ప్రధాన మంత్రి కార్యాలయం

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ క‌థ‌నాన్ని ఈ నెల 11న ఆవిష్క‌రించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

Posted On: 10 MAR 2021 4:56PM by PIB Hyderabad

భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం తాలూకు కిండ‌ల్ మాధ్యమ క‌థ‌నాన్ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ గురువారం నాడు, అంటే ఈ నెల 11న, ఉద‌యం 10.25 గంటల కు వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తి లో ఆవిష్క‌రించ‌నున్నారు.  ఈ సంద‌ర్భం లో ప్రధాన మంత్రి ప్ర‌సంగిస్తారు కూడాను.  భ‌గ‌వ‌ద్ గీత కు స్వామి చిద్భ‌వానందజీ వ్యాఖ్యానం ప్రతులు 5 ల‌క్ష‌ల పైచిలుకు అమ్ముడవటాన్ని స్మ‌రించుకొనేందుకు ఈ కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేయ‌డ‌మైంది.

స్వామి చిద్భ‌వానందజీ త‌మిళ నాడు కు చెందిన తిరుచిరాప‌ల్లి లోని తిరుప్ప‌రైతురై లో ఉన్న శ్రీ రామ‌కృష్ణ త‌పోవ‌నం ఆశ్ర‌మ వ్య‌వ‌స్థాప‌కుడు.  స్వామీజీ అన్ని ర‌కాల సాహిత్య ప్ర‌క్రియ‌ల లోను 186 గ్రంథాల ను ర‌చించారు.  గీత తాలూకు ఆయ‌న సాహిత్య ప్ర‌క్రియ ఆ అంశం పై వెలువడ్డ అతి విస్తృత‌ గ్రంథాల‌ లో ఒక‌టి గా ఉంది.  ఆయ‌న వ్యాఖ్య‌ల‌ తో కూడిన గీత త‌మిళ క‌థ‌నాన్ని 1951లో ప్ర‌చురించ‌గా, ఇంగ్లీషు క‌థ‌నాన్ని 1965 లో ప్ర‌చురించ‌డం జ‌రిగింది.  దీని తెలుగు, ఒడియా, జ‌ర్మ‌న్‌, జ‌పాన్ భాషానువాదాల బాధ్య‌త ను భక్తులు తామే స్వీకరించారు.


 

*** 



(Release ID: 1703874) Visitor Counter : 167