ఆర్థిక మంత్రిత్వ శాఖ
రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, మాస్ ట్రాన్స్‌పోర్టు, జలరవాణా , ఆర్థిక పరివర్తనకు లాజిస్టిక్ మౌలికసదుపాయాలు, నిరంతరాయ మల్టీమోడల్ అనుసంధానత, లాజిస్టిక్‌లను పరస్పరం ఉపయోగించుకునే రంగాల వంటి 7 రంగాలతో పి.ఎం . గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్. 2022-23 లో జాతీయ రహదారుల నెట్ వర్క్‌ను 2,50,000 కిలోమీటర్లకు విస్తరణ.
స్టేక్ హోల్డర్లందరికి ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్ (ఎఇఐ)కోసం డిజైన్ చేసిన యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్‌ఫేస్ ప్లాట్‌పారం (యులిప్).
2022-23లో పిపిపి పద్ధతిలో నాలుగు ప్రాంతాలలో మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల ఏర్పాటు
స్థానిక వ్యాపారాలు, సరఫరా చెయిన్ లకు సహాయపడేందుకు ఒకదేశం-ఒక ఉత్పత్తి ని ప్రచారంలో పెడతారు.
2,000 కిలోమీటర్ల రైల్వే నెట్ వర్క్ ను కవచ్ కిందికి తెస్తారు, 400 కొత్తతరం వందే భారత్ రైళ్లను అభివృద్ధి చేస్తారు.
మల్టీ మోడల్ లాజిస్టిక్ సుదపాయాల కోసం రాగల 3 సంవత్సరాలలో 100 పిఎం గతిశక్తి కార్గో టెర్మినళ్లు అభివృద్ధి చేస్తారు.
పిపిపి పద్ధతిలో నేషనల్ రోప్ వే డవలప్ మెంట్ ప్రోగ్రామ్‌ను చేపట్టడం జరుగుతుంది.
2022-23 లో 60 కిలొమీటర్ల మేర 8 రోప్ వే ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇస్తారు.
Posted On:
01 FEB 2022 12:49PM by PIB Hyderabad
పి.ఎం. గతిశక్తి పరివర్తనాత్మక ఆర్థిక ప్రగతి, సుస్థిరాభివృద్ధి విధానం. ఈ విధానం ప్రధానంగా ఏడు రంగాలైన రోడ్లు, రైల్వేలు, విమానాశ్రాయలు, పోర్టుల, మాస్ ట్రాన్స్‌పోర్టు, జలరవాణా, లాజిస్టిక్ మౌలికసదుపాయాలు చోదకశక్తిగా కలిగినది. 2022-23 ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక , కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఈ అన్ని ఏడు రంగాలు ఆర్థిక వ్యవస్థను ఏకోన్ముఖంగా ముందుకు తీసుకుపోనున్నాయన్నారు. వీటికి మద్దతుగా ఇంధన సరఫరా, ఐటి కమ్యూనికేషన్లు, బల్క్ వాటర్, సీవరేజ్, సామాజిక మౌలికసదుపాయాలు మద్దతునిస్తాయన్నారు. మొత్తానికి ఈ విధానం పరిశుధ్దమైన ఇంధనం, సబ్ కా ప్రయాస్ తో శక్తిమంతమౌతుందన్నారు.కేంద్రప్రభుత్వం, రాష్ట్రప్రభుత్వాలు, ప్రైవేటు రంగం కలిసి కృషి చేయడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి, వ్యాపార అవకాశాలు అందరకీ ప్రత్యేకించి యువతకు కలుగుతాయని అన్నారు.
పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ :
పిఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఏడు రంగాలతో కూడుకున్నదని, ఇది ఆర్ధిక పరివర్తను, నిరంతరాయ మల్టీమోడల్ అనుసంధానతకు, లాజిస్టిక్‌ల సమర్థతకు వీలు కల్పిస్తుందని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రాష్ట్రప్రభుత్వాలు గతిశక్తి మాస్టర్ ప్లాన్ ప్రకారం అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలు కూడా ఇందులో కలసి ఉంటాయని అన్నారు. వినూత్న విధానాలలో ప్లానింగ్, ఫైనాన్సింగ్ , సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం, సత్వర అమలు వంటివి ఇందులో ఉన్నాయి.
ఈ ఏడు రంగాలకు సంబంధించిన నేషనల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పైప్‌లైన్‌ను పి.ఎం. గతి శక్తి ఫ్రేమ్ వర్క్ తో అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు. అత్యుధునాతన ప్రపంచశ్రేణి ఆధునిక మౌలికసదుపాయాలు, వివిధరంగాలకు సంబంధించిన రవాణాను, ప్రాజెక్టు ప్రాంతాలను అనుసంధానం చేయడం ఇందులోని ప్రధాన అంశం. ఇది ఉత్పాదకతను పెంపొందించడానికి, ఆర్ధిక వృద్ధిని, అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఉపకరిస్తుంది.
రొడ్ రవాణాః
పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ఫర్ ఎక్స్‌ప్రెస్ వేలకు పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్‌ను 2022-23లో రూపకల్పన చేయడంజరుగుతుందన్నారు. దీనివల్ల ప్రజలు, సరకులు వేగవంతంగా గమ్యస్థానాలకు చేరడానికి వీలు కలుగుతుందన్నారు. జాతీయ హైవేల నెట్ వర్క్‌ను 2022-23 సంవత్సరంలో 25,000 కిలోమీటర్లు విస్తరించడం జరుగుతుందన్నారు. ప్రజా వనరులతో పాటు వినూత్న ఫైనాన్సింగ్ విధానాలతో 20,000 కోట్ల రూపాయలను సమీకరించడం జరుగుతుందన్నారు.
సరకురవాణా, ప్రజల రాకపోకలు నిరంతరాయంగా సాగే మల్టీమోడల్ వ్యవస్థ:
.యూనిఫైడ్ లాజిస్టిక్ ఇంటర్ ఫేస్ ప్లాట్ ఫారం (యుఎల్ ఐ పి) కింద అన్నిరకాల ఆపరేటర్ల కార్యకలాపాలను ఒక చోట చేర్చి వాటికి సంబందించిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునేలా చూడనున్నట్టు శ్రీమతి సీతారామన్ తెలిపారు. దీనిని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ కోసం రూపొందించారన్నారు. ఇది సమర్ధంగా సరకు రవాణాను తక్కువ ఖర్చు, తగిన సమయంలో జరిగేట్టు చూస్తుందని, ఇన్వెంటరీ మేనేజ్ మెంట్ కు ఉపకరిస్తుందని అన్నారు. అనవసర డాక్యుమెంటేషన్ లేకుండా చూస్తుందని తెలిపారు. అన్నిటికంటే ముఖ్యంగా ఇది రియల్ టైమ్ సమాచారాన్ని స్టేక్ హోల్డర్లు అందరికీ అందజేస్తుందని, అంతర్జాతీయ పోటీ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. ప్రయాణికులు నిరంతరాయంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణించడానికి కూడా ఇది వీలు కల్పిస్తుంది.
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులు :
మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కులను పిపిపి పద్ధతిలో నాలుగు ప్రాంతాలలో 2022-23 సంవత్సరాలలో ఏర్పాటు చేస్తారు.
రైల్వేలుః
రైల్వేలు నూతన ప్రాడక్టులు , సమర్ద లాజిస్టిక్ సర్వీసులను చిన్న రైతులు, చిన్న మధ్య తరహా ఎంటర్ ప్రైజ్ లకోసం అభివృద్ది చేస్తాయన్నారు. అలాగే పోస్టల్, రైల్వేనెట్ వర్క్‌లను పార్సిల్ సర్వీసులు సత్వరం గమ్యస్థానానికి చేరేలా నిరంతరాయ ఏర్పాటు చేస్తారన్నారు.
ఒక స్టేషన్- ఒక ఉత్పత్తి విధానాన్నప్రాచుర్యంలోకి తీసుకువస్తారని, ఇది స్థాని వ్యాపారాలు, సరఫరా చెయిన్‌కు ఎంతో ఉపయోగపడుతుందన్నారు.
.ఆత్మనిర్భర్ భారత్ లో భాగంగా 2,000 కిలొమీటర్ల నెట్‌వర్క్‌ను కవచ్ కిందికి తీసుకువస్తారు. దీనికి దేశీయంగా ప్రపంచ శ్రేణి భద్రతా సాంకేతికతను, సామర్ధ్యం పెంపును 2022-23లో తీసుకువస్తారు. 400 కొత్త తరం వందే భారత్ రైళ్లను అభివృద్ది చేయనున్నట్టు ఆర్థిక మంత్రి తెలిపారు. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం, మెరుగైన ఇంధన సామర్ద్యం కలిగి ఉంటాయన్నారు. రాగల 3 సంవత్సరాలలో వీటిని అభివృద్ధి చేస్తారన్నారు.
100 పి.ఎం. గతి శక్తి కార్గో టెర్మినళ్లను మల్టీ మోడల్ లాజిస్టిక్ సదుపాయాల కోసం రాగల మూడు సంవత్సరాలలో అభివృద్ది చేస్తారు.
.మాస్ అర్బన్ ట్రాన్స్‌పోర్టు రైల్వేలతో అనుసంధానతః
.ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం చేస్తూ, మెట్రో వ్యవస్థలను తగిన రీతిలో తగిన స్తాయిలో సత్వరం అమలుచేసేందుకు అవసరమైన ఆర్థికవనరులను వినూత్న పద్ధతిలో చేపట్టడం జరుగుతుందన్నారు. మల్టీ మోడల్ అనుసంధానతను మాస్ అర్బన్‌ట్రాన్స్‌పోర్టు, రైల్వే స్టేషన్‌లను ప్రాధాన్యత ప్రాతిపదితకన చేపట్టడం జరుగుతుంది. మెట్రో వ్యవస్థల డిజైన్, సివిల్ నిర్మాణాలను భారతీయ పరిస్థితులకు అనుగుణంగా , అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దడం జరుగుతుంది.
పర్వత్ మాలా: నేషనల్ రోప్ వేస్ డవలప్‌మెంట్ ప్రోగ్రాం:
క్లిష్టమైన కొండప్రాంతాలలో పర్యావరణ పరంగా హితకరమైన ప్రత్యామ్నాయ రోడ్లు, నేషనల్ రోప్‌వే డవలప్‌మెంట్ ప్రోగ్రాం ను పిపిపి పద్ధతిలో చేపట్టడం జరుగుతుంది. అనుసంధానత, ప్రయాణికులకు సౌలభ్యం, పర్యావరణాన్ని కాపాడడం పర్యాటక రంగాన్ని ప్రమోట్ చేయడం లక్ష్యంగా వీటిని చేపడతారు. సంప్రదాయ మాస్ ట్రాన్సిట్ వ్యవస్థ సాద్యం కాని చోట, ఇరుకు పట్టణ ప్రాంతాలలో వాటిని ఏర్పాటు చేస్తారు. 8 రోప్‌వేలకు సంబంధించి 60 కిలో మీటర్ల పొడవుగల ప్రాజెక్టుల కాంట్రాక్టులను 2022-23 లో కేటాయిస్తారు.
మౌలికసదుపాయాల ప్రాజెక్టుల సామర్థ్య నిర్మాణం
కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు . ఇన్‌ఫ్రా ఏజెన్సీల సాంకేతిక సహకారంతో వారి నైపుణ్యాలను అప్‌గ్రేడ్ చేస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది పిఎం గతిశక్తి మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ప్రణాళిక, రూపకల్పన, ఫైనాన్సింగ్ (వినూత్న మార్గాలతో సహా) అమలు నిర్వహణలో సామర్థ్యాన్ని పెంచుతుంది.
2022-23 ఆర్థిక సంవత్సరంలో, లక్ష కోట్ల రూపాయలను రాష్ట్రప్రభుత్వాలకు సహాయం చేసేందుకు , దేశంలో మొత్తంగ పెట్టుబడిని ఉత్ప్రేరితం చేసేందుకు , 50 సంవత్సరాల పాటువడ్డీ లేని రుణాన్ని , సాధారణ రుణాలకు మించి అనుమతించడం జరుగుతుందని ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ కేటాయింపులను పి.ఎం. గతిశక్తి సంబందిత, ఇతర ఉత్పత్తి దాయక కేపిటల్ ఇన్వెస్ట్ మెంట్‌కు ఉపయోగిస్తారు. ఇందులో ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనకు సప్లిమెంటల్ నిధులు, రాష్ట్రాల వాటాకు మద్దతు, ఆర్థిక వ్యవస్థ డిజిటైజేషన్, డిజిటల్ చెల్లింపులు, ఒఎఫ్ సి నెట్ వర్క్‌పూర్తి, బైలాస్ ఏర్పాటుకు సంస్కరణలు, టౌన్ ప్లానింగ్ పథకాలు, ట్రాన్సిట్ ఆధారిత అభివృద్ధి, బదలీ అభివృద్ధి హక్కులు వంటి వి ఉన్నాయి.
***
(Release ID: 1794306)
Visitor Counter : 426
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam