యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ని ప్రారంభించారు.


యువ మనస్సు, శరీరం మరియు ఆత్మ ఆరోగ్యవంతమైన ఆరోగ్యవంతమైన భారతదేశానికి కీలకం: శ్రీ అనురాగ్ ఠాకూర్

దేశవ్యాప్తంగా దాదాపు 750 జిల్లాలు, ప్రతి జిల్లాలో 75 గ్రామాలలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్స్ నిర్వహించబడుతాయి: క్రీడా మంత్రి

Posted On: 13 AUG 2021 3:13PM by PIB Hyderabad

 

ప్రధానాంశాలు:
- ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ నిర్వహిస్తున్నారు
-శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ న్యూ ఇండియాను ఫిట్ ఇండియాగా మార్చడానికి ఫిట్‌నెస్ ప్రతిజ్ఞను నిర్వహించారు
-'ఫిట్ ఇండియా' 'హిట్ ఇండియా'ను చేస్తుంది: శ్రీ అనురాగ్ ఠాకూర్
-యువజన వ్యవహారాలు మరియు క్రీడల సహాయ మంత్రి (ఎంఓఎస్‌) శ్రీ నిసిత్‌ పర్మానిక్‌ కూడా ప్రముఖ ప్రదేశాలలో పాల్గొనే వారితో సంభాషించారు.

యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మరియు యువజన వ్యవహారాలు మరియు క్రీడల సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ప్రమాణిక్ ఆగస్టు 13 న దేశవ్యాప్తంగా 75 సంవత్సరాల ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. క్రీడల శాఖ కార్యదర్శి శ్రీ రవి మిట్టల్ మరియు యువజన వ్యవహారాల శాఖ కార్యదర్శి శ్రీమతి ఉషా శర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ జాతీయ స్టేడియం నుండి ఫ్రీడమ్ రన్‌ను కేంద్ర మంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అదే సమయంలో పోర్ట్ బ్లెయిర్‌లోని సెల్యులార్ జైలు వంటి ప్రముఖ ప్రదేశాలతో సహా దేశవ్యాప్తంగా 75 ఇతర ప్రదేశాలలో ఈ కార్యక్రమం జరిగింది. లాహౌల్‌స్పిటిలో కాజా పోస్ట్; ముంబైలోని గేట్‌వే ఆఫ్ ఇండియా మరియు పంజాబ్‌లోని అటారి  బోర్డర్ వంటి ప్రదేశాల్లో ఈ కార్యక్రమం జరిగింది.

శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్‌లో పాల్గొనడం ద్వారా న్యూ ఇండియాను ఫిట్ ఇండియాగా తీర్చిదిద్దడానికి ఫిట్‌నెస్ ప్రతిజ్ఞను నిర్వహించారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ప్రారంభోత్సవంలో పాల్గొన్న వారితో పాటు జాతీయగీతాన్ని పాడారు.

మన స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేందుకు సంస్కృతిక మంత్రిత్వ శాఖ మార్షల్ నృత్య ప్రదర్శనను ప్రారంభించింది. మరియు మంత్రులు సాయుధ, పారామిలిటరీ దళాల సభ్యులతో పాటుదేశవ్యాప్తంగా నెహ్రూ యువ కేంద్ర సంస్థ (ఎన్‌వైకేఎస్‌) వాలంటీర్లతో వర్చువల్‌గా సంభాషించారు. దేశాన్ని కాపాడటమే కాకుండా యువత ఫిట్‌నెస్‌ని తమ జీవితంలో రెగ్యులర్ భాగంగా తీసుకునేలా ప్రోత్సహించినందుకు వారిని ప్రశంసించారు.

భారతదేశం 75 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంన్న నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రముఖ ప్రదేశాలలో పాల్గొన్న వారితో ఇంటరాక్ట్ చేస్తూ  ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 క్యాంపెయిన్‌ను ఆజాది కా అమృత్ మహోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్నట్లు క్రీడా మంత్రి తెలిపారు. ఫ్రీడమ్ రన్ ఈవెంట్ భారతదేశానికి స్వేచ్ఛనిచ్చిన జాతీయ హీరోలతో దేశాన్ని అనుసంధానిస్తుందని ఆయన అన్నారు. రాబోయే 25 ఏళ్లలో మన దేశం ఎలాంటి దశ, దిశ తీసుకుంటుంది అనేది మనం ఎంత ఫిట్‌గా ఉన్నామనే దానిపై ఆధారపడి ఉంటుందని మంత్రి అభిప్రాయపడ్డారు. "యువత మనస్సు, శరీరం మరియు ఆత్మ ఆరోగ్యవంతమైన భారతదేశానికి కీలకం" అని మంత్రి పునరుద్ఘాటించారు. "'ఫిట్ ఇండియా' మాత్రమే 'హిట్ ఇండియా'ను తయారు చేస్తుంది. ప్రతి పౌరుడూ ఉద్యమంలో భాగం కావాలని శ్రీ అనురాగ్ ఠాకూర్ కోరారు. ప్రజల భాగస్వామ్యం ద్వారా మాత్రమే సాధ్యమయ్యే ఫిట్ ఇండియాను అజనాందోలన్‌గా తీర్చిదిద్దడానికి ప్రధాన మంత్రి అందరినీ ప్రోత్సహించారు. ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన చోటు మరియు రన్‌ను ఎంచుకుని ఈ చారిత్రాత్మక ఉద్యమంలో భాగం కావాలని నేను కోరుతున్నాను" అని మంత్రి తెలిపారు.

అస్సాం నుండి ఎస్‌ఎస్‌బి సిబ్బందితో మంత్రి శ్రీ అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ " భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకుంటుండగా 75 ప్రాంతాల ప్రజలు ఉద్యమంలో చేరతారని, అది ప్రతి వ్యక్తికి చేరుతుందని అన్నారు. బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది అటారి సరిహద్దు నుండి వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్నారు. అలహాబాద్‌లోని ఆజాద్ పార్క్ నుండి సిఆర్‌పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న సిబ్బందికి యువజన మరియు క్రీడా వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ నిసిత్‌ప్రమాణిక్ తన సంభాషణలో కృతజ్ఞతలు తెలిపారు. మరియు ప్రధానమంత్రి కల అయిన" న్యూ ఇండియా, ఫిట్ ఇండియా"ను సాకారం చేయాలని పిలుపునిచ్చారు.

తరువాత శ్రీ అనురాగ్ ఠాకూర్ మీడియాతో మాట్లాడుతూ " ఆజాది కా అమృత్ మహోత్సవాన్ని జరుపుకోవడానికి మరియు దేశంలోని యువత ఫిట్‌నెస్‌ని ప్రోత్సహించడానికి మేము ఈ రోజు ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ని ప్రారంభించాము. దేశవ్యాప్తంగా 75 ఐకానిక్ ప్రదేశాలలో ఈ రన్ నిర్వహించబడుతోంది. ఇది దేశంలోని దాదాపు 750 జిల్లాల్లోని 75 గ్రామాలకు తీసుకెళుతుంది మరియు ఫిట్‌నెస్ కి డోజ్, ఆధాగుంటా రోజ్ ప్రచారాన్ని ప్రోత్సహిస్తుంది. దీనితో, దేశంలోని ప్రతి ప్రాంతానికి ప్రధాన మంత్రి ఫిట్‌నెస్ ఉద్యమాన్ని తీసుకెళ్లాలని మరియు దీనిని సామూహిక ఫిట్‌నెస్ ఉద్యమంగా మార్చాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఫ్రీడమ్ రన్ ఆగస్టు 15 న ప్రారంభమవుతుంది మరియు అక్టోబర్ 2, 2021 వరకు కొనసాగుతుంది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 7.50 కోట్ల మందికి పైగా యువత మరియు పౌరులను చేరుకోవాలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము" అని తెలిపారు

ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ శ్రీ నిసిత్‌ప్రమాణిక్ కృతజ్ఞతలు తెలిపారు. మరియు న్యూ ఇండియాను ఫిట్ ఇండియాగా మార్చడమే ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కల అని, ఈ ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 ఆ కల సాకారం కావడానికి కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.

క్రీడల కార్యదర్శి శ్రీ రవి మిట్టల్ మాట్లాడుతూ " ప్రతి వారం ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్‌లు 75 జిల్లాలలో మరియు ప్రతి జిల్లాలోని 75 గ్రామాలలో 2 అక్టోబర్ 2021 వరకు జరుగుతాయి. ప్రజలను వారి రోజువారీ జీవితం రన్నింగ్ మరియు స్పోర్ట్స్ వంటి ఫిట్‌నెస్ కార్యకలాపాలను చేపట్టడానికి ప్రోత్సహించడం ఈ ప్రచార లక్ష్యం" అని చెప్పారు.

ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ 2.0 యొక్క ముఖ్య కార్యక్రమాలలో ప్రతిజ్ఞ, జాతీయ గీతం, ఫ్రీడమ్ రన్, వేదికల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు,  యూత్ వాలంటీర్లలో అవగాహన మరియు వారి గ్రామాల్లో ఇలాంటి ఫ్రీడమ్ రన్‌లను నిర్వహించడం వంటివి ఉన్నాయి. ప్రజలు ఫిట్ ఇండియా పోర్టల్ https: //fitindia.gov.in లో నమోదు చేసుకోవచ్చు మరియు అప్‌లోడ్ చేయవచ్చు మరియు #Run4India మరియు #AzadikaAmritMahotsav తో వారి సోషల్ మీడియా ఛానెళ్లలో ప్రచారం చేయవచ్చు.

ప్రముఖ వ్యక్తులు, ప్రజా ప్రతినిధులు, పిఆర్‌ఐ నాయకులు, సామాజిక కార్యకర్తలు, క్రీడాకారులు, మీడియా ప్రతినిధులు, వైద్యులు, రైతులు మరియు ఆర్మీ సిబ్బంది పాల్గొనడానికి, ప్రోత్సహించడానికి మరియు వివిధ స్థాయిలలో ఈ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కొవిడ్-19 ప్రోటోకాల్‌లను అనుసరించడం ద్వారా దేశవ్యాప్తంగా భౌతికంగా మరియు వర్చువల్ గా ఈవెంట్‌లు నిర్వహించబడుతున్నాయి.


 

*******



(Release ID: 1745656) Visitor Counter : 243