ప్రధాన మంత్రి కార్యాలయం

100 మిలియన్ మోతాదుల కోవిడ్-19 టీకాలు వేసిన అత్యంత వేగవంతమైన దేశంగా - భారతదేశం

Posted On: 10 APR 2021 9:02PM by PIB Hyderabad

వంద మిలియన్ మోతాదుల కోవిడ్ -19 టీకాలు వేసిన ప్రపంచంలో అత్యంత వేగవంతమైన దేశంగా భారతదేశం నిలిచింది. భారతదేశం, ఈ ఘనతను కేవలం 85 రోజుల్లో సాధించగా, అమెరికా 89 రోజులకు, చైనా 102 రోజులకు, ఈ మైలురాయిని చేరుకున్నాయి.

 

ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం, సామాజిక మాధ్యమం ద్వారా ఒక ట్వీట్ చేస్తూ, “ఆరోగ్యకరమైన మరియు కోవిడ్ -19 రహిత భారతదేశాన్ని నిర్ధారించే ప్రయత్నాలకు ఇది బలాన్ని చేకూర్చింది" అని, వివరాలను ప్రకటించింది.

 

*****



(Release ID: 1710953) Visitor Counter : 260