదేశం ఐక్యంగా కృషి చేస్తోంది. నేడు మన దళిత-వెనుకబడిన సోదరులు మరియు సోదరీమణులు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల నుండి భారీ ప్రయోజనాలను పొందుతున్నారు. పక్కా ఇల్లు ఇవ్వాలన్నా, ఉచిత ఉజ్వల కనెక్షన్ ఇవ్వాలన్నా, గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలన్నా, రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలన్నా, ఉచిత విద్యుత్ కనెక్షన్ కావాలన్నా, జన్ ధన్ బ్యాంకు ఖాతాలు తెరవాలన్నా, స్వచ్ఛ భారత్ అభియాన్ కింద కోట్లాది మరుగుదొడ్లు నిర్మించాలన్నా.. అవును, ఇటువంటి పథకాలు అందరికీ ప్రయోజనం చేకూర్చాయి, దళిత-వెనుకబడిన, పేద, దోపిడీకి గురైన- అందరికీ మంచి చేశాయి.  వివక్ష లేకుండా, ప్రతి ఒక్కరికీ సాధికారత కల్పించబడింది.

 

మిత్రులారా,

రామానుజాచార్యులు చెప్పేవారు - ‘‘उईरगलुक्कूल बेडम इल्लै’’। అంటే జీవులందరూ సమానమే. అతను బ్రహ్మ, జీవం ఐక్యత గురించి మాట్లాడటం ఆపలేదు, అతను స్వయంగా ఈ వేదాంత సూత్రాన్ని జీవించాడు. అతనికి తనకూ ఇతరులకూ తేడా లేదు. అతను కూడా తన స్వంతదాని కంటే జీవుని క్షేమం గురించి ఎక్కువ శ్రద్ధ వహించాడు. ఆయన గురువు చాలా ప్రయత్నాల తర్వాత అతనికి జ్ఞానాన్ని అందించినప్పుడు, అతను దానిని రహస్యంగా ఉంచమని కోరాడు. ఎందుకంటే, ఆ గురుమంత్రమే ఆయన కల్యాణ మంత్రం. అతను ఆధ్యాత్మిక సాధన చేసాడు, తపస్సు చేసాడు, తన జీవితాన్ని అంకితం చేసాడు, అందుకే అతనికి ఈ గురుమంత్రం లభించింది. కానీ రామానుజాచార్యుల ఆలోచన వేరు. రామానుజాచార్య అన్నారు- पतिष्ये एक एवाहं, नरके गुरु पातकात्सर्वे गच्छन्तु भवतां, कृपया परमं पदम् అదేమిటంటే, నేను ఒంటరిగా నరకానికి వెళ్లినా పర్వాలేదు, కానీ అందరూ బాగుండాలి. దీని తరువాత, అతను గుడి పైకి ఎక్కి, తన గురువు వారి క్షేమం కోసం తనకు ఇచ్చిన మంత్రాన్ని అందరికీ వినిపించాడు. అటువంటి సమానత్వపు అమృతాన్ని వేద వేదాంత నిజమైన తత్వాన్ని చూసిన రామానుజాచార్య లాంటి మహా పురుషులు మాత్రమే వెలికి తీయగలిగారు.

 

మిత్రులారా,

రామానుజాచార్యుల వారు భారతదేశ ఐక్యత, సమగ్రతకు ప్రకాశించే స్ఫూర్తి. అతను దక్షిణాన జన్మించాడు, కానీ అతని ప్రభావం దక్షిణం నుండి ఉత్తరం, తూర్పు నుండి పశ్చిమం వరకు భారతదేశం మొత్తం మీద ఉంది. రామానుజుల ఔన్నత్యాన్ని అన్నమాచార్యుల వారు తెలుగులో ప్రశంసిస్తే, కనకదాస్ గారు కన్నడ భాషలో రామానుజాచార్య కీర్తిని పాడారు, మీరు గుజరాత్, రాజస్థాన్‌లకు వెళితే, అక్కడ కూడా చాలా మంది సాధువుల బోధనలలో రామానుజాచార్య ఆలోచనల పరిమళాన్ని మీరు అనుభవించవచ్చు. అంతే కాకుండా, గోస్వామి తులసీదాస్ జీ నుండి ఉత్తరాన రామనందియ సంప్రదాయానికి చెందిన కబీర్‌దాస్ వరకు, రామానుజాచార్యులు ప్రతి గొప్ప సాధువుకు ప్రధాన గురువు. రామానుజాచార్య జీ జీవితంలో, ఒక సాధువు తన ఆధ్యాత్మిక శక్తితో భారతదేశం మొత్తాన్ని ఏకతాటిపై ఎలా కలిపాడో మనం చూడవచ్చు. ఈ ఆధ్యాత్మిక స్పృహ వందల సంవత్సరాల బానిసత్వ కాలంలో భారతదేశ చైతన్యాన్ని మేల్కొల్పింది.

 

మిత్రులారా,

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్న సమయంలోనే శ్రీరామానుజాచార్య జీపై ఈ వేడుక జరగడం సంతోషకరమైన యాదృచ్ఛికం. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవంలో స్వాతంత్ర్య పోరాట చరిత్రను స్మరించుకుంటున్నాం. నేడు దేశం తన స్వాతంత్ర్య సమరయోధులకు కృతజ్ఞతతో నివాళులర్పిస్తోంది. మన చరిత్ర నుండి మనం మన భవిష్యత్తుకోసం ప్రేరణ తీసుకుంటున్నాము, శక్తిని తీసుకుంటున్నాము. అందుకే అమృత్ మహోత్సవ ఈ సంఘటన స్వాతంత్ర్య పోరాటంతో పాటు వేలాది సంవత్సరాల భారతదేశ వారసత్వాన్ని అందిస్తోంది.  భారతదేశ స్వాతంత్ర్య పోరాటం కేవలం దాని అధికారం, హక్కుల కోసం జరిగిన పోరాటం కాదని మనకు తెలుసు. ఈ పోరాటంలో ఒకవైపు 'వలసవాద మనస్తత్వం', మరోవైపు 'జీవించి జీవించనివ్వండి' అనే ఆలోచన ఉంది. ఇందులో ఒకవైపు జాతి ఔన్నత్యం, భౌతికవాదం అనే ఉన్మాదం, మరోవైపు మానవత్వం, ఆధ్యాత్మికతపై విశ్వాసం ఉన్నాయి. ఈ యుద్ధంలో భారతదేశం విజేతగా నిలిచింది, భారతదేశ సంప్రదాయం విజయం సాధించింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, సమానత్వం, మానవత్వం తో పాటు ఆధ్యాత్మికత శక్తి కూడా నిమగ్నమై ఉంది, ఇది రామానుజాచార్య వంటి సాధువుల నుండి భారతదేశానికి లభించింది.

 

గాంధీజీ లేకుండా మన స్వాతంత్ర్య పోరాటాన్ని ఊహించగలమా? మరి అహింస, సత్యం వంటి ఆదర్శాలు లేని గాంధీజీని మనం ఊహించగలమా? నేటికీ, గాంధీజీ పేరు వచ్చిన వెంటనే, 'వైష్ణవ్ జాన్ తో తేనే కహియే', ఈ రాగం మన హృదయంలో ప్లే అవుతుంది. దీని రచయిత నర్సీ మెహతా జీ రామానుజాచార్య జీ భక్తి సంప్రదాయానికి చెందిన గొప్ప సాధువు. కాబట్టి మన స్వాతంత్య్ర పోరాటానికి మన ఆధ్యాత్మిక స్పృహ ఎలా శక్తినిచ్చిందో, 75 ఏళ్ల స్వాతంత్య్రంలో మన అమృత తీర్మానాలకు కూడా అదే శక్తిని అందించాలి. ఈరోజు నేను హైదరాబాద్‌లో భాగ్యనగర్‌లో ఉన్నప్పుడు సర్దార్ పటేల్ గురించి గురించి నేను ఖచ్చితంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తాను. దీని గురించి కిషన్ రెడ్డి తన ప్రసంగంలో చాలా వివరంగా అడిగారు. భాగ్యనగరంలో ఎవరికి అంత అదృష్టం ఉంటుంది? సర్దార్ పటేల్ దార్శనికత, సర్దార్ పటేల్ శక్తి, హైదరాబాద్ కీర్తి కోసం సర్దార్ సాహిబ్ దౌత్యం తెలియని హైదరాబాదీ ఎవరు ఉంటారు? నేడు ఒకవైపు సర్దార్ సాహిబ్ ‘ఐక్యతా ప్రతిమ' దేశంలో ఐక్యతా ప్రమాణాన్ని పునరుద్ఘాటిస్తుంటే, రామానుజాచార్యుల 'సమతా మూర్తి' సమానత్వ సందేశాన్ని ఇస్తోంది. ఇది ఒక దేశంగా భారతదేశ పురాతన లక్షణం. మన ఐక్యత అధికారం లేదా శక్తి పునాదిపై నిలబడదు, మన ఐక్యత సమానత్వం, గౌరవం ఈ సూత్రం ద్వారా సృష్టించబడతాయి.

 

మిత్రులారా,

ఈ రోజు నేను తెలంగాణలో ఉన్నప్పుడు, తెలుగు సంస్కృతి భారతదేశ వైవిధ్యాన్ని ఎలా శక్తివంతం చేసిందో ఖచ్చితంగా ప్రస్తావిస్తాను. తెలుగు సంస్కృతి మూలాలు శతాబ్దాలుగా విస్తరించి ఉన్నాయి. ఎందరో గొప్ప రాజులు, రాణులు, దీని పతాకధారులు. శాతవాహనులైనా, కాకతీయులైనా, విజయనగర సామ్రాజ్యమైనా అందరూ తెలుగు సంస్కృతిని సమృద్ధి చేశారు. మహా కవులు తెలుగు సంస్కృతిని సుసంపన్నం చేశారు. గతేడాదిలోనే తెలంగాణలోని 13వ శతాబ్దానికి చెందిన కాకతీయ రుద్రేశ్వరుడు-రామప్ప ఆలయాన్ని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది.ప్రపంచ పర్యాటక సంస్థ కూడా పోచంపల్లిని భారతదేశంలోనే అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. పోచంపల్లి చీరల రూపంలో పోచంపల్లి మహిళల నైపుణ్యం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. సామరస్యాన్ని, సౌభ్రాతృత్వాన్ని, మహిళాశక్తిని గౌరవించాలని ఎల్లప్పుడూ నేర్పిన సంస్కృతి ఇది.

 

నేడు తెలుగు సంస్కృతి మహిమాన్విత సంప్రదాయాన్ని తెలుగు చిత్ర పరిశ్రమ ఎంతో గర్వంగా ముందుకు తీసుకువెళుతోంది. తెలుగు సినిమా పరిధి కేవలం తెలుగు మాట్లాడే చోటే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. వెండితెర నుంచి ఓటీటీ వేదికల వరకు ఈ సృజనాత్మకత గురించి చర్చ జరుగుతోంది. భారతదేశం వెలుపల కూడా చాలా ప్రశంసలు ఉన్నాయి. తెలుగు మాట్లాడే ప్రజలు తమ కళకు, వారి సంస్కృతికి ఈ అంకితభావం అందరికీ స్ఫూర్తిదాయకం.

 

మిత్రులారా,

స్వాతంత్ర్యం వచ్చిన 75వ సంవత్సరంలో, ఈ అమృత కాలంలో, ఈ శ్రీరామానుజాచార్యుల విగ్రహం ప్రతి దేశస్థునికీ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. స్వాతంత్య్ర అమృత సమయంలో, శ్రీరామానుజాచార్యులు సమాజాన్ని జాగృతం చేసిన ఆ దురాచారాలను మనం పూర్తిగా నిర్మూలించగలమని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అదే స్ఫూర్తితో, పూజ్య స్వామీజీకి గౌరవపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ పవిత్ర సందర్భంలో భాగం అవ్వడానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, నేను మీకు చాలా కృతజ్ఞుడిని!  ప్రపంచమంతటా, భగవాన్ రామానుజాచార్య గారి ఆలోచనలచే స్ఫూర్తి పొందిన ప్రతి ఒక్కరికీ నా శుభాకాంక్షలు! నేను నా ప్రసంగాన్ని ఆపుతున్నాను.

 

మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు!

 

*****



(Release ID: 1795894) Visitor Counter : 210