హోం మంత్రిత్వ శాఖ

ఆరోగ్య కేంద్రాలు, కోవిడ్‌-19 సౌక‌ర్యాల‌లో అగ్ని ప్రమాదాల‌ను అరిక‌ట్టే దిశ‌గా త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాల్సిందిగా రాష్ట్రాలు, యుటీలకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ చ‌ర్య‌లు


- ఆసుపత్రులు, మెడికల్ ఫెసిలిటీల‌తో పాటు కోవిడ్ ప్ర‌త్యేక చికిత్స కేంద్రాల‌కు నిరంత‌రాయ‌ విద్య‌త్తు సరఫరా ఉండేలా అస‌ర‌మైన చ‌ర్య‌ల‌ను తీసుకోవాల్సిందిగా ఎంహెచ్ఏ సూచ‌న

Posted On: 05 MAY 2021 1:04PM by PIB Hyderabad

దేశ వ్యాప్తంగా ఇటీవ‌లి కాలంలో వివిధ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లలో షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్న నేప‌థ్యంలో వీటి నివార‌ణ దిశ‌గా
కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) దృష్టి సారించింది. ఇలాంటి వాటి నివార‌ణ‌కు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలు త‌గిన చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని కేంద్ర‌
హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) సూచించింది. అగ్ని ప్ర‌మాదాల నివార‌ణకు సంబంధించి కేంద్ర హోం శాఖ కార్య‌ద‌ర్శి రాష్ట్ర ప్ర‌ధాన‌ కార్యదర్శులు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నిర్వాహకులకు ఈరోజు వ‌ర్త‌మానం పంపించారు. దీనిలో ఇటీవలి అగ్ని ప్ర‌మాదం సంఘటనల నేపథ్యంలో మరియు ముఖ్యంగా రాబోయే వేసవి తీవ్ర‌త దృష్ట్యా అగ్నిప్ర‌మాదాల నివార‌ణ దిశ‌గా త‌గు చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిన అవసరం ఉందని తెలిపారు. అధిక ఉష్ణోగ్ర‌త‌లు, అంత‌ర్గ‌త వైరింగ్‌పై హైలోడ్‌, నిర్వ‌హ‌ణ లోపం కార‌ణంగా షార్ట్‌సర్క్యూట్‌ జ‌రుగుతోంది. ఇది అగ్నిప్ర‌మాదాల‌కు
దారి తీసి గ‌ణ‌నీయమైన ప్రాణన‌ష్టం, ఆస్తి న‌ష్టాల‌కు దారి తీస్తోంది. ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలోని ఆరోగ్య సదుపాయాలలో (ముఖ్యంగా కోవిడ్‌-19 చికిత్స అందిస్తున్న‌ సౌకర్యాలు) ఎటువంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా చూసేందుకు, కార్యాచరణ ప్రణాళికను అమలు చేయడానికి జాగ్రత్త వహించాలని హోం శాఖ త‌న కమ్యూనికేషన్‌లో పేర్కొంది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల‌
ప‌రిపాల‌న విభాగాలు ఆరోగ్య, విద్యుత్, అగ్నిమాపక విభాగాల అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించాలని కేంద్ర హోం శాఖ సూచించింది. అన్ని ర‌కాల‌ ఆసుపత్రులు, ఆరోగ్య సదుపాయాలలో అగ్నిమాప‌క‌ చర్యలు అమలయ్యేలా.. సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ఈ లేఖ‌లో హోం శాఖ అభ్యర్థించింది. ఫీల్డ్ అధికారులు క్షేత్రస్థాయిలో ప‌ర్య‌టించేలా తగు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించింది. నిర్ధేశిత అగ్నిమాపక భద్రతా మార్గదర్శకాల ప్రకారం అంతర్గత వైరింగ్‌లు, క్రియాత్మక భద్రతా పరికరాల లభ్యతను పరిశీలించడానికి, వాటి ఏర్పాట్లు స‌క్ర‌మంగా జ‌రిగేలా ఆయా భ‌వ‌నాల‌లో అధికారులు ప్ర‌త్య‌క్షంగా ప‌ర్య‌టించేలా త‌గు ఆదేశాలు జారీ చేయాల‌ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, యుటీల‌ను అభ్యర్థించింది. ఏవైనా లోపాలు కనిపించినట్లయితే అవసరమైన పరిష్కార చర్యలు వెంటనే చేపట్టాల‌ని కోరింది. ఆయా నర్సింగ్ హోమ్‌లలో అగ్ని భద్రతపై డైరెక్టర్ జనరల్ (ఫైర్ సర్వీసెస్, సివిల్ డిఫెన్స్ మరియు హోమ్ గార్డ్స్), ఎంహెచ్‌ఏ ఇటీవల విడుదల చేసిన అడ్వైజ‌రీల‌పై దృష్టి సారించాల‌ని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచ‌న‌లు చేసింది.
దేశ వ్యాప్తంగా కోవిడ్ చికిత్స నిమిత్తం ప్ర‌త్యేకంగా ఏర్పాటు చేసిన వివిధ‌ ఆరోగ్య సదుపాయాలలో పెద్ద సంఖ్యలో కోవిడ్‌-19 కేసులు చికిత్సలో ఉన్న విష‌యాన్ని
ఈ లేఖ ప్ర‌ధానంగా పేర్కొంది. ఈ చికిత్స‌ల‌లో చాలా సందర్భాలలో, ఆక్సిజన్ మద్దతు ఉన్నపడకలు, ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు క్లిష్టమైన జోక్యం ఎంతో అవ‌స‌రం. కావున అన్ని ఆసుపత్రులలో మరియు వైద్య సదుపాయాలలో 24x7 ప్రాతిపదికన నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడటం ఎంత‌గానో ముఖ్యం అని ఈ లేఖ పేర్కొంది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో దేశంలో ప్రతి ప్రాణాన్ని కాపాడటం ఎంతో ముఖ్య‌మ‌ని ఈ లేఖలో హోంశాఖ నొక్కి చెప్పింది. ఏదైనా అవాంఛిత సంఘటనను నివారించడానికి గాను ముందే అవసరమైన చర్యలు తీసుకోవడం అవ‌స‌రం. త‌ద్వారా కోవిడ్‌-19ను నిర్వహించేలా అన్ని ఆరోగ్య సదుపాయాలకు అవసరమైన మద్దతు లభించేలా చూడటం చాలా అవసర‌మ‌ని తెలిపింది.
                               

***


(Release ID: 1716550) Visitor Counter : 236