ఆర్థిక మంత్రిత్వ శాఖ

'హర్ ఘర్, నల్ సే జల్' పథకం కోసం రూ. 60,000 కోట్లు కేటాయించారు; తద్వారా 3.8 కోట్ల గృహాలు కవర్ చేయబడతాయి


రూ. 48,000 కోట్లతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల గృహాలు

ఉత్తర సరిహద్దు గ్రామాలను వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద అభివృద్ధి

ఆస్పిరటోనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రామ్‌కింద వెనుకబడిన ప్రాంతాలపై దృష్టి

Posted On: 01 FEB 2022 1:13PM by PIB Hyderabad

హర్ ఘర్, నల్ సే జల్ పథకం కింద 2022-23లో 3.8 కోట్ల కుటుంబాలను కవర్‌ చేసేందుకు రూ. 60,000 కోట్లు అందించబడ్డాయి. 2022-23 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ 2014 నుండి పౌరులు ముఖ్యంగా పేదలు మరియు అట్టడుగు వర్గాల సాధికారతపై ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. గృహనిర్మాణం, విద్యుత్తు, వంటగ్యాస్ మరియు నీటి సదుపాయం కల్పించే కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని చెప్పారు. మరిన్ని వివరాలను తెలియజేస్తూ హర్ ఘర్ నల్ సే జల్ ప్రస్తుత కవరేజీ 8.7 కోట్లు అని, అందులో 5.5 కోట్ల కుటుంబాలకు గత 2 సంవత్సరాలలోనే కుళాయి నీటిని అందించామని ఆర్థిక మంత్రి తెలిపారు.

6. All Inclusive Welfare Focus For 2022-23.jpg


ప్రధాన మంత్రి ఆవాస్ యోజన

పట్టణ ప్రాంతాలలో మధ్యతరగతి మరియు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు సరసమైన గృహాలను ప్రోత్సహించడం కోసం 2022-23లో పిఎం ఆవాస్ యోజనలో గుర్తించబడిన అర్హులైన 80 లక్షలమంది లబ్ధిదారుల కోసం రూ.48,000 కోట్లు కేటాయించినట్లు కూడా శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.  భూమి మరియు నిర్మాణ సంబంధిత అనుమతుల కోసం అవసరమైన సమయాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేస్తుంది. మధ్యవర్తిత్వ వ్యయాన్ని తగ్గించడంతో పాటు మూలధనానికి ప్రాప్యతను విస్తరించేందుకు ప్రభుత్వం ఆర్థిక రంగ నియంత్రణ సంస్థలతో కలిసి పని చేస్తుంది.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్

కొత్త వైబ్రాంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద ఉత్తర సరిహద్దులోని గ్రామాలను కవర్ చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. "చిన్న జనాభా, పరిమిత కనెక్టివిటీ మరియు మౌలిక సదుపాయాలతో సరిహద్దు గ్రామాలు అభివృద్ధి ఫలాలకు దూరంగా ఉంటాయి. ఉత్తర సరిహద్దులో ఉన్న అలాంటి గ్రామాలు కొత్త వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ కింద కవర్ చేయబడతాయి. ఈ కార్యకలాపాలలో గ్రామ మౌలిక సదుపాయాల నిర్మాణం, గృహాలు, పర్యాటక కేంద్రాలు, రహదారి అనుసంధానం, వికేంద్రీకృత పునరుత్పాదక శక్తిని అందించడం, దూరదర్శన్ మరియు విద్యా మార్గాల కోసం నేరుగా ఇంటికి యాక్సెస్ మరియు జీవనోపాధికి తోడ్పాటు అందించడం వంటివి ఉంటాయి. ఈ కార్యకలాపాలకు అదనపు నిధులు అందించబడతాయి. ఇప్పటికే ఉన్న పథకాలు కలుస్తాయి. మేము వారి ఫలితాలను నిర్వచించాము మరియు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తాము అని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు.

ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్

ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో 2022-23 కీలక రంగాలలో తగినంత పురోగతిని కనబరచని బ్లాక్‌లపై ఆశావహ జిల్లాల కార్యక్రమం దృష్టి కేంద్రీకరిస్తుందని తెలిపారు. 'ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ ప్రోగ్రాం ద్వారా దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లోని పౌరుల జీవన నాణ్యతను మెరుగుపరచాలనే మా విజన్ తక్కువ సమయంలోనే వాస్తవరూపం దాల్చిందని తెలిపారు. ఆ 112 జిల్లాల్లో 95 శాతం ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక సమ్మేళనం మరియు ప్రాథమిక మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాలలో గణనీయమైన పురోగతి సాధించాయి. వారు రాష్ట్ర సగటు విలువలను అధిగమించారు. అయితే ఆయా జిల్లాల్లో కొన్ని బ్లాక్‌లు వెనుకంజలో కొనసాగుతున్నాయి. 2022-23లో ఈ కార్యక్రమం ఆయా జిల్లాల్లోని బ్లాకులపై దృష్టి సారిస్తుంది అని శ్రీమతి నిర్మలా సీతారామన్ చెప్పారు.



 

*****



(Release ID: 1794268) Visitor Counter : 385