ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సెప్టెంబర్ 25 న ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్న ప్రధాన మంత్రి

Posted On: 24 SEP 2021 5:02PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 సెప్టెంబర్ 25 న సాయంత్రం పూట జరిగే గ్లోబల్ సిటిజన్ లైవ్కార్యక్రమం లో వీడియో మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు.

 

‘గ్లోబల్ సిటిజన్’ అనేది ఒక ప్రపంచ స్థాయి రక్షా సంస్థ. దుర్భర దారిద్య్రాన్ని అంతం చేయడం కోసం ఈ సంస్థ పాటుపడుతోంది. కాగా, ‘గ్లోబల్ సిటిజన్ లైవ్’ 24 గంటల పాటు కొనసాగే కార్యక్రమం. సెప్టెంబర్ 25, 26 తేదీల లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ముంబయి, న్యూ యార్క్, పారిస్, రియో డి జనేరియో, సిడ్ నీ, లాస్ ఏంజెలిస్, లాగోస్, ఇంకా సియోల్ ల తో సహా పలు ప్రధాన నగరాల లో ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం ఉంటుంది. 120 దేశాల లోను, అనేక సోషల్ మీడియా ఛానల్స్ లోను ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తారు.

 

***


(Release ID: 1757864) Visitor Counter : 196