ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సోమ్ నాథ్ లో కొత్త సర్క్యూట్హౌస్ ను జనవరి 21నాడు ప్రారంభించనున్న ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 20 JAN 2022 12:36PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సోమ్ నాథ్ లో కొత్త సర్క్యూట్ హౌస్ ను 2022వ సంవత్సరం జనవరి 21వ తేదీ నాడు ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవం ముగిసిన తరువాత ప్రధాన మంత్రి ప్రసంగ కార్యక్రమం ఉంటుంది.

సోమనాథ్ ఆలయాన్ని ప్రతి ఏటా భారతదేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా లక్షల కొద్దీ భక్తజనం సందర్శిస్తుంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వ సదుపాయం దేవాలయానికి బాగా దూర ప్రాంతం లో నెలకొని ఉన్న కారణం గా కొత్త సర్క్యూట్ హౌస్ ను ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతయినా ఉందని భావించడం జరిగింది. కొత్త సర్క్యూట్ హౌస్ ను 30 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు తో నిర్మించడమైంది. ఈ కొత్త సర్క్యూట్ హౌస్ దేవాలయానికి దగ్గర లో ఉంది. దీనిలో గదులు, అతి ప్రముఖులు అయిన వారికి బస సదుపాయాలు, డీలక్స్ రూములు, సమావేశాల నిర్వహణ కు అనువైన గది, సభాభవనం మొదలైనవి సహా అగ్ర శ్రేణి సదుపాయాల ను సమకూర్చడం జరిగింది. ప్రతి ఒక్క గది లో నుంచి సముద్రం తాలూకు దృశ్యం కనపడే విధం గా ఈ నిర్మాణాన్ని తీర్చిదిద్దడమైంది.

 

***


(रिलीज़ आईडी: 1791186) आगंतुक पटल : 214
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Gujarati , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Manipuri , Assamese , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam