ప్రధాన మంత్రి కార్యాలయం

జూన్‌ 5 న ప్రపంచ పర్యావరణ దిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 04 JUN 2021 7:37PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్‌ మాధ్యమం ద్వారా 2021 జూన్‌ 5న ఉదయం 11 గంటలకు ప్రపంచ పర్యావరణ దిన కార్యక్రమం లో పాలుపంచుకోనున్నారు.  ఈ కార్యక్రమాన్ని పెట్రోలియం & సహజ వాయువుల మంత్రిత్వశాఖ,  పర్యావరణం, అడవులు, జలవాయు పరివర్తన మంత్రిత్వ శాఖ లు సంయుక్తం గా ఏర్పాటు చేయడం జరుగుతోంది.  “మెరుగైన పర్యావరణ కోసం జీవ ఇంధనాలకు ప్రోత్సాహం ఇవ్వడం” అనే అంశాన్ని ఈ సంవత్సర కార్యక్రమాని కి ఇతివృత్తం గా తీసుకోవడమైంది.

ఈ కార్యక్రమం లో భాగం గా, ప్రధాన మంత్రి “భారతదేశం లో 2020-2025 మధ్య కాలం లో ఇథెనాల్ సమ్మిశ్రణానికి సంబంధించిన మార్గ సూచీ విషయం లో నిపుణుల సంఘం నివేదిక” ను ఆవిష్కరించనున్నారు.  ప్రపంచ పర్యావరణ దినాన్ని పాటించే క్రమం లో, భారత ప్రభుత్వం 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 20 శాతం వరకు ఇథెనాల్ ను కలిపిన పెట్రోల్ ను  విక్రయించాల్సిందిగా చమురు కంపెనీల ను ఆదేశించడం తో పాటు అధిక మోతాదు లో ‘ఇ12, ఇ15’ కు సంబంధించిన ‘బీఐఎస్‌’ ప్రమాణాల ను వెల్లడి చేస్తూ ఇ-20 నోటిఫికేషన్‌ ను కూడా ను జారీ చేయనుంది.  ఈ చర్యల తో ఇథెనాల్ డిస్టిలేశన్ లో అదనపు సామర్థ్యం కలిగివుండేటటువంటి ప్లాంటు ల ఏర్పాటు కు వీలు కలుగుతుంది.  దేశం అంతటా మిశ్రిత ఇంధనాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం కోసం వ్యవధి ని ఇవ్వడం జరుగుతుంది.  దీనితో 2025 కన్నా ముందే ఇథెనాల్ ఉత్పాదక రాష్ట్రాలు, చుట్టుపక్కల ప్రాంతాల లో ఇథెనాల్ వినియోగాన్ని పెంచడం లో తోడ్పాటు లభించగలదు.

ప్రధాన మంత్రి పుణే లో మూడు చోట్ల ‘ఇ 100’ తాలూకు పంపిణీ కేంద్రాల తో కూడిన ఒక ప్రయోగాత్మక పథకాన్ని ప్రారంభించనున్నారు.  ప్రధాన మంత్రి ఇథెనాల్ మిశ్రిత పెట్రోలు, కంప్రెస్ డ్ బయోగ్యాస్ కార్యక్రమాల లో భాగం గా రైతుల ప్రత్యక్ష అనుభవాల ను గురించి తెలుసుకోవడం కోసమని వారితో మాట్లాడుతారు.

 


 

***


(Release ID: 1724604) Visitor Counter : 250