ప్రధాన మంత్రి కార్యాలయం
50 వ విజయ్ దివస్ నాడు ముక్తి యోధులు, వీరాంగనలు మరియు భారత సాయుధ దళాల యొక్కపరాక్రమాన్ని, ఇంకా త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్న ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
16 DEC 2021 9:58AM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 50 వ విజయ్ దివస్ సందర్భం లో ముక్తి యోధుల, వీరాంగన ల మరియు భారత సాయుధ దళాల కు చెందిన సాహసుల అజేయ పరాక్రమాన్ని, వారి యొక్క త్యాగాన్ని గుర్తు కు తెచ్చుకొన్నారు. ఈ సందర్భం లో రాష్ట్రపతి గారు ఢాకా లో ఉండటమనేది భారతదేశం లోని ప్రతి ఒక్కరి కీ విశిష్ట ప్రాముఖ్యం కలిగినటువంటి అంశం అని కూడా శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -
‘’50 వ విజయ్ దివస్ నాడు నేను ముక్తి యోధుల, వీరాంగన ల మరియు భారత సాయుధ దళాల లోని సాహసుల అజేయ పరాక్రమాన్ని, వారి ప్రాణసమర్పణాన్ని గుర్తు కు తెచ్చుకొంటున్నాను. మనమంతా కలసికట్టుగా పోరాడి, హింసాత్మక శక్తుల ను పరాజయం పాల్జేశాం. రాష్ట్రపతి గారు ప్రస్తుతం ఢాకా లో ఉండడమనేది భారతదేశం లోని ప్రతి ఒక్కరి కి విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఘట్టం.’’ అని పేర్కొన్నారు.
***
DS/SH
(रिलीज़ आईडी: 1782268)
आगंतुक पटल : 175
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Tamil
,
Kannada
,
Malayalam
,
Bengali
,
Assamese
,
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Punjabi
,
Gujarati