ప్రధాన మంత్రి కార్యాలయం

ఇస్రో, ఎన్‌.ఎస్‌.ఐ.ఎల్ లు పిఎస్ఎల్‌వి- సి51అమ‌జోనియా -1 మిష‌న్ ప్ర‌త్యేక వాణిజ్య ప్ర‌యోగాన్ని

విజ‌య‌వంతం చేసినందుకు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 28 FEB 2021 1:24PM by PIB Hyderabad

పిఎ ఎస్ ఎల్‌వి- సి 51, అమెజోనియా -1 మిష‌న్ తొలి ప్ర‌త్యేక వాణిజ్య ప్ర‌యోగాన్ని విజ‌య‌వంతంగా చేప‌ట్టినందుకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ ఇస్రో, ఎన్‌.ఎస్‌.ఐ.ఎల్ శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు.
ఇందుకు సంబంధించి ఆయ‌న ట్వి్ట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ , తొలి ప్ర‌త్యేక వాణిజ్య ప్ర‌యోగ‌మైన పిఎస్ెల్‌వి-సి 51, అమెజోనియా-1 మిష‌న్‌ను విజ‌య‌వంతంగా చేప‌ట్టినందుకు ప్ర‌ధాన‌మంత్రి ఇస్రో, ఎన్‌.ఎస్‌.ఐ.ఎల్ శాస్త్ర‌వేత్త‌ల‌ను అభినందించారు. ఇది దేశంలో అంతరిక్ష రంగ సంస్క‌ర‌ణ‌ల‌లో కొత్త‌శ‌కానికి నాంది కాగ‌ల‌ద‌ని అన్నారు. నాలుగు చిన్న ఉప‌గ్ర‌హాల‌తోపాటు 18 ఉప‌గ్ర‌హాలు దీనితో ప్ర‌యోగించారు. చిన్న ఉపగ్ర‌హాల ప్ర‌యోగం యువ‌త వినూత్న ఆలోచ‌న‌ల స్ఫూర్తికి నిద‌ర్శ‌న‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి అన్నారు.
 ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాన‌మంత్రి, బ్రెజిల్ అధ్య‌క్షుడు జెయిర్ బొల్‌సొనారోను అభినందించారు. బ్రెజిల్ అమ‌జోనియా -1 ఉప‌గ్ర‌హాన్ని పిఎస్ఎల్‌వి సి-51 ద్వారా విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు అభినంద‌న‌లు తెలిపారు.

మ‌రో ట్వీట్‌చేస్తూ ప్ర‌ధాన‌మంత్రి, కంగ్రాచులేష‌న్స్ ప్రెసిడెంట్ జెయిర్‌బొల్‌సొనారో, బ్రెజిల్ అమెజోనియా-1 ఉప‌గ్ర‌హాన్ని పిఎస్ఎల్‌వి -సి 51ద్వారా విజ‌య‌వంతంగా ప్ర‌యోగించినందుకు అభినంద‌న‌లు. ఇది  మ‌న అంత‌రిక్ష స‌హ‌కారంలో ఒక చరిత్రాత్మ‌క ఘ‌ట్టం. బ్రెజిల్ శాస్త్ర‌వేత్త‌ల‌కు నా అభినంద‌న‌లు.
-- న‌రేంద్ర‌మోదీ,ఫిబ్ర‌వ‌రి 28,2021

***(Release ID: 1701576) Visitor Counter : 206