ప్రధాన మంత్రి కార్యాలయం

క‌థక‌ళీ శ్రేష్ఠ క‌ళాకారుడు, గురు శ్రీ చెమ‌న్‌చేరీ కున్హీరామ‌న్‌ నాయ‌ర్ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి‌

Posted On: 15 MAR 2021 4:51PM by PIB Hyderabad

క‌థక‌ళీ శ్రేష్ఠ క‌ళాకారుడు, గురు శ్రీ చెమ‌న్‌చేరీ కున్హీరామ‌న్ నాయ‌ర్ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్య‌క్తం చేశారు.

 

 ‘‘క‌థక‌ళీ శ్రేష్ఠ క‌ళాకారుడు, గురు శ్రీ చెమ‌న్‌చేరీ కున్హీరామ‌న్ నాయ‌ర్ మ‌ర‌ణం దుఃఖదాయ‌కం. భార‌తీయ సంస్కృతి అన్నా, ఆధ్మాత్మిక‌త అన్నా ఆయ‌న కు గ‌ల ఉద్వేగం విశిష్ట‌మైనటువంటిది. మ‌న శాస్త్రీయ నాట్యాల లో వ‌ర్ధ‌మాన ప్ర‌తిభావంతుల‌ ను దిద్ది తీర్చడం కోసం ఆయ‌న చేసిన కృషి అపూర్వం. ఆయ‌న కుటుంబాని కి, అభిమానుల‌ కు క‌లిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఓమ్ శాంతి’’ అని ఒక ట్వీట్ లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.

***(Release ID: 1704920) Visitor Counter : 66