ప్రధాన మంత్రి కార్యాలయం

మీరుఅత్యుత్తమ ప్రదర్శన ని చాటారు.. మరి ముఖ్యమైంది అదే: ఫెన్సర్ భవాని దేవి గారి నిఅభినందించిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 26 JUL 2021 9:55PM by PIB Hyderabad

ఒలింపిక్స్ లో జరిగిన కత్తిసాము పోటీ లో భారతదేశం తరపున ఒకటో విజయాన్ని నమోదు చేసి, ఆ తరువాతి రౌండ్ లో పరాజయం పాలైన కత్తిసాము క్రీడాకారిణి సి ఎ భవానీ దేవి గారి ప్రయత్నాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.

ఒలింపిక్స్ లో పాల్గొన్న క్రీడాకారిణి నమోదు చేసిన ఒక భావోద్వేగ భరితమైనటువంటి ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ తాను కూడా ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు.

‘‘ మీరు మీ వంతు గా అత్యుత్తమమైనటువంటి ప్రదర్శన ను ఇచ్చారు. మరి ముఖ్యం గా పరిగణించవలసింది దానినే. గెలుపు లు, ఓటములు అనేవి జీవితం లో ఒక భాగం గా ఉంటూనే ఉంటాయి.

మీ తోడ్పాటు ను చూసుకొని భారతదేశం చాలా గర్వపడుతోంది. మీరు మన భారతదేశం పౌరుల కు ఒక ప్రేరణ గా ఉన్నారు. ’’

***

DS/SH


(रिलीज़ आईडी: 1739379) आगंतुक पटल : 195
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Malayalam , English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada