ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2022 వ సంవత్సరం జనవరి30న జరిగే ‘మన్ కీబాత్’ కోసంపౌరుల ను వారి ఆలోచన లు మరియు సూచనల ను వెల్లడించాలంటూ ఆహ్వానించిన ప్రధాన మంత్రి

Posted On: 19 JAN 2022 11:12AM by PIB Hyderabad

దేశ పౌరుల ను 2022వ సంవత్సరం లో జనవరి 30 వ తేదీ ఆదివారం నాడు జరిగే మన్ కీ బాత్’ (‘మనసులో మాట’) కార్యక్రమం కోసం వారి వారి ఆలోచనల ను మరియు సూచనల ను వెల్లడి చేయవలసిందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోరారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘ఈ నెల లో 30వ తేదీ నాడు, 2022వ సంవత్సరం లో ఒకటో #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం జరుగనుంది. మీ వద్ద వెల్లడించడం కోసం ప్రేరణాత్మకమైనటువంటి అంశాలు, జీవన గాథలు అనేకం ఉన్నాయన్న సంగతి ని నేను ఎరుగుదును. వాటిని @mygovindia లో గాని లేదా NaMo App లో గాని వెల్లడి చేయండి. మీ సందేశాన్ని 1800-11-7800 కు ఫోన్ చేసి, రికార్డు చేయగలరు.’’ అని పేర్కొన్నారు.

 


(Release ID: 1790938) Visitor Counter : 163