ప్రధాన మంత్రి కార్యాలయం

గోల్ఫ్క్రీడాకారిణి అదితి అశోక్ ను ఆమె కనబరచిన నైపుణ్యానికి, దృఢనిశ్చయానికి గానుప్రశంసించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 07 AUG 2021 11:18AM by PIB Hyderabad

గోల్ఫ్ క్రీడాకారిణి అదితి అశోక్ ను ఆమె కనబరచిన నైపుణ్యానికి, దృఢ నిశ్చయానికి గాను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమె ను ప్రశంసించారు. ఒలింపిక్స్ లో ఆమె ఆటతీరు ఉత్తమంగా ఉందని ఆయన అన్నారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో -

‘‘@aditigolf మీరు చాలా చక్కగా ఆడారు. మీరు #Tokyo2020 లో గొప్ప ప్రావీణ్యాన్ని, దృఢ సంకల్పాన్ని చాటిచెప్పారు. పతకం కొద్ది లో చేజారితే చేజారి ఉండవచ్చును; కానీ, మీరు భారతదేశం లో మరే వ్యక్తి కన్నా తీసిపోకుండా గొప్పది అయినటువంటి ఒక కార్యాన్ని చేసి చూపెట్టారు, అంతే కాదు అందరికి ఒక ఉదాహరణ గా కూడాను మీరు నిలచారు. మీ భావి ప్రయాసల కు గాను ఇవే శుభాకాంక్షలు.’’ అని పేర్కొన్నారు.

***

DS


(रिलीज़ आईडी: 1743661) आगंतुक पटल : 211
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada